Search
  • Follow NativePlanet
Share
» » బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం లేదా కన్నడ భాషలో చెప్పబడే బెళగావి పట్టణం కర్ణాటక రాష్ట్రంలో వాయువ్య దిశలో మహారాష్ట్ర మరియు గోవా రాష్ట్రాలు సరిహద్దులుగా వుంది. బెల్గాం పట్టణంలో ప్రధాన అంశం అక్కడి ఆహ్లాదకర వాతావరణం. కర్నాటక రాష్ట్రంలో రెండవ రాజధానిగా పేరు పడిన బెల్గాంలో రాష్ట్ర పరిపాలనా భవనం సువర్ణ విధాన సౌధ కలదు. ఇక్కడ అమలు చేయబడుతున్న అభివృద్ధి పధకాలు టూరిస్ట్ కార్యకలాపాలను అధికం చేస్తున్నాయి. బెంగుళూరు నుండి బెల్గాం కు గల 505 కి. మీ. ల దూరం సుమారు 7 గంటల సమయంలో ప్రయాణించవచ్చు.

బెంగుళూరు - పూనే జాతీయ రహదారి లేదా నేషనల్ హై వే నెం.4 పైన ప్రయాణించి చారిత్రక బెల్గాం పట్టణం చేరవచ్చు. మన జాతి పిత మహాత్మా గాంధి బెల్గాం పట్టణాన్ని 1924 సంవత్సరం డిసెంబర్ లో జరిగిన ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభకు సందర్శించారు. మీరు తప్పక చూడవలసిన పర్యాటక ఆకర్షణలు బెల్గాం లో అనేకం కలవు.

 బెల్గాం పర్యటన ఆనందాలు !
బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !

ప్రసిద్ధ నయాగర జలపాతాల వలెనె వుండే గోకక్ జలపాతాలు బెళగం లోని గోకక్ విలేజ్ లో కలవు. ఘట ప్రభ నది వలన ఏర్పడే ఈ గోకక్ ఫాల్స్ వద్ద మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే ఒక పెద్ద బ్రిజ్ కలదు. గోకక్ అక్కడ దొరికే రుచికర స్వీట్ ' గోకక్ కరదంటు' కు పేరుపడింది. వెళ్ళినపుడు తినటం మరువకండి.

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !


ఈ ప్రదేశాన్ని హల్షి అని కూడా అంటారు. ఇది బెల్గాం యొక్క ఖానాపుర తాలూక్ లో కలదు. ఖానాపుర రైల్వే స్టేషన్ కు ఆగ్నేయ దిశగా కల హలసి ఒకప్పుడు కదంబ రాజ వంశానికి రాజధానిగా వుండేది. ఇక్కడ కల లక్ష్మి నరసింహ టెంపుల్ శిల్ప శైలి అద్భుతంగా వుండి పర్యాటకులను అధిక సమయం ఆకర్షిస్తుంది. ఇక్కడ ఒక దానికి ఎదురు గా మరొకటి గా రెండు టెంపుల్స్ కలవు. కుడి వైపున లక్ష్మి దేవి తో కలసిన శ్రీ మహావిష్ణువు వుండగా, దాని వెనుకగా సూర్యనారాయణ ఉంటాడు. ఎడమ వైపున వరాహ విగ్రహం వుంటుంది. విష్ణువు విగ్రహం పక్కనే నరసింహ స్వామీ విగ్రహం వెలసిందని చెపుతారు.

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !

స్థానికంగా దీనిని సావుదాట్టి అంటారు. ఇది బెల్గాం లో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడ కల ఎల్లమ్మ దేవత గుర్తుగా ఈ ప్రదేశాన్ని ఎల్లమ్మ గుడ్డ అని కూడా పిలుస్తారు. అనేకమంది భక్తులు వచ్చి దర్సిన్చుకొంటారు. సౌన్దట్టి పట్టణం ఒకప్పుడు రట్ట రాజులకు కేపిటల్ గా వుండేది. 18 వ శతాబ్దంలో సారసంగి దేశాయ్ ఇక్కడ ఒక టెంపుల్, మరియు కోటను అనేక శిల్పాలతో నిర్మించాడు.

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం లోని ఈ ప్రదేశంలో శ్రీ కుమార స్వామి పేరు కల ఒక యోగి ముక్తి పొందాడు. మాల ప్రభ నదిచే ఏర్పడ్డ రేణుక సరస్సు ఒడ్డున కల సౌన్దట్టి కి సమీపంలో నవిల తీర్థ ప్రదేశం వుంటుంది.

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !

ఈ ప్రదేశం నవిల తీర్థ కు 26 కి. మీ. ల దూరంలో వుంది. అనేక పురావస్తు అవశేషాలు రాతి శాశనాలు కలిగి వుంది. స్థానికులు ఈ ప్రదేశ చరిత్రను వివరిస్తారు. ఈ ప్రదేశ అందాలకు ముగ్ధులు అవ్వాల్సిందే. ఈ ప్రదేశం సుగోలా అనబడే ఒక మహర్షి యొక్క నివాసం. ఇక్కడ శివ పార్వతుల కల్యాణం జరిగిందని చెపుతారు. సోగాల్ , ఇక్కడ కల జలపాతాలకు కూడా ప్రసిద్ధి.

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం పర్యటన ఆనందాలు !

బెల్గాం కు వాయువ్యం గా కల ఈ ప్రదేశం మహా రాష్ట్రలోని సింధు - దుర్గ కు సరిహద్దు గా వుంటుంది. బెల్గాం నుండి అమ్బోలి ఘాట్ 68 కి. మీ. ల దూరం. సహ్యాద్రి పర్వత శ్రేణులలో కల అందమైన ఈ అమ్బోలి ప్రదేశం మీ సెలవుల విహారానికి అనుకూలమైన ఖచ్చితమైన ప్రదేశం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+