Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌యాణానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ విష‌యాల‌ను మ‌ర్చిపోవ‌ద్దు!

ప్ర‌యాణానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ విష‌యాల‌ను మ‌ర్చిపోవ‌ద్దు!

ప్ర‌యాణానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ విష‌యాల‌ను మ‌ర్చిపోవ‌ద్దు!

స‌మ్మ‌ర్ హాలిడేస్ వ‌చ్చేస్తున్నాయ్‌. ఈ స‌మ‌యం కుటుంబ‌స‌మేతంగా విహారానికి అనువైన‌దిగా భావిస్తారు. సాధారణంగా వేసవి కాలం అంటేనే పిల్లలకు ఎక్కువ రోజులు సెలవులు వస్తాయి. కాబట్టి కచ్చితంగా దూరప్రాంతాలకు విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. అయితే కుటుంబంతో క‌లిసి విహార‌యాత్ర‌కు వెళ్లే స‌మ‌యంలో ప్ర‌యాణానికి అవ‌స‌ర‌మైన టికెట్‌ల బుకింగ్ మొద‌లుకుని మ‌ళ్లీ తిరుగు ప్ర‌యాణం అయ్యే వ‌ర‌కూ ఎన్నో జాగ్ర‌త్త‌తుల తీసుకోవాల్సి ఉంటుంది.

అందుకే ఈ వేస‌వి సెల‌వుల‌కు విహారానికి వెళ్లాల‌నుకునేవారికి కొన్ని విష‌యాల‌ను గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. మేం తెలియ‌జేయ‌బోయే ఈ అంశాలు మీకు త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం. మ‌రెందుకు ఆల‌స్యం ఆ విష‌యాలేంటో చూసేద్దామా.

medicalkit1

కుటుంబంతో విహార యాత్ర కోసం పూర్తిస్థాయిలో ప్ర‌ణాళిక ఉండాల్సిందే. ఏదో హడావుడిగా యాత్రకు బయల్దేరి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. వారం రోజులు ముందుగానే సిద్ధపడాలి. టూరిస్ట్‌ బస్సుల్లో వెళ్తే స్మార్ట్‌ఫోన్‌ను రెడీగా ఉంచుకోవాలి. అలాగే, ఆయా ప్రదేశాల్లో దొరికే పదార్థాలు, వసతులు లభించే చోట్ల గురించి ముందుగానే తెలుసుకోవాలి. చూడాల్సిన ప్రదేశాలను ముందుగా బుక్‌లో రాసుకోవాలి. అక్కడ మనకు కావాల్సిన ఆహార పదార్థాలు లభించకపోతే మనతో పాటే తీసుకెళ్లాలి. దుస్తులు పరిమితంగా ఉంచుకోవాలి. లేదంటే లగేజీ పెరిగిపోతుంది.

ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్తలు

టూర్‌కు వెల్లేవారు త‌ప్ప‌నిస‌రిగా తమ వెంట మెడికల్‌ కిట్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే రుగ్మతలతో పాటు ప్రమాదాలు జరిగినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఈ కిట్లు ఉపయోగపడతాయి. వీటితో టించర్‌, అయోడిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, గాజు, గుడ్డతో పాటు వ్యాధులకు సంబంధించిన మందులు ఉండేలా చూడాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు విహార యాత్ర ఎన్ని రోజులు జరుగుతుందో అంతకు రెట్టింపు రోజులకు సరిపడే మందులు కిట్‌లో ఉంచుకోవాలి.

laguage

ల‌గేజ్ విష‌యంలో అల‌స‌త్వం వ‌ద్దు..

చాలామంది టూర్ ల‌గేజీ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కానీ ల‌గేజ్ బ్యాగ్‌ను ఎంచుకునే విధానంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అన్ని వస్తువులు లోపల పట్టే విధంగా చూసుకోవాలి. తేలికపాటి, లోపల ఎక్కువ స్థలం ఉండే బ్యాగులు తీసుకెళ్లాలి. బ్యాగులో తేలికపాటి దుస్తులు, నూలు వస్ర్తాలు, దుప్పట్లు ఉండే విధంగా, జాగ్రత్తగా సర్దుకోవాలి. అలాగే, విహార యాత్రకు వెళ్లేవారు తమ వెంట ప్లాస్క్‌ను తీసుకెళ్లడం చాలా మంచిది. మీ జర్నీలో సకాలంలో టీ, కాఫీ వంటివి దొరక్కపోతే ప్లాస్క్‌లో నిల్వ ఉంచిన టీ, కాఫీ ఎంతో ఉపయోగపడుతాయి. మరో వైపు చలి ప్రాంతాల్లో అయితే కప్పులో కాఫీ పోసుకుని సిప్‌ జర్నీ చేయవచ్చు. ప్లాస్క్‌తో పాటు సాసర్‌, కప్పులు ఉంటే మంచిది.

traveldairy1

డైరీని అస్సులు మ‌ర్చిపోవ‌ద్దు..

జ‌ర్నీ అంటేనే జ్ఞాప‌కాల స‌మ్మేళ‌నం. అందుకే, విహార యాత్రకు వెళ్లేవారు తమ వెంట కెమెరాను, డైరీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ప్రతి సారీ కెమెరానే వినియోగించకుండా పరిసరాలను ఆస్వాదించాలి. డైరీలో ముఖ్యమైన సంఘటనలు అనుభూతులు రాసుకోవడం ఎంతో మంచిది. మరో వైపు ప్రయాణం జరిగే తీరు, రూట్‌ వివరాలు డైరీలో రాసుకుంటే ఇతరులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మీ ప్ర‌యాణం సుఖ‌మ‌యంగా పూర్తి అయ్యేందుకు పై అంశాలు మీకు త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని భావించ‌వచ్చు. హ్యేపీ జ‌ర్నీ!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+