భారతదేశం దాని సంస్కృతి, సంప్రదాయాలతో పాటు వివిధ వాటికి ప్రసిద్ధిచెందింది. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు చూసేందుకు ఇక్కడ చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అంతే కాదు, ఇండియాలోని ఎక్కువ శాతమంది ప్రజలు ఇష్టపడే రవాణా వ్యవస్థలో రైలు మార్గం ముందుంటుంది. ఎందుకంటే, ఇది అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుంది. ఇక్కడ అనేక అందమైన రైలు మార్గాలు కూడా ఉన్నాయి. ప్రకృతి నడుమ రైలు ప్రయాణం జీవితంలో మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. అలాంటి రైలు మార్గాలు కూడా ఉన్నాయి. చుట్టు ఎటుచూసిన పచ్చని ప్రకృతి వాటి మధ్యలో రైలు ప్రయాణం.. అలాంటి అనుభూతిని మీరు ఆస్వాదించాలనుకుంటే మాత్రం తప్పకుండా దేశంలోని ఈ అందమైన రైల్వే మార్గాల గురించి తప్పకు తెలుసుకోవాల్సిందే...
భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది దేశం మొత్తాన్ని కలుపుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఈ రైల్వేలు కలుపుతుంటాయి. ఇక్కడ అనేక రైల్వే ట్రాక్‌లలో ప్రయాణం ఎంతో అందంగా ఉంటుంది. ఈ రైలు మార్గాలు చాలా అందమైన ప్రదేశాల గుండా వెళతాయి.

డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్చబడిన ఈ నారో గేజ్ రైల్వే ట్రాక్‌పై ప్రయాణించడం పర్యాటకులకు మరో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఈ అందమైన రైడ్‌ని ఆస్వాదించడానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు డార్జిలింగ్‌కు తరలివస్తుంటారు. ఇక్కడి టాయ్ ట్రైన్ అందమైన పర్వతాల గుండా పర్యాటకులను తీసుకెళ్తుంది. ఇక్కడ మౌంట్ కాంచన్‌జంగా వంటి అద్భుతమైన వీక్షణలను కూడా చూడొచ్చు.
హిమాలయన్ క్వీన్ (కల్కా-సిమ్లా)
కల్కా నుండి సిమ్లా వరకు ఉన్న రైల్వే మార్గం పర్యాటకులకు అత్యంత అందమైన రైలు ప్రయాణాన్నిఅందిస్తుంది. కల్కా-సిమ్లా రైలు మార్గం UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంలో చేర్చింది. ఈ మార్గంలో నడిచే రైళ్లు టాయ్ రైళ్లను పోలి ఉంటాయి. ఈ 96 కిలోమీటర్ల పొడవైన మార్గం 102 సొరంగాలు , 82 వంతెనల గుండా ప్రయాణాన్నిసాగిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణం సుమారు ఐదు గంటల పాటు కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో పైన్ చెట్లు, ఓక్స్, లోయలు, దేవదారు, రోడెండ్రాన్ అడవుల వంటి ప్రకృతి సౌందర్యాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ రైలు మార్గం 20 రైల్వే స్టేషన్లు, 900 మలుపుల గుండా సిమ్లా చేరుకుంటుంది.

కాంగ్రా వ్యాలీ రైల్వే (పఠాన్‌కోట్-జోగీందర్‌నగర్)
కాంగ్రా వ్యాలీ రైల్వే భారతదేశంలోని అత్యుత్తమ రైల్వేలలో ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఈ మార్గం గుండా ప్రయాణమంటే, పర్యాటకులు క్యూ కడుతుంటారు. ధౌలాధర్ పర్వత శ్రేణి అందమైన దృశ్యాలను అనుభవించే అవకాశాన్ని పొందాలని చాలామందికి ఉంటుంది. ఈ రైలు మార్గం పఠాన్ కోట్ నుండి జోగిందర్‌నగర్ వరకు ఉంటుంది.
ఎడారి రాణి (జైసల్మేర్-జోధ్‌పూర్)
ఢిల్లీ జైసల్మేర్ ఎక్స్‌ప్రెస్‌లో జోధ్‌పూర్ నుండి జైసల్మేర్ వరకు రైలు ప్రయాణం పర్యాటక ప్రేమికులకు చిరస్మరణీయమైనదిగా నిలుస్తోంది. 'డెసర్ట్ క్వీన్' అనే ఈ రైలులో సుమారు 6 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. ఈ రైలు ప్రయాణంలో రాజస్థాన్ ఎడారి దృశ్యాలను వీక్షించొచ్చు. ఈ ప్రయాణంలో జిరోఫైటిక్ చెట్లు, పసుపు నేలలు, అక్కడక్కడ పుట్టలు, ఒంటెలు ,ఎడారి నివాసాలు పర్యాటకులకు తారసపడతాయి. ఈ రైలు మార్గం రాజస్థాన్‌లోని థార్ ఎడారిలోని పొడి అడవులు మరియు బంజరు భూముల గుండా వెళుతుంది.



Click it and Unblock the Notifications












