Search
  • Follow NativePlanet
Share
» »హంపి, తాజ్ మహల్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్స్ లో వెళ్లారా

హంపి, తాజ్ మహల్ వద్ద హాట్ ఎయిర్ బెలూన్స్ లో వెళ్లారా

హాట్ ఎయిర్ బెలూన్స్ కు సంబంధించిన కథనం.

భారత దేశంలో సాహస పర్యాటకం అదే అడ్వెంచర్ టూరిజం ఇప్పుడిప్పుడే ప్రాచూర్యం చెందుతూ ఉంది. అందులోనూ హాట్ ఎయిర్ బెలూన్ పై సాహసవీరులు ముఖ్యంగా యువత మక్కువ పెంచుకొంటూ ఉన్నారు. కొంత ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు ఆ బెలూన్ లో ఆకాశ మార్గంలో ప్రయాణించాలని తహతహలాడుతూ ఉన్నారు. ఇటువంటి వారి కోసమే ఈ కథనం.

ఇందులో ఇప్పుడిప్పుడే హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన ప్రదేశాల గురించి వివరించాం. ఇక హాట్ ఎయిర్ బెలూన్ లో రైడ్ చేయాలంటే వాతావరణం కూడా అనుకూలించాలి. అందువల్ల మీరు ఆయా ప్రాంతాలకు వెళ్లిన సమయంలో వాతారవణం కూడా మీకు అనుకూలిస్తే ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ భూమి పై అందాలను చూడవచ్చు.

హాట్ ఎయిర్ బెలూన్ కు సాధారణంగా ఈ ఆగస్టు నెల కొంత వరకూ బాగానే ఉంటుంది. అంతే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఎల్లప్పుడూ ఈ హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయం అందుబాటులో ఉండదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే ఆ అవకాశం దక్కుతుంది. ఉదహారణకు హంపి.

పుష్కర్

పుష్కర్

P.C: You Tube

రాజస్థాన్ లో ఏడాదికి ఒకసారి జరిగే పుష్కర్ మేళకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. ముఖ్యంగా ఇక్కడ జరిగే ఒంటే సంత ఆసియాలోనే అతి పెద్దదని చెబుతారు. ఆ సమయంలో రోజుకు
రెండు సార్లు హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ ను అందుబాటులోకి తీసుకువస్తారు.

రెండు సార్లు

రెండు సార్లు

P.C: You Tube

తెల్లవారుజాము 5 గంటలకు ఒకసారి, అదే విధంగా సాయంత్రం 4.30 గంటలకు ఒకసారి హాట్ ఎయిర్ బెలూన్ రైడ్స్ అందుబాటులో ఉంటుంది. ఆకాశంలో అంతెత్తు నుంచి కింద చీమల మాదిరిగా కనిపించే ఒంటెలను, మనుష్యులను చూడటం థ్రిలింగ్ గా అనిపిస్తుంది.

జైపూర్

జైపూర్

P.C: You Tube

పింక్ సిటీగా పేరొందిన జైపూర్ లో కూడా హాట్ ఎయిర్ బెలూన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రాజసాన్ని ఒలికించే భవనాలు, ఆహ్లాదకరమైన సరస్సుల మీద హాట్ ఎయిర్ బెలున్స్ లో వెళ్లాలనుకొంటే జైపూర్ కు మించిన ప్రాంతం మరొక్కటి లేదు.

రూ.6 వేలు నుంచి రూ.12 వేలు

రూ.6 వేలు నుంచి రూ.12 వేలు

P.C: You Tube

ఇక్కడ ఒక్కక్క రైడ్ కు సమయం, దూరాన్ని అనుసరించి రూ.6 వేల నుంచి రూ.12 వేలు వరకూ ఛార్జ్ చేస్తారు. ఒక్కసారి రైడ్ వెళ్లివస్తే ఆ జ్జాపకాలు జీవితం మొత్తం వెన్నాడుతూ ఉంటాయనడంలో సందేహం లేదు.

 ఆగ్రా

ఆగ్రా

P.C: You Tube

ప్రేమికులకు తమ నెచ్చెలికి బహుమతి ఇవ్వాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది తాజ్ మహల్ ప్రతిమలే. అంతగా ప్రేమతో ఆ తాజ్ మహల్ కు విడదీయరాని బంధం ఏర్పడింది. అందుకే ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో తాజ్ మహల్ కూడా ఒకటి.

హాట్ ఎయిర్ బెలూన్

హాట్ ఎయిర్ బెలూన్

P.C: You Tube

ఈ ప్రేమచిహ్నమైన ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర రంగురంగుల హాట్ బెలూన్ ఎక్కి షికారు చేస్తూ ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకు ఆగ్రా వెళ్లిన వారిలో కనీసం 40 శాతం మంది హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణించాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు.

మనాలి

మనాలి

P.C: You Tube

హనీమూన్ కు మనాలీకి విడదీయరాని బంధం ఉంది. భారత దేశంలో ఎక్కువ మంది దంపతులు తమ హనీమూన్ ట్రిప్ కోసం ఈ మనాలినే ఎంచుకొంటారు. ఇప్పుడు ఈ మనాలి సాహస యాత్రలకు కూడా కేరాఫ్ గా మారుతూ ఉంది.

మంచు పర్వతాల పై

మంచు పర్వతాల పై

P.C: You Tube

చుట్టూ తెల్లని మంచుపర్వతాలు, వాటి వద్ద ఎతైన పచ్చని చెట్లు పైన ఆకాశంలో ఎగుతూ ఆ అందాలన చూసే సదుపాయం మనకు స్థానిక పర్యాటక శాఖ కల్పిస్తోంది. ఒక్క రైడ్ హాట్ ఎయిర్ బెలూన్ తీసుకొంటే చాలు జీవితాంతం గుర్తుండిపోయే ఆనందాలను మనాలిలో సొంతం చేసుకొని ఇంటికి రావచ్చు.

హంపి

హంపి

P.C: You Tube

కేవలం ఉత్తర భారత దేశంలోనే ఈ హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయం అందుబాటులో ఉందనుకోవడం తప్పు. దక్షిణ భారత దేశంలోని అందులోనూ పశ్చిమకనుమలు విస్తారంగా ఉన్న హంపి వద్ద కూడా హాట్ ఎయిర్ బెలూన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఉత్సవాల సమయంలో

ఉత్సవాల సమయంలో

P.C: You Tube

అయితే హంపి ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఈ సదుపాయం వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఒక్కొక్క రైడ్ కు రూ.8 వేల నుంచి రూ.12 వరకూ ఛార్జ్ చేస్తారు. అయినా చాలా మంది ఔత్సాహికులు ఈ క్షేత్రంలో అందులో ప్రయాణించడానికి ఉత్సుకత చూపిస్తారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+