Search
  • Follow NativePlanet
Share

హంపి - శిధిలాలలో సవారీ

84

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలులనాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.  హంపి గురించిన కొన్ని వాస్తవాలు  హంపి ప్రాచీన పట్టణమే కాదను. దీనిని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అనేవారని చరిత్ర చెపుతోంది. 13 నుండి 16 శతాబ్దాలవరకు విజయనగర రాజుల పాలనలో ఎంతో ఔన్నత్య స్దితిలో రాణించింది.  

కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరునుండి బస్సులు అనేకం. ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని దర్శిస్తారు. హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దనిపై తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు.

అసలు టూరిస్టులు హంపి ఎందుకు ఇష్టపడతారు. హంపి పట్టణం దాని శిధిలాలకంటే కూడా దాని మతపర చరిత్రకు ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. విరూపాక్ష దేవాలయం, విఠల దేవాలయం, ఆంజనేయాద్రి మొదలైనవి కలవు. కర్నాటకలోని ప్రధాన నదులలో ఒకటైన తుంగభద్ర ఈ పట్టణం గుండా ప్రవహిస్తుంది. ఎంతో ఆనందింపజేస్తుంది. హంపి పట్టణంలోని దేవాలయాల నిర్మాణానికి గాను విజయనగర రాజులు అక్కడి సమీప కొండల రాళ్ళను చక్కగా చెక్కించి నిర్మించారు.  

దేవాలయాలు, సహజ అందచందాలే కాక అక్కడ అనేక సరస్సులు కూడా ఉన్నాయి. అందమైన భవనాలను నర్మించారు. ఈ పట్టణ నిర్మాణంలో విజయనాగర రాజుల ఎంతో నేర్పరితనం ప్రణాళిక కనపడతాయి. 13 నుండి 15 శతాబ్దాలలోనే ఈ పట్టణంలో అనేక నేటి ఆధునిక నీటి ప్రణాళికా విధానాలు ఆచరించారు.

పర్యాటకులకు ఈ పట్టణంలో చూడాలంటే 500 ప్రదేశాలకు పైగా ఉన్నాయి. వాటిలో సుమారు 100 ప్రదేశాలు పర్యాటకులను అమితంగా ప్రతి ఏటా ఆకర్షిస్తున్నాయి. విఠల దేవాలయం వద్ద గల రాతి రధం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. విజయనగర రాజుల సాంప్రదాయాలను వెల్లడిస్తూంటుంది. దీనినే రాష్ట్ర టూరిజం శాఖ తన పర్యాటక చిహ్నంగా ఆమోదించింది.

నేటికి హంపి లో పురావస్తు శాఖ తన పరిశోధనలు సాగిస్తూనే ఉంది. ఇక్కడి పురావస్తు మ్యూజియం తప్పక చూడదగినది.

తుంగభధ్రా నది ఒక వైపు, మూడు వైపుల కొడలు గల హంపి పట్టణాన్ని విజయనగర రాజులు ఎంతో ప్రణాళికగా తమ రాజ్య రాజధానిగా చేసుకొని పాలించారు. ఈ పట్టణాన్ని జయించటం శత్రురాజులకు అసంభవంగా భావించి వారు దీనిని ఎంపిక చేశారు. నేడు ఈ కొండ ప్రాంతాలు, చక్కటి నదీ ప్రవాహం పర్యాటకులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. దక్షిణ భారత దేశానికి వచ్చిన పర్యాటకులు హోయసల శిల్ప సంపదలకు ప్రధానమైన హంపి పట్టణాన్ని తప్పక దర్శించి తీరాల్సిందే.  

హంపి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హంపి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హంపి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హంపి

  • రోడ్డు ప్రయాణం
    హంపి పట్టణం రాష్ట్రం లోని అన్ని ప్రధాన నగరాలకు రోడ్డు ద్వారా అనుసంధానించబడి ఉంది. ప్రభుత్వ బస్సులు మరియు ప్రయివేటు వాహనాలు విరివిగా దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - హంపికి రైలు స్టేషన్ లేదు. హోస్పేట్ రైలు స్టేషన్ సుమారు 13 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి బెంగుళూరు, హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాలకు వెళ్ళవచ్చు. ఈ స్టేషన్ నుండి టాక్సీలు, క్యాబ్ లలో హంపి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    హంపి పట్టణాన్ని చేరటం ఎలా? విమాన ప్రయాణం - హంపికి దగ్గరి విమానాశ్రయం బెళ్ళారి విమానాశ్రయం. సుమారు 60 కి.మీ. దూరంలో ఉంది. హంపి నుండి 350 కి.మీ. దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇది దేశీయంగాను అంతర్జాతీయంగాను అనేక విమానాలు నడుపుతోంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Jul,Thu
Check Out
31 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Jul,Thu
Return On
31 Jul,Fri