Search
  • Follow NativePlanet
Share
» » మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

కర్నాటక లోని నగరాలలో మైసూరు ఒక ప్రధాన నగరం. ఇక్కడ ఎన్నో పాలస్ లు, టెంపుల్స్, పట్టు వస్త్ర దుకాణాలు కలవు. రాజధాని నగరం బెంగుళూరుకు 143 కి. మీ. ల దూరంలో కల ఈ మైసూరు నగర లో ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. రంగు రంగుల ప్రదర్శనలు, వైభవోపేత నవరాత్రి ఉత్సవాలు పర్యాటకులను ఆనందింప చేస్తాయి.

అందమైన ఈ నగరానికి సంవత్సరంలో ఒక్కసారి ఈ సమయంలో పర్యటన ప్రణాళిక చేసి మైసూరు పట్టణ ప్రకృతి దృశ్యాలు ఆనందించవచ్చు. రాష్ట్రంలో రెండవ అతి పెద్దదైన ఈ నగరానికి పర్యటన ప్రణాళిక చేసే ముందు ఇక్కడ కల హోటళ్ళు లేదా వసతుల సౌకర్యాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఇండియా లో రాచ మర్యాదలకు పేరు గాంచిన మైసూరు హోటళ్ళు మీకు చక్కని సాంప్రదాయకతలతో కూడిన ఆధునిక సౌకర్యాలతో ఆతిధ్యాన్ని అందిస్తాయి. మీరు మైసూరు కు వ్యాపార రీత్యా వచ్చినా లేక విశ్రాంతి దసరా సెలవులపై మీ కుటుంబ సభ్యులతో వచ్చినా, దిగువ సూచించిన హోటళ్ళ లో దిగి ఆనందించవచ్చు.

ఈ హోటళ్ళు మీ బడ్జెట్ కు తగిన రీతిలో వుండి అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తాయి. మీరు ప్రణాళిక చేసిన ఈ మైసూరు దసరా సెలవులకు ఇవ్వ బడే ఈ హోటల్స్ లో మీ అవసరాలు అందుకవసరమైన వ్యయాలను పరిశీలించండి.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

లలిత మహల్ పాలస్ మైసూరు లోని హెరిటేజ్ హోటల్స్ లో ఒకటి. 1974 సంవత్సరం లో ఈ రెండవ అతి పెద్ద పాలస్ ను హోటల్ గా మార్పు చేసారు. భవనం యొక్క తెలుపు రంగు అందంగా వుంది ఆకర్షనీయంగా కనపడుతుంది. అశోక్ గ్రూప్ నిర్వహిస్తున్న ఈ హోటల్ లో గెస్ట్ లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలవు. లోపలి అలంకరణల లో కల ఇటాలియన్ మర్బ్లె ఫ్లూరింగ్ మరియు బెల్జియన్ క్రిస్టల్ చాన్డ్లీయర్లు చాలా దర్పంగా వుంటాయి. బిజినెస్స్ లేదా ఫ్యామిలీ సంబంధిత వేడుకలకు అవసరమైన డైనింగ్ మరియు విందు మంటపాలు కలవు.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

ఈ హోటల్ ను చాలా మంది వారి విశ్రాంతి సమయాన్ని ప్రకృతి ఒడిలో గడిపేటందుకు ఎంపిక చేస్తారు. ఈ రిసార్ట్ లో దొరికే అపురూప ప్రశాంతత మీకు మరెక్కడా దొరకదనే చెప్పాలి. ఈ రిసార్ట్ సుమారు 20 ఎకరాలలో విస్తరించి వుంది. మైసూరు రైల్వే స్టేషన్ నుండి 9 కి. మీ.ల దూరంలో కలదు. ఇక్కడ నుండి మైసూరు ఎయిర్ పోర్ట్ 19 కి.మీ. ల దూరం కాగా బస్సు ల పై తేలికగా చేరేలా ఉంటుది. ఈ రిసార్ట్ లో కల స్పా సౌకర్యం ఒక ప్రత్యేకత.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

నాలుగు నక్షత్రాల ఈ హెరిటేజ్ హోటల్ మైసూరు ఎయిర్ పోర్ట్ నుండి 29 కి. మీ. ల దూరంలో కలదు. బ్రిన్దావన్ గార్డెన్స్ కు , అద్భుత ప్రకృతి దృశ్యాలకు మధ్య కల ఈ హోటల్ మీరు బిజినెస్స్ లేదా విశ్రాంతి సెలవుల కొరకు దిగినా సరే అనుకూలమే. గెస్ట్ లకు అనేక సౌకర్యాలు కలవు. కింగ్ రూమ్ లు, క్వీన్ రూమ్ లు, చక్కటి ఫర్నిచర్ మొదలైన వాటి తో రోజు రెంట్ రూ. 4134/- మాత్రమే.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

గోల్డెన్ ల్యాండ్ మార్క్ రిసార్ట్ మైసూరు లోని మెటా గల్లీ లో కలదు. రింగ్ రోడ్ నుండి 5 నిమిషాల కారు ప్రయాణంలో చేరవచ్చు. రైల్వే స్టేషన్ లేదా సిటీ లోని ఇతర సైట్ సీయింగ్ ప్రదేశం నుండి పది నిమిషాలలో చేరవచ్చు. హోటల్ యాజమాన్యం గెస్ట్ లకు అనేక సౌకర్యాలు కలిగించి ఇంటిని మరపిస్తుంది. లేక్ వ్యూ విల్లా లు, క్లబ్ క్లాస్స్ రూమ్ లు అని రెండు తరగతులలో ఈ రిసార్ట్ వసతి కల్పిస్తోంది.

 మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

హోటల్ రేగాలిస్ హౌసింగ్ లో 105 చక్కగా ఫర్నిష్ చేయబడిన విశాలమైన రూమ్ లు కలవు. మీ మైసూరు దసరా పండుగ సందర్శనలకు హోటల్ రేగాలిస్ సరైనది. నగరం మధ్యలో కల ఈ హోటల్ చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలు కలవు. మైసూరు ఎయిర్ పోర్ట్ నుండి సుమారు 12 కి. మీ. ల దూరం లో కలదు.రైలు స్టేషన్ సమీపంగానే వుంటుంది. ఆధునిక సౌకర్యాలు కల ఈ హోటల్ లో చక్కటి అలంకరణలు కల లక్సరీ రూములు కూడా కలవు.

 మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

విండ్ ఫ్లవర్ రిసార్ట్ అండ్ స్పా లో దిగే సందర్శకులకు ఇక్కడ చక్కటి ఆతిధ్యం లభించటమే కాక హోటల్ నుండి కనపడే అద్భుతమైన చాముండి హిల్స్ వారిని మంత్ర ముగ్ధులను చేస్తాయి. పచ్చటి పరిసరాలు కల ఈ ప్రదేశం లో బిజి నగర జీవనంలో అలసిన వారు ఈ దసరా సెలవులకు చక్కటి విశ్రాంతి పొందవచ్చు. ఇక్కడ కల 58 రూమ్ లను స్టూడియో, అపార్ట్ మెంట్, విల్లా, సూట్ తరగతులుగా విభజించి అందిస్తున్నారు.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

1920లలో నిర్మించబడిన ఈ హోటల్ ఈ సంవత్సరం మీ మైసూరు దసరాకు అద్భుత రాచ మర్యాదలు చేస్తుంది. ఈ హోటల్ 4 స్టార్ లక్సరీ హోటల్. ఈ హెరిటేజ్ హోటల్ ను మైసూరు మహారాజు నిర్మించారు. రాయల్ రూమ్ లు, హెరిటేజ్ రూమ్ లు మరియు మహారాజ రూమ్ లు అని మూడు తరగతులలో మీకు అన్ని సౌకర్యాలు కలిగిస్తుంది. అందమైన విశాలమైన ఈ రూములు అన్నీ ఆధునిక సౌకర్యాలు కలిగి వుంటాయి. హై టీ (టీ లాంజ్ ) , స్కాన్దేల్ (బార్) షికారి (రెస్ట రెంట్) వంటి వాటిలో మీరు గంటల తరబడి రిలాక్స్ అవచ్చు.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

చిత్రావన రిసార్ట్ మైసూరు - మానందవడి రోడ్ లో మైసూరు రైల్వే స్టేషన్ మరియు బస్సు టెర్మినస్ లకు 10 కి. మీ. కల దూరంలో కలదు. ఇది ఒక ఫారెస్ట్ మధ్యలో వుండటం ఒక ప్రత్యేకత. ఇక్కడి వసతిలో ప్రకృతి ఆనందాలు అధికం. పర్యావరణ స్నేహ పూరిత ఈ రిసార్ట్ మీ ఈ దసరా కు అద్భుత వసతి కలిగిస్తుంది. పర్యాటకులు ఇక్కడ రాపెల్లింగ్, జుమారింగ్, రివర్ క్రాసింగ్, బర్మా బ్రిజ్, కయాకింగ్, ట్రెజర్ హంట్, వంటి ఆటలు ఆనందించవచ్చు. ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు కూడా వుంటాయి.

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

దేశీయులకు, విదేశీయులకు సైతం అన్ని వసతులతో కూడిన ఆతిధ్యం ఇచ్చే గ్రాండ్ మౌర్య రిసార్ట్ మైసూరు లో మీ దసరా సెలవుల విశ్రాంతి కి చక్కని ఎంపిక. మైసూరు నగర నది బొడ్డున కల ఈ రిసార్ట్ గెస్ట్ లకు చక్కటి ఆతిధ్యం అందిస్తుంది. చక్కగా డిజైన్ చేసిన వసతిన రూమ్ లు వాటిలోని సౌకర్యాలు బాగుంటాయి. పర్యాటకులు వారి బిజినెస్స్ ప్లాన్ లు ఇతర కార్యక్రమాలు చేపట్టవచ్చు. చక్కని విందు హాలులు కలవు. ఈ రిసార్ట్ లో అనేక వసతులతో కూడిన బార్ అండ్ రెస్టారెంట్ కూడా కలదు.

 మైసూరు లో మంచి హోటల్ వసతులు !

మైసూరు లో మంచి హోటల్ వసతులు !

సరిగ్గా ప్రకృతి ఒడి లో కల ఈ ఇండస్ వాలీ ఆయుర్వేదిక్ సెంటర్ మీ సౌకర్యం, లక్సరీ అంశాలే కాక ఆరోగ్యం కూడా పరి రక్షిస్తుంది. ఇక్కడ గెస్ట్ లకు అవసరాలను బట్టి వివిధ ఆయుర్వేదిక్ చికిత్సలు లభిస్తాయి. గెస్ట్ లు ఇంకనూ అనేక వివిధ వినోద కార్యక్రమాలు ఆచరించవచ్చు. అన్ని వసతులతో కూడిన అందమైన రూము ల వసతి ని మీరు ఈ దసరా కు ఆనందించవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X