Search
  • Follow NativePlanet
Share
» »ఈ సెల‌వుల్లో సంద‌ర్శ‌న‌కు కేర‌ళ‌లోని ఉత్త‌మ ప్రాంతాలు..

ఈ సెల‌వుల్లో సంద‌ర్శ‌న‌కు కేర‌ళ‌లోని ఉత్త‌మ ప్రాంతాలు..

ఈ సెల‌వుల్లో సంద‌ర్శ‌న‌కు కేర‌ళ‌లోని ఉత్త‌మ ప్రాంతాలు..

దక్షిణ భారతదేశంలోని ఉత్తమ గమ్యస్థానాలలో కేరళ ఒకటి. రుచికరమైన ఆహారం, గొప్ప సంస్కృతి, విశాలమైన హిల్ స్టేషన్లు, బ్యాక్ వాటర్స్ మరియు అనేక ఇతర కారణాలు కేర‌ళ‌కు ప‌ర్యాట‌కుల‌ను ఆహ్వ‌నం ప‌లుకుతున్నాయి. అనేక సుందరమైన హాట్‌స్పాట్‌లు ఇక్క‌డి సంస్కృతి కేరళ విహారయాత్రను మ‌న జాబితాలో చేర్చేందుకు ముందుంటాయి. ఈ వేస‌వి సెల‌వుల్లో కేర‌ళ‌లోని ప్ర‌కృతి అందాల‌ను వీక్షించేందుకు మ‌రి మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెడ‌తారా?

munnar

నోరూరించే వంట‌కాలు..

కేర‌ళ‌లోని విభిన్న‌మైన‌, రుచిక‌ర‌మైన వంట‌కాలు ప‌ర్యాట‌కుల‌కు నోరూరిస్తాయి. ఫుడ్ ప్రియులైతే త‌ప్ప‌కుండా ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. ఇక్క‌డ అప్పం, పుట్టు మరియు ఇడియప్పం వంటివి బాగా తెలిసిన వంట‌కాలైన‌ప్ప‌టికీ స్పైసీ సీఫుడ్, శాఖాహార వంటకాల నుండి డెజర్ట్‌ల వరకు, చాలా రుచికరమైన వంటకాలు ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి. ఇక్క‌డి ఇతర మాంసాహార వంటకాలైన కరిమీన్ పొలిచాటు, మీన్ మాంగా కర్రీ, కోజి పొరిచాతు మరియు మరిన్ని సీఫుడ్స్‌కి ప్రసిద్ధి చెందాయి. అంతే కాకుండా పత్తిరి, ఎరిస్సేరి, ఒలన్, ఉల్లి తీయల్, వెల్లరిక కిచడి వంటి శాఖాహార వంటకాలు కూడా అంతే ప్రాచుర్యం పొందాయి. పలాడ పాయసం, చట్టి పత్తిరి కొన్ని రుచికరమైన డెజర్ట్ ఐటమ్స్ కూడా ఇక్క‌డ ఉన్నాయి. వీట‌న్నింటిని ఓ ప‌ట్టు ప‌ట్టేయాల‌నుకునేవాళ్లు త‌ప్ప‌కుండా కేర‌ళ సంద‌ర్శించాల్సిందే.

సంస్కృతి సంప్ర‌దాయాల‌కు నిల‌యం..

ఈ ప్రాంతంలోని పండుగలు, సినిమా, కళారూపాలు, ఇక్క‌డి సాహిత్యం ఈ రాష్ట్ర గొప్ప సంస్కృతికి ప్రతిబింబాలు. చెండమేళం, తాయంబక, తిరువతీర మరియు కథాకళి వంటి కళారూపాలు తమ ఆకర్షణీయమైన ప్రదర్శనలతో ఇక్క‌డికి వ‌చ్చే పర్యాటకులను కట్టిపడేస్తాయి. ఓనం, ఒనకలికల్ (ఆటలు), వల్లంకలి (పడవ పందెం) మరియు పులికలికి ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ ప్రాంతం వైరల్ సౌండ్‌ట్రాక్‌లకు పేరుగాంచింది. కేర‌ళను సంద‌ర్శించిన‌వారు మలయాళ సినీ పరిశ్రమ గురించి ప్రస్తావించకుండా ఉండ‌రు.

waynad1

ఎన్నో స్మార‌క చిహ్నాలు..

ఈ ప్రాంత‌పు అనేక నిర్మాణ అద్భుతాలు యూరోపియన్ల వలసరాజ్యానికి గుర్తుగా నిలుస్తాయి. ఇక్క‌డి ఫోర్ట్ కొచ్చి ఒక మనోహరమైన తీరపుప్రాంతం, ఒకప్పుడు డచ్, పోర్చుగీస్ మరియు బ్రిటీష్ వారిచే వలసరాజ్యంగా ఈ ప్రాంతం ఉంది. మట్టన్‌చేరి ప్యాలెస్, ఎడ్డక్కల్ గుహలు, బేకల్ ఫోర్ట్, సెయింట్ మేరీస్ ఫోరేన్ చర్చి, కృష్ణపురం ప్యాలెస్ ఇక్క‌డి మ‌రికొన్ని ప్రముఖ వారసత్వ ప్రదేశాలు. అంతే కాకుండా, ఇక్క‌డ అనేక ఇతర స్మారక చిహ్నాలు, కోటలు, రాజభవనాలు, దేవాలయాలు పురాత‌న క‌ట్ట‌డాలు ఉన్నాయి.

ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్

ఈ రాష్ట్రంలోని సహజమైన బ్యాక్ వాటర్స్ భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఈ కేర‌ళ ట్రిప్‌ను సంతోషంగా గ‌డ‌పాల‌నుకుంటే ఇక్క‌డి బ్యాక్ వాట‌ర్స్‌లో హౌస్‌బోట్‌లో ప్ర‌యాణించండి. ఆ ప్ర‌యాణంలో చుట్టు ఉన్న వరి పొలాలు, వన్యప్రాణులను, ప్ర‌కృతితో కూడిన వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు.

idduki1

సుందరమైన హిల్స్ స్టేషన్లు

కేర‌ళ‌లోని హిల్ స్టేషన్‌లలో అత్యుత్తమ విహారయాత్ర అనుభవాన్నిఆస్వాదించొచ్చు. ఇక్క‌డి సుందరమైన కొండలు తేయాకు తోటలతో కప్పబడి ఉన్నాయి. అంతేకాకుండా ఇక్క‌డ అనేక జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు సరస్సులు ఉన్నాయి. మున్నార్, వాయనాడ్, తేక్కడి, ఇద్దుకి, వాగమోన్, సైలెంట్ వ్యాలీ మరియు అతిరప్పిల్లి వంటి కొన్ని ప్రసిద్ధ గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పారాగ్లైడింగ్, పర్వతారోహణ, వెదురు రాఫ్టింగ్ వంటి సాహస క్రీడలు కూడా ఉన్నాయి.

vagamon

అబ్బురపరిచే తీరప్రాంతాలు

ఈ మండుతున్న వేస‌విలో సూర్యాస్తమయాలు, సాహస క్రీడలు, నిర్మలమైన తీరాలను ఈ ప్రాంతంలో సంద‌ర్శించ‌వ‌చ్చు. అంతే కాకుండా, మీరు స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, పారాసైలింగ్, సర్ఫింగ్ వంటి అనేక సాహస కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. వర్కలా, కోవలం, కోజికోడ్, మరారి మరియు అలప్పుజా ఈ ప్రాంతంలో సందర్శించవలసిన కొన్ని బీచ్‌లు!

More News

    Read more about: munnar wayanad thekkady
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+