Search
  • Follow NativePlanet
Share
» »చిక్కబల్లాపూర్ - ఆకట్టుకొనే ప్రదేశాలు !

చిక్కబల్లాపూర్ - ఆకట్టుకొనే ప్రదేశాలు !

By Mohammad

చుట్టూ కొండలు, పర్వతారోహణకు అనుకూలంగా ఉండే ప్రదేశం చిక్కబల్లాపూర్ . చిక్కబల్లాపూర్ , కర్ణాటక రాష్ట్రంలోని ఒక జిల్లా. దీనికి సరిహద్దులుగా అనంతపురం, బెంగళూరు, చిత్తూర్, కోలార్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ పట్టణం, బెంగళూరు నగరానికి 50 కి. మీ ల దూరంలో కలదు. 'భారతరత్న' మోక్షంగుండం విశ్వేశ్వరయ్య జన్మస్థలం ఈ జిల్లా.

ఇది కూడా చదవండి : బెంగళూరు - మీకు తెలియని వారాంతపు ప్రదేశాలు !

చిక్కబల్లాపూర్ చుట్టూ ఆకర్షించటానికి ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సహాజమైనవి కాగా, మరికొన్ని మానవ నిర్మితాలు. ప్రఖ్యాతి చెందిన 'నంది హిల్స్' ఈ జిల్లాలోనిదే. జలపాతాలు, ఆలయాలు,సరస్సులు మొదలైన ఆకర్షణీయ ప్రదేశాలను సందర్శించటానికి పర్యాటకులు వస్తుంటారు.

అమరనారాయణ దేవాలయం

అమరనారాయణ దేవాలయం

అమరనారాయణ దేవాలయం, విష్ణుమూర్తి కి అంకితం చేయబడినది. గుడిలో విష్ణుమూర్తి ప్రతిమ ఆకర్షనీయంగా కనపడుతుంది. నగరంగ మండపం, రాతి స్తంభాల నిర్మాణాల మీద చెక్కిన చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. హొయసుల రాజు విష్ణువర్ధనుడిచే గుడి నిర్మాణం జరిగినట్లు చెబుతారు.

చిత్ర కృప : Parshotam Lal Tandon

భీమేశ్వర దేవాలయం

భీమేశ్వర దేవాలయం

ఇతిహాసం మేరకు ఈ ప్రదేశంలో హిందూ పురాణాలలో, పాండవులలో ఒకడిగా చెప్పబడే భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని యుద్ధంలో సంహరిస్తాడు. కనుక, భీముని పేరు మీద ఇక్కడ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు.

చిత్ర కృప : Bengalooru Tourism

భోగ నందీశ్వర దేవాలయం

భోగ నందీశ్వర దేవాలయం

భోగ నందీశ్వర దేవాలయం, నంది హిల్స్ పై భాగంలో కలదు. ఆలయాన్ని క్రీ. శ. 806 లో బాణ వంశానికి చెందిన రత్నవల్లి ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించాడు. యోగ నరసింహ మరియు ఉగ్ర నరసింహ దేవతామూర్తుల ప్రతిమలు గుడి లోపల ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోని కొలను చూడముచ్చటగా ఉంటుంది.

చిత్ర కృప : Girish Nagamangala

విశ్వేశ్వరయ్య మ్యూజియం

విశ్వేశ్వరయ్య మ్యూజియం

చిక్కబల్లాపూర్ లోని విశ్వేశ్వరయ్య మ్యూజియం తప్పక చూడాలి. ఇందులో ఎన్నో ఆసక్తి కలిగించే అంశాలు దాగి ఉన్నాయి. ఎలక్ట్రానిక్ హాల్, సైన్స్ హాల్, వర్క్ షాప్ లు, ఎగ్జిబిషన్ లు, చర్చావేదికలు, స్పేస్ హాల్, పిల్లలకు వినోదం కల్గించే హాల్ లు, కంప్యూటర్ హాల్ వంటివి కలవు.

చిత్ర కృప : Amanjosan2008

కైవారా

కైవారా

కైవారా పట్టణాన్ని పూర్వం ఏకచక్రాపురం అని పిలిచేవారు. బకాసురుడు అనే రాక్షసురుడు ఈ ప్రాంత సమీపంలో గల గుహలో తలదాచుకున్నట్లు చెబుతారు. జంతు ప్రదర్శనాలయం, తోట, పంచపాండవుల పేర్లతో పిలిచే 5 కాటేజీలు కలవు.

చిత్ర కృప : ramesholla

గుమ్మనాయక కోట

గుమ్మనాయక కోట

గుమ్మనాయక కోట ను గుమ్మనాయకుడు నిర్మించాడు. క్రీ. శ. 1350 వ సంవత్సరంలో సేనాపతి గా గుమ్మనాయకుడు పాలించాడు. కోట 150 అడుగుల మేర ఎత్తున గుండ్ర టి రాళ్లతో నిర్మించారు.

చిత్ర కృప : Motographer

మద్దెనహళ్లి

మద్దెనహళ్లి

మద్దెనహళ్లి, మోక్షంగుండం విశ్వేశ్వరయ్య పుట్టిన ప్రదేశం. ఇక్కడ ఆయన నివసించిన ఇంటిని మ్యూజియం గా మార్చి ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచారు. మ్యూజియంలో విశ్వేశ్వరయ్య వాడిన వస్తువులను, ఆయన చిత్ర పటాలను గమనించవచ్చు.

చిత్ర కృప : Telugu native planet

స్కందగిరి

స్కందగిరి

స్కందగిరి ఒక ట్రెక్కింగ్ స్థావరం. టిప్పుసుల్తాన్ నాటి కోట, స్కందగిరి పర్వత శ్రేణుల పై ఉన్నది. కలవర దుర్గ గా పేరొందిన స్కందగిరిలోని కోట ను టిప్పు నుండి రక్షించుకోవటానికి స్థానిక రాజు నిర్మించినట్లు చెబుతారు. కోట తో పాటు స్కందగిరి లో గుహలను చూడవచ్చు.

చిత్ర కృప : Karthik Sivakumar

మురుగుముళ్ళ దర్గా

మురుగుముళ్ళ దర్గా

కర్ణాటక లోని సూఫీ ప్రాచీన పుణ్య క్షేత్రాలలో ఫకీర్ షా యొక్క మురుగుముళ్ళ దర్గా ఒకటి. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే ఉరుసు ఉత్సవాలలో పాల్గొనటానికి భక్తులు తరలివస్తుంటారు.

చిత్ర కృప : Thigala shri

చిక్కబల్లాపూర్ ఎలా చేరుకోవాలి ?

చిక్కబల్లాపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

చిక్కబల్లాపూర్ చేరుకోవాలంటే, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవాలి. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో చిక్కబల్లాపూర్ వెళ్ళవచ్చు.

రైలు మార్గం

చిక్కబల్లాపూర్ లో రైల్వే స్టేషన్ కలదు. పట్టణం నుండి స్టేషన్ కిలోమీటర్ దూరంలో కలదు. స్టేషన్ బయట ఆటో రిక్షాలలో ప్రయాణించి పట్టణానికి చేరుకోవచ్చు.


రోడ్డు / బస్సు మార్గం

బెంగళూరు, అనంతపురం,కోలార్, చిత్ర దుర్గ, చిత్తూర్, మదనపల్లె తదితర ప్రాంతాల నుండి చిక్కబల్లాపూర్ కు ప్రభుత్వ / ప్రవేట్ బస్స్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : SANTHOSH Kumar . N

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+