జీవించటంలో ఆనందం...దీనినే ఇంగ్లీష్ భాషలో 'జాయ్ అఫ్ లివింగ్' అని కూడా అంటారు. ఇది ఒక జీవిత వేదాంతం. ఈ సాధనను కూర్గ్ అపరిమితంగా దాని ప్రజల ద్వారా ఆనందిస్తోంది. ఒక 'హలో' లేదా ఒక డ్యూయెట్ సాంగ్ లేదా ఒక మంచి సంభాషణ, ఏదైనప్పటికీ అది జీవితంలో ఆనందం కలిగించాలి. మరి కూర్గ్ లో కల ప్రతి అంశం కూడా ఖచ్చితంగా మీకు, మీ ప్రేమికులకు ఒక ఆనందాల జీవితం, ఆనందాల ప్రపంచం కలిగిస్తుంది. దానితోపాటు అక్కడ కల ప్రకృతి, అక్కడ పండే ప్రత్యేక కాఫీ మీకు బోనస్. కొద్దిపాటి అధిక రోజుల వీక్ ఎండ్ విహారం ప్లాన్ చేసుకునే వారికీ కూర్గ్ లో 3 రోజులు గడపటం...అయ్యో అపుడే అయిపోయిందా...అని అనిపిస్తుంది. జీవితంలో ఆనందం అనే పదాలకు అర్ధంగా, ఒక మూడు రోజులు కూర్గ్ లో గడపండి.

కూర్గ్ ఆనందాలు
మొదటి రోజు మీకు కూర్గ్ అక్కడ దిగిన వెంటనే ప్రజల వేష భాషలు చూపుతుంది. ప్రకృతి మరియు భగవంతుడు అంటిపెట్టుకొని వుంటారు. ఈ రెండు అంశాలు అపరిమితం అని గుర్తించాలి. ఈ ప్రయాణంలో, భగవంతుడు, ప్రకృతిల సంబంధం తెలుసుకోవాలంటే మీరు తప్పక ఒక కారు ప్రయాణం చెయాలిసిందే.

జీవన ఆనందం
ఈ ప్రదేశం ఒక రాజ భోగం. ఒక రాజులా మీ ట్రావెల్ మొదలు పెట్టండి. రాజాస్ సీట్ లో సూర్యోదయం చూడండి. కూర్గ్ గురించిన పరిచయం అంతా అక్కడ మెల్లగా పైకి వచ్చే సూర్యుడు, వెచ్చనైన ఎండా, రంగు రంగుల సూర్య కిరణాలు తో మీకు తెలిసిపోతుంది. క్షణాలు మీకు తెలియకుండా ఎలా గడిచి పోతున్నాయనేది గమనించండి.

జీవన ఆనందం
వర్షాకాలం వస్తే చాలు అబ్బే జలపాతాల హోరు ధ్వని దూరానికి వినపడుతుంది. ఈ జలపాతాలు చేరాలంటే, కాఫీ తోటల గుండా వెళ్ళాల్సిందే. సమీపిస్తున్న కొలదీ సన్నని నీటి తుంపరలు ఆనందం కలిగిస్తాయి.

జీవన ఆనందం
గద్దిగే లో ఒకే రకంగా వుండే రెండు చారిత్రక నిర్మాణాలు కనపడతాయి. ఈ నిర్మాణాలు ఇండో - సార్సెనిక్ శిల్ప శైలి లో వుంటాయి. అవి రాజులు, రాణుల సమాదులు. వీటిని ఒక మైదానం మధ్యలో నీలి ఆకాశం కింద కనపడేట్లు నిర్మించారు. టూరిస్ట్ లు అతి తరచుగా ఇక్కడకు వస్తారు. (గమనిక - విండో గ్లాసులు ప్రత్యేకించి చాలా అందంగా వుంటాయి.) సమయం అనుమతిస్తే, మీరు గద్దిగే చేరేముందే మడికేరి ఫోర్ట్ మరియు పాలస్ లు చూడండి.

జీవన ఆనందం
గోతిక్ మరియు ఇస్లామిక్ శిల్ప శైలి ప్రభావాలతో భగవాన్ శివుడు మీకు దర్శనమిచ్చే ఓంకారేశ్వర్ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్ చాలా అందంగా, ప్రశాంతంగా వుంటుంది. టెంపుల్ కొలను లోని నీరు స్వత్చ్చంగా వుంది అక్కడి చేపలకు ప్రాణాన్ని, సందర్శకులకు ఆనందాన్ని ఇస్తుంది.

జీవన ఆనందం
కావేరి సంగమ, కన్నికే, పురాణాలలో చెప్పిన సూజ్యోతి, నదుల కలయికలు కల భాగమండల, దేముళ్ళు సమావేశం అయ్యే ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ కల భగందేశ్వర టెంపుల్ లో శ్రీ మహా విష్ణువు, సుబ్రమన్య, గణపతి దేముళ్ళ విగ్రహాలుంటాయి.

జీవన ఆనందం
కావేరి నది ఈ ప్రదేశంలో పుట్టింది. ఇక్కడ కల పొగమంచు, అద్భుతవాతావరణం భగవంతుడిని గుర్తు చేస్తాయి. ఈ యాత్రా స్థలం బ్రహ్మగిరి హిల్స్ పై కలదు. భాగమండలకు 8 కి. మీ. ల దూరం. కొండపైకి ఎక్కి అత్యంత సుందరమైన సూర్యాస్తమయం మరియు సూర్యోదయం చూడవచ్చు.

జీవన ఆనందం
మరో ప్రపంచం లోకి అడుగు పెట్టండి. మీరు రెండో రోజున ఏనుగులు, కోతుల అల్లర్లు చూస్తారు. ప్రకృతి, అద్భుత శిల్ప కల. వన్య జీవుల ప్రపంచం మరియు జీవన ప్రపంచం రెండూ ఆనందమే. సుమారు 111 కి. మీ. ల ప్రయాణం మిమ్మల్ని ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిస్తుంది.

జీవన ఆనందం
గర్వం భావించండి. ఏనుగులచే స్నానం ఎపుడైనా చేయించారా ? ఇపుడు చేయంచండి. దాని పెద్ద పెద్ద చెవులతో ఆడుకోండి. బేబీ ఎలిఫెంట్ తో ముద్దులాడండి. స్నానం తర్వాత శుభ్రంగా దానిపై ఎక్కి సవారి చేయండి. దాని స్నేహంతో గర్వపదండి. మీరు కూడా ఒక రాజులా స్వారి చేయండి.

జీవన ఆనందం
ఈ ప్రదేశం కావేరి నదికి ఒక ద్వీపం. ప్రసిద్ధ విహార ప్రదేశం. పచ్చటి ప్రదేశాలు, వెదురు తోటలు, మట్టి రోడ్లు, బోటింగ్, ఏనుగు సవారి, డీర్ పార్క్, నెమళ్ళు, అన్నిటికి మించిన ఆనందం వేలాడే వంతెన మొదలైనవి ప్రతి రోజూ అనేకమంది టూరిస్ట్ లను ఆకర్షిస్తాయి.

జీవన ఆనందం
అందమైన హారంగి నది ప్రవాహాలకు ఇక్కడ అడ్డుకట్ట వేసి డాం కట్టారు. నీరు ఎపుడూ డాం నుండి ఓవర్ ఫ్లో అయిపోతూ వుంటుంది. పర్యాటకులకు కనువిందు చేస్తూ వుంటుంది. కుశాల్ నగర్ కు 9 కి. మీ. కల దూరంలో కల ఈ డాం తప్పక చూడాలి. సా. ఆరు గం. వరకు అనుమతిస్తారు.

జీవన ఆనందం
బైలకుప్పే, టిబెట్ దేశపు సంస్కృతి కల భూభాగం. టిబెట్ దేశీయులు కూడా బాగా ఆనందించే ప్రదేశం. ఇక్కడ కల రంగు రంగుల ప్రదేశాలు మిమ్మల్ని ఆనంద పరుస్తాయి. ప్రశాంతమైన ఈ ప్రదేశం తప్పక చూడండి.

జీవన ఆనందం
పూర్తి రిలాక్సేషన్ లభిస్తుంది. శెలవుల విహారం అంటే రిలాక్సేషన్ కదా మరి. ఈ రకమైన ధ్యానం వంటి ప్రశాంతతను మీకు కూర్గ్ అందిస్తుంది. ఒక జీపు అద్దేకు తీసుకోండి. కాఫీ ఎస్టేట్ లు చుట్టి రండి. మీ జీప్ ఎక్కడ ఆపినా సరే, ఆనంద క్షణాలే. కాఫీ తోటల సంచారం మీకు మరువ లేని తాజా గాలి, సువాసనల అనుభవాన్ని ఇస్తుంది.

జీవన ఆనందం
ఇది మీ చివరి మజిలీ. లక్ష్మణ తీర్థ నది ప్రవాహం తో ఏర్పడిన ఈ ఇరుప్పు జలపాతాలు బ్రహ్మగిరి కొండలలో ఒక మూలగా ప్రశాంత వాతావరణం లో వుంటాయి. జలపాతాలకు వెళ్ళే మార్గంలో మీరు రామేశ్వర, శివ టెంపుల్స్ చూడవచ్చు. ఈ ప్రదేశంలో మీరు కావలసింత సేపు విహరించండి. ఇది మీ ప్రయాణపు చివరి ఆకర్షణ కనుక.

జీవన ఆనందం
వేయి మాటలు ఎందుకు ? బహుశా ఒక్క చిత్రం చాలు ! ఈ ప్రాంత సందర్శనలో దీనిని తప్పక ఆచరించండి. చెత్త నియమిత స్థలాలలో వేయండి. పర్యావరణ స్నేహితులుగా మెలగండి.



Click it and Unblock the Notifications













