Search
  • Follow NativePlanet
Share
» »స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

కర్నాటక రాష్ట్రం ఎన్నో సుందరమైన ప్రదేశాలు కలిగి వుంది. ఈ ప్రదేశాలు స్థానిక సినిమా షూటింగ్ లకు మాత్రమే కాక, ఇతర రాష్ట్రాల వారి షూటింగ్ లకు, ప్రపంచ వ్యాప్త షూటింగ్ లకు సైతం ఉపయోగపడుతున్నాయి.

By Venkatakarunasri

కర్నాటక రాష్ట్రం ఎన్నో సుందరమైన ప్రదేశాలు కలిగి వుంది. ఈ ప్రదేశాలు స్థానిక సినిమా షూటింగ్ లకు మాత్రమే కాక, ఇతర రాష్ట్రాల వారి షూటింగ్ లకు, ప్రపంచ వ్యాప్త షూటింగ్ లకు సైతం ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ కల శిల్ప కళల తో కూడిన చారిత్రక ప్రదేశాలు, ఆహ్లాదకర ప్రకృతి దృశ్యాలు అనేక సినిమాలను టాప్ సక్సెస్ చేశాయి. ఈ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో తీసిన బాలి వుడ్ సినిమాలు ఇతర దేశాలలో సైతం విజయవంతమై, సినీ పరిశ్రమకు కర్నాటక రాష్ట్రం ను ఒక ప్రసిద్ధ ప్రదేశంగా చేశాయి. కర్ణాటకలో ని కూర్గ్ ఒక అందమైన సహజ దృశ్యాల ప్రదేశం. దీనిని 'స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియా' అని కూడా అంటారు. రాష్ట్ర రాజదాని బెంగుళూరు దేశంలోనే ఒక ఖ్యాతి గాంచిన ఐ. టి. కేంద్రం. మరి ఇంత ఖ్యాతి గాంచిన ఈ కర్నాటక రాష్ట్ర షూటింగ్ ప్రదేశాలను గురించి కొంత తెలుసుకుందాం.

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

గురు సినిమా - బాదామిలో కల బాదామి కేవ్స్

మీరు కనుక ఈ సినిమా చూసి ఉన్నట్లయితే, ఒక పాటలో అభిషేక్ బచన్ దేవాలయం లోని ఒక శిల్పం ముందు డాన్స్ చేస్తాడు. ఈ రాతి గుహల దేవాలయాలు కర్ణాటకలోని ప్రసిద్ధ బాదామి నగరంలో కలవు.

Photo Courtesy: Dineshkannambadi

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

7 ఖూన్ మాఫ్

ఈ బాలి వుడ్ సినిమా లోని కొన్ని సన్నివేశాలను, ఇండియా లోని స్కాట్ ల్యాండ్ గా చెప్పబడే కూర్గ్ హిల్ స్టేషన్ పై తీశారు. ఈ ప్రాంతంలో కల సహజ అందాలు, ప్రశాంత వాతావరణం, సినిమా సిబ్బందిని ఈ ప్రదేశానికి అమితంగా ఆకర్షించాయి.

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

రౌడి రాథోడ్

ఈ సినిమా ను బెంగుళూరు లో ప్రసిద్ధి చెందిన, నగర నడిబోడ్డులో కల బెంగుళూరు పాలస్ లో తీశారు. ఇదే ప్రదేశంలో అతి పెద్ద విజయం పొందిన మరి కొన్ని చిత్రాలైన బెతాబ్, మార్డ్ మరియు షాలిమార్ వంటి చిత్రాలను కూడా నిర్మించారు.

Photo Courtesy: Sankalp Varshney

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

షోలే

ప్రసిద్ద బాలి వుడ్ దర్శకుడు సిప్పీ నిర్మించిన ఈ చిత్రం సక్సెస్ గురించి తెలియని వారుండరు. ఈ చిత్రాన్ని బెంగుళూరు కు సమీపంలో కల రామనగరం అనే ఒక చిన్న గ్రామంలో తీశారు. ఇప్పటికీ ఈ విలేజ్ ని షోలే విలేజ్ అని కూడా పిలుస్తారు.

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

చైనా గేట్

చైనా గేట్ సినిమాలోని కొన్ని దృశ్యాలను కర్ణాటకలోని కొప్పల్ జిల్లా లో తీశారు. ఇదేప్రదేశంలో ఇంకా నాయక, అమానత్ సినిమాలు కూడా తీసి విజయవంతం చేసారు.

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

స్కాట్ ల్యాండ్ అఫ్ ఇండియాలో షూటింగ్లు !

కూలీ

ప్రసిద్ధ సినీ నటుడు అమితాబ్ నటించిన కూలీ చిత్రంలోని ఒక పాటను బెంగుళూరు లో ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన కబ్బన్ పార్క్ లో చిత్రీకరించారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+