Search
  • Follow NativePlanet
Share
» »హ‌నీమూన్ జంట‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతోన్న‌ దక్షిణ భారతదేశంలోని ప్ర‌దేశాలివే!

హ‌నీమూన్ జంట‌ల‌కు ఆహ్వానం ప‌లుకుతోన్న‌ దక్షిణ భారతదేశంలోని ప్ర‌దేశాలివే!

ఈ ఏఫ్రిల్ మాసంలో హనీమూన్ కోసం మంచి శృంగారభరితమైన టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీరు పర్వతాలు లేదా తీర‌ప్రాంతాల‌ను మీ జాబితాలో చేరుకోండి.. ఇక్క‌డి ప్ర‌శాంత‌త‌ను అనునిత్యం మీరు ఆస్వాదించవచ్చు. అదే స‌మ‌యంలో అలాంటి మ‌ర్చిపోలేని క్ష‌ణాల‌ను గ‌డిపేందుకు దక్షిణ భారతదేశంలో కొద‌వ‌లేన‌న్ని ప్రదేశాలు ఉన్నాయి. మీ భాగస్వామితో కలిసి ఇక్కడికి రావడం ద్వారా మీరు అద్భుత‌మైన‌ సమయాన్ని గ‌డ‌పొచ్చు. మ‌రి అలాంటి జాబితాలో ఏయే స్థలాలు చేర్చబడ్డాయి? వాటి ప్ర‌త్యేక‌త‌లేంటో చూద్దాం!

భారతదేశంలోని ప్రతి ఒక్క ప్ర‌దేశం అందంగా ఉన్నప్పటికీ.. ఇందులో దక్షిణ భారతదేశం చాలా ప్ర‌త్యేక‌మైంది. శీతాకాలం కారణంగా మీరు మీ హనీమూన్‌ను ఇప్పటి వరకు వాయిదా వేసుకున్నట్లయితే, వెంట‌నే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రావెల్ సీజన్‌లో ద‌క్షిణ భార‌తం మీలాంటి జంట‌ల‌కు సాద‌ర ఆహ్వానం పలుకుతోంది.

kodaikanal

కొడైకెనాల్

తమిళనాడు రాష్ట్రం అనేక ప్ర‌త్యేక‌త‌ల‌తో కూడిన అద్భుతమైన ప్రదేశమ‌నే చెప్పాలి. ఇక్కడ మీరు మీ హనీమూన్ ప్లాన్ చేసుకునేందుకు అనేక ప్రదేశాలు మిమ్మ‌ల్ని ఆలోచ‌న‌ల్లో ప‌డేస్తాయి. వీటిలో మొద‌టి స్థానాన్ని అక్ర‌మించేది అయితే మాత్రం కొడైకెనాల్. ఏప్రిల్‌లో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే మీరు హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది తమిళనాడులోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడికి రావడం ద్వారా పచ్చని తేయాకు తోటలు, పర్వతాలు, సరస్సులు, లోయలను వీక్షిస్తూ.. అద్భుత‌మైన క్ష‌ణాల‌ను ప‌దిలప‌రుచుకోవ‌చ్చు. ఇక్క‌డి సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌లో కోకర్స్ వాక్ ఒక‌టి. వాన్ అలెన్ ఆసుపత్రికి సమీపంలో ఉండే ఈ ప్రదేశం మీకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూపిస్తుంది. ఇక్కడి సూర్యోదయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వీక్షించడం మర్చిపోవ‌ద్దు. టెలిస్కోప్ హౌస్ ద్వారా చుట్టు పక్కల ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించ‌వ‌చ్చు.

అలెప్పి

భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరూ సందర్శించాలని కలలుకనే ప్రదేశం కేరళ. ఇక్కడ విస్తరిస్తున్న టూరిజం మనస్సును రిఫ్రెష్ చేయడమే కాకుండా, ఇక్క‌డ గ‌డిపిన‌ ప్రతి క్షణాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుంది. ఇక్కడ అన్వేషించడానికి చాలా ప్రదేశాలు ఉన్నప్పటికీ వీటిలో అలెప్పీ మాత్రం హ‌నీమూన్ జంట‌ల‌కు ప్ర‌త్యేక‌మైన‌ది. ఈ ప్రదేశం సముద్ర తీరాలు, బ్యాక్ వాటర్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాల‌ నుండి సాహస నీటి క్రీడ‌ల‌ వరకు అన్ని రకాల అభిరుచులు ఉన్న వ్యక్తులు ఇక్కడకు వచ్చి ఆనందించవచ్చు. ఉప్పునీటి చేప‌ల రుచులు వివిధ ఫ్లేవ‌ర్ల‌లో ఆస్వాదించేందుకు అలెప్పి విహారం స‌రైన ఎంపిక అనే చెప్పాలి.

coorg1

కూర్గ్

కర్నాటకలోని కూర్గ్‌ని ప్లాన్ చేయడం ద్వారా మీరు మీ హనీమూన్‌ను జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవచ్చు. కూర్గ్‌ని 'స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా' అని కూడా అంటారు. జలపాతాలు, సరస్సుల నుండి కోటల వరకు మీ భాగస్వామితో మ‌ర్చిపోలేని సమయాన్ని గడపడానికి అనేక ప్ర‌దేశాలు కూర్గ్ చుట్టూ విస్త‌రించి ఉన్నాయి. మండు వేస‌విలో కూడా పచ్చని వాతావరణం, కాఫీ తోటలు పర్యాటకులకు స్వర్గానుభూతిని చేరువ చేస్తాయి. ఈ ప్రాంతం పర్యాటక ప్రియులకంటే.. కొత్త హ‌నీమూన్ జంట‌ల‌ను ఆకట్టుకునేలా ఉంటుందంటే న‌మ్మండి. ఇక్క‌డి తేయాకు తోటల అందాలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను అందిస్తాయి. అందుకే ఏఫ్రిల్ మాసంలో ఇది తప్పక సందర్శించవలసిన ప్రాంతంగా ప్ర‌సిద్ధి పొందింది.

More News

Read more about: south india honeymoon tour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+