Search
  • Follow NativePlanet
Share
» »శ్రీ‌శైలం వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే..!

శ్రీ‌శైలం వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీ మీకోసమే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌సిద్ధ ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు కొద‌వేలేదు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికెళ్లినా పురాత‌న దేవాల‌యాలు మ‌న‌కు తార‌స‌ప‌డ‌తాయి. ఇక్క‌డి తిరుమ‌ల ఆల‌యం ఎంత ప్ర‌సిద్ధిచెందింది. నంద్యాల‌లో వెల‌సిన శ్రీ‌శైలం మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌యం కూడా అంతే పేరుగాంచింది. ఇక్క‌డికి నిత్యం భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉంటుంది. శ్రీ‌శైలం ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రాల‌లో ఒక‌టి. దట్టమైన అడవి, కొండల మ‌ధ్య‌లో ఈ పుణ్య‌క్షేత్రం వెల‌సింది. ఇక్క‌డికి కేవ‌లం ఏపీ ప్ర‌జ‌లే కాకుండా ఇత‌ర రాష్ట్రాల భ‌క్తులు కూడా వ‌స్తుంటారు.

ఇక్క‌డి స్వామివారి ద‌ర్శ‌నం భాగ్యం పొందాల‌నుకునేవారికి తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ హైద‌రాబాద్ నుంచి శ్రీ‌శైలం వ‌ర‌కు ఉంటుంది. ఇది మొత్తం రెండు రోజుల టూర్‌. బ‌స్సు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ టూరిజం ప‌ర్యాట‌కుల‌కు స‌రికొత్త హంగుల‌ను అందించేందుకు ఎన్నో విహారయాత్ర‌ల‌కు తీసుకెళ్లేందుకు ప‌లు ప్యాకేజీల‌ను ప్ర‌క‌టిస్తోంది. కేవ‌లం ప్ర‌దేశాలు మాత్ర‌మే కాకుండా ఇటువంటి ఆధ్యాత్మిక ప్రాంతాల‌కు కూడా తీసుకెళ్తుంది. ఇందులో భాగంగానే ఇప్ప‌డు శ్రీశైలంతో పాటు సమీపంలోని ప‌లు ప్రాంతాలను వీక్షించేందుకు సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రిప్‌లో భాగంగా శ్రీశైలం దర్శనం, పాతాళ‌గంగా, పాలధార (Paaladhara), పంచధార, శ్రీశైలం డ్యామ్ వంటి ప్ర‌దేశాలు సంద‌ర్శించొచ్చు.

srisailampackage1

DAILY SRISAILAM TOUR పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ డైలీ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్ర‌యాణం ప్రారంభ‌వుతుంది. ఏసీ, నాన్ ఏసీ బస్సులో ప్ర‌యాణం చేయొచ్చు. అది ప‌ర్యాట‌కులు ఎంచుకున్న దాన్ని బ‌ట్టి ఉంటుంది. ప్రతిరోజు హైదరాబాద్ పర్యాటక భవన్, బషీర్‌బాగ్‌ నుంచి బ‌స్సులు అందుబాటులో ఉంటాయి.

రెండు రోజులు టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ టూర్‌లో భాగంగా మొద‌టిరోజు హైదరాబాద్‌లోలోని పర్యాటక భవన్ నుంచి 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఆ త‌ర్వాత బ‌స్ జ‌ర్నీలోని లంచ్ కార్య‌క్ర‌మం ఉంటుంది. అనంత‌రం దారి మ‌ధ్య‌లో ఉన్న సాక్షి గణపతి ఆలయాన్ని సంద‌ర్శిస్తారు. అదే రోజు సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. అక్క‌డ స్టే చేసేందుకు హోట‌ల్‌కు వెళ‌తారు. శ్రీశైలంలోనే రాత్రి బ‌స ఉంటుంది.

srisailampackage2

మ‌రుస‌టి రోజు ఉద‌యం టిఫిన్ చేశాక హోట‌ల్ నుంచి చెక్ అవుట్ అయ్యి రోప్‌వే బ‌య‌లుదేరుతారు. ఆ జ‌ర్నీ ఎంతో చూడ్డానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ద‌ట్ట‌మైన అడవి, కొండ‌ల‌ను ద‌గ్గ‌రినుంచి చూడొచ్చు. మ‌ళ్లికార్జున‌స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం పాతాళగంగ, పాలధార, పంచధార, హైడ్రో‌ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యామ్ వంటి ప్రాంతాల‌ను తిల‌కిస్తారు. ఆ త‌ర్వాత రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌ చేరుకోవ‌డంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధ‌ర‌లివే..

ఈ టూర్‌లో భాగంగా ఏసీ బస్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ.2400 చెల్లించాలి. అదే పిల్ల‌ల‌యితే (5 నుంచి 12సంవత్సరాలు) రూ.1920 చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ నాన్ AC బస్ ఎంచుకుంటే మాత్రం పెద్దలు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు రూ.1600గా నిర్ణయించారు. ప‌ర్యాట‌కులు ఇత‌ర పూర్తి వివ‌రాల కోసం తెలంగాణ టూరిజం వారి ఈ అధికారిక https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+