వైజాగ్‌లో ప్రసిద్ధిచెందిన పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా అరకు వంటి ప్రదేశాలను ఈ సీజన్‌లో సందర్శించాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారికోసం ఐఆర్‌సిటిసి టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ విశాఖ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా విశాఖ అందాలతో ఆపటు అరకు ప్రకృతి అందాలు, సింహాచలం పుణ్యక్షేత్రం, విశాఖ సబ్‌మెరైన్ మ్యూజియం వంటివి చూడొచ్చు. మరెందుకాలస్యం ఈ ట్రిప్ విశేషాలను తెలుసుకుందామా..?
ఐఆర్‌సిటిసి టూరిజం 'వైజాగ్ రీట్రీట్' పేరుతో పర్యాటకులకు మరో ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ మే 21నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీ మొత్తం రెండు రాత్రులు, మూడు పగళ్లు ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీ షెడ్యూల్..
అరకు, సింహాచలం వంటి ప్రదేశాలను చూసేందుకు ఐఆర్‌సిటిసి టూరింజం 'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది.
ఈ టూర్ ప్యాకేజీ వైజాగ్ నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

ఈ టూర్‌లో భాగంగా మొదటిరోజు ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అనంతరం ఉదయం అల్పాహారం తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌లను పర్యాటకులకు చూపిస్తారు. ఈ ప్రదేశాలు వైజాగ్‌లో ఎంతో ప్రసిద్ధిచెందినవి.
ఇక, ఆ రోజు రాత్రంతా వైజాగ్‌లోనే బస చేయాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం ఎనిమిదిగంటలకు అరకు బయలుదేరుతారు. అరకు ప్రయాణం మాటల్లో వర్ణించలేనిది. ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులకు సాదర ఆహ్వనం పలుకుతుంటాయి. ఎటుచూసిన పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక, అరకు చేరుకున్నాక ఇక్కడ ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను చూపిస్తారు. పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. అనంతరం తిరిగి విశాఖపట్నం చేరుకుంటారు.
మూడోరోజు ఉదయం అల్పాహారం ముగించిన తర్వాత వైజాగ్‌లో ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ముందుగా సింహాచలం ఆలయానికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం తిరిగి విశాఖపట్నం వచ్చేయాలి. ఇక, అప్పటికే మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి లంచ్ చేశాక సబ్‌మెరెన్ మ్యూజియం సందర్శన ఉంటుంది. ఈ మ్యూజియం చూశాక తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. టూరిస్టులను తమ తమ ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దించుతారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తోంది.
ఈ ప్యాకేజీ ధరలు..
వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజీ ధరలను ఒకసారి పరిశీలిస్తే కంఫర్ట్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకీ రూ.7990 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీకయితే రూ.10980 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.19950గా నిర్ణయించారు. ఇక, ఐదు నుంచి పదకొండేళ్ల చిన్నారులకు వేరువేరు ధరలు అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఐఆర్‌సిటిసి టూరిజం వారి అధికారిక వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/ సందర్శించగలరు. మరెందుకాలస్యం మీ వైజాగ్ ట్రిప్‌కు సిద్ధంకండి..



Click it and Unblock the Notifications













