Search
  • Follow NativePlanet
Share
» »శ్రీరామనారాయణం సంద‌ర్శించాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

శ్రీరామనారాయణం సంద‌ర్శించాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

విజ‌య‌న‌గ‌రంలోని ప్ర‌సిద్ధిచెందిన రామాల‌యం శ్రీ‌రామ‌నారాయ‌ణం. ఈ ఆల‌యం రాముని బాణం ఆకారంలో ఉంటుంది. ఈ ఆల‌యంలోని రాములోరిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌స్తుంటారు. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓస‌రిక‌త్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్‌లో భాగంగా వైజాగ్‌ల‌లోని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల‌తో పాటు విజ‌య‌న‌గ‌రంలోని శ్రీ రామనారాయణం ఆలయం పర్యటన కూడా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం రెండు రోజులు ఉంటుంది. అతిత‌క్కువ ధ‌ర‌తోనే వైజాగ్‌లోని ప్ర‌సిద్ధ‌ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను వీక్షించేయొచ్చు. గ్లోరియస్ ఆంధ్ర విత్ శ్రీ రామనారాయం పేరిట ఐఆర్‌సిటిసి ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

ఇక‌, ఈ టూర్‌లో భాగంగా వైజాగ్‌లోని సింహాచలం ఆలయం, తొట్ల కొండ బౌద్ధ సముదాయాలు, విజయనగరం శ్రీరామనారాయణం ఆలయాలతో పాటు సుందరమైన బీచ్‌ల‌ను కూడా వీక్షించొచ్చు. అతిత‌క్కువ ధ‌ర‌తో ఈ టూర్ చేయొచ్చు. రూ. 5885 కనీస ధ‌ర‌తో ఈ ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఈ టూర్ షెడ్యూల్ వివ‌రాలు..

vijayanagaram irctc package

(ఒక‌టి నుంచి ముగ్గురు వ్య‌క్తుల‌కు)

క్లాస్ సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 13630 చెల్లించాలి. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.7535 చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీకీ రూ.5505 గా నిర్ణ‌యించారు. చైల్డ్ విత్ బెడ్ రూ. 4860 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ వితవుట్ బెడ్ అయితే రూ. 3110 చెల్లించాలి.

ఒక్కో వ్యక్తి ధర (04 నుంచి 06 వ్యక్తుల వరకు)

డబుల్ ఆక్యుపెన్సీకీ రూ. 6330 చెల్లించాలి. అదే ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే, రూ. 5885 చెల్లించాల్సి ఉంటుంది. చైల్డ్ విత్ బెడ్ రూ.5180 గా నిర్ణ‌యించారు. చైల్డ్ వితవుట్ బెడ్ రూ.3815 చెల్లించాలి.
మొద‌టి రోజు టూర్ షెడ్యూల్‌..

ఈ టూర్‌లో భాగంగా మొద‌టిరోజు ఉద‌యం ఏడుగంట‌ల‌కు విశాఖ రైల్వే స్టేషన్/బస్ డిపో/ ఎయిర్‌పోర్ట్‌ నుంచి పికప్ చేసుకుని హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్ లో చెక్ ఇన్ అయ్యి టిఫిన్ చేపిస్తారు. ఉద‌యం తొమ్మిది ఆ స‌మ‌యంలో రుషికొండ బీచ్ ప‌ర్య‌ట‌న ఉంటుంది. ఆ త‌ర్వాత అక్క‌డినుండి తొట్ల‌కొండ బౌద్ద స‌ముదాయానికి తీసుకెళ్తారు. రుషికొండ నుంచి సుమారు ఆరుకిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

అక్క‌డినుండి పురాతన బావికొండకు ప్రయాణమ‌వుతారు. మ‌ధ్యాహ్నం 12:30 PM నుంచి 1 :00 PM వరకు బావికొండ పురాతన బౌద్ధ విహారం ప‌ర్య‌ట‌న ఉంటుంది. అనంత‌రం ఒంటి గంట స‌మ‌యంలో రెస్టారెంట్‌లో లంచ్ ఉంటుంది. భోజ‌నం అనంతరం కైలాస‌గిరి హిల్స్ పార్క్ సంద‌ర్శ‌న ఉంటుంది. సాయంత్రం నాలుగు గంట‌ల స‌మయంలో కైలాషగిరి హిల్స్ నుంచి శ్రీరామనారాయణ దేవాలయం(విజయనగరం)ప్రయాణం మొదలవుతుంది.

సాయంత్రం 5:20 అక్క‌డికి చేరుకున్నాక‌ 7:00 PM వరకు - శ్రీ రామనారాయణం ఆలయం సందర్శన ఉంటుంది. అక్క‌డి లేజర్ షో ను కూడా చూడొచ్చు. 7:00 నుంచి 8:30 వరకు రామనారాయణం ఆలయం నుంచి వైజాగ్ హోటల్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది. రాత్రి హోటల్‌లో డిన్నర్ చేసి అక్క‌డే బస చేస్తారు.

రెండో రోజు ప‌ర్య‌ట‌న‌..

రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఉదయం టిఫిన్ చేసి హోటల్ నుంచి చెక్-అవుట్ అయ్యి సింహాచలం ఆలయానికి బ‌య‌లుదేరుతారు. ఉద‌యం తొమ్మిదిలోపు ఆల‌యానికి చేరుకుంటారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డి నుంచి విశాఖ మ్యూజియంకు బ‌య‌లుదేరుతారు. ఉద‌యం 11:45 నుంచి 12:15 వరకు విశాఖ మ్యూజియం సందర్శన ఉంటుంది.

అక్క‌డి నుంచి మత్స్య దర్శిని చూసేందుకు బయలుదేరతారు. మ‌ధ్యాహ్నం హోటల్‌లో భోజనం చేస్తారు. ఆ త‌ర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం సంద‌ర్శ‌న ఉంటుంది. అనంత‌రం జలాంతర్గామి మ్యూజియానికి బ‌య‌లుదేరుతారు. సాయంత్రం ఆర్కేబీచ్ బ‌య‌లుదేర‌తారు. ఆర్కే బీచ్ నుంచి తిరుగు ప్ర‌యాణం ప్రారంభ‌వుతుంది. అక్క‌డినుంచి స‌మీపంలోని బ‌స్స్టాండ్‌, రైల్వేస్షేష‌న్‌, ఎయిర్‌పోర్ట్‌లో ప్ర‌యాణికుల‌ను దించుతారు. అక్క‌డితే మీ టూర్ ముగుస్తుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+