Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీలోని ఈ ప్రదేశాలలో గర్బా నృత్యాన్ని ఆస్వాదించండి

ఢిల్లీలోని ఈ ప్రదేశాలలో గర్బా నృత్యాన్ని ఆస్వాదించండి

ఢిల్లీలోని ఈ ప్రదేశాలలో గర్బా నృత్యాన్ని ఆస్వాదించండి

మీరు వంద‌లాదిమంది ఒకేచోట సంప్ర‌దాయంగా చేసే గుజరాతీ గర్బా డ్యాన్స్‌ని ఆస్వాదించాలనుకుంటే, ఖచ్చితంగా ఇదే స‌రైన స‌మ‌యం. ఈ సమయంలో, దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్స‌వాల‌ను చాలా వైభవంగా జరుపుకొంటారు. దేశంలోని వివిధ ప్ర‌దేశాలలో ప్రజలు దుర్గమాత‌ను వైభవంగా పూజిస్తారు. ఈ పండుగ నాడు దేశంలోని వివిధ ప్రాంతాలలో గర్బా నైట్స్ లేదా దాండియాను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

గుజరాత్‌లోని గర్బా నైట్స్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, ఢిల్లీలోని గుజరాతీ గర్బాను ఆస్వాదించేందుకు కొన్ని ప్ర‌సిద్ధ ప్రాంతాలు ఉన్నాయి. అవును, ఈ కథనంలో ఢిల్లీలో మీరు కూడా గర్బా నైట్స్ లేదా దాండియాను ఆస్వాదించగల కొన్ని ప్రదేశాల గురించి మీరు తెలుసుకోబోతున్నారు.

ఢిల్లీ హాత్‌

ఢిల్లీ హాత్‌

భారతీయ సాంస్కృతిక కార్యక్రమాల విషయానికి వస్తే ఢిల్లీలోని ప్రసిద్ధ ప్రదేశం 'డిల్లీ హాత్‌' పేరు ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గర్బా/దాండియా డ్యాన్స్ నిర్వ‌హించారు. మీరు గర్బా నృత్యాన్ని ఆపకుండా నిరంతరం ఆస్వాదించాలనుకుంటే, ఖచ్చితంగా ఇక్కడకు చేరుకోండి. ఇక్కడ మీరు DJ సాంగ్‌తో డ్యాన్స్ చేయడానికి అనుకూల‌మైన ప్రాంతంగా పేరుపొందింది. డిల్లీ హాత్‌ లోపల ఉత్తమమైన రుచికరమైన వంటలను రుచిచూడ వ‌చ్చును. ఒక్క ఢిల్లీ రుచులేకాదండోయ్‌.. మంచి మంచి పేరుపొందిన వంట‌కాలు ఇక్క‌డ అందుబాటులో ఉంటాయి. మీరు ద‌క్షిణ ఢిల్లీ చేరుకుంటే, అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోనే ఐఎన్ఎ మార్కెట్‌ను అనుకుని ఢిల్లీ హాత్‌ ఉంటుంది.

ద్వారకలో గర్బా నృత్యాన్ని ఆనందించండి

ద్వారకలో గర్బా నృత్యాన్ని ఆనందించండి

మీరు ద్వారక సమీపంలో నివసిస్తుంటే, గర్బా నృత్యం కోసం ఎక్కువ దూరం వెళ్లవలసిన అవసరం లేదు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కుటుంబ‌స‌భ్యులు లేదా స‌న్నిహితుల‌తో గర్బా డ్యాన్స్ ప్లాన్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించి ఇక్కడికి చేరుకోవాలి. ఢిల్లీలోని పసిఫిక్ మాల్ ఈ కార్య‌క్ర‌మాల‌కు చిరునామాగా చెబుతారు. సంప్ర‌దాయ దుస్తుల‌లో అంద‌రూ క‌లిసి కోలాహ‌లంగా చేసే నృత్యాలు జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను చేరువ చేస్తాయి.

చిత్తరంజన్ పార్క్

చిత్తరంజన్ పార్క్

దుర్గాపూజ చూసి, గర్బా డ్యాన్స్‌ని ఆస్వాదించాలంటే అందరూ చిత్తరంజన్ పార్కుకు చేరుకోవాలని అంటారు. ఇక్కడ పూజలు వైభవంగా జరుగుతాయి. అష్టమి మరియు నవమి రోజున ఇక్కడ గర్బా నృత్యం కూడా నిర్వహిస్తారు. చిత్తరంజన్ పార్క్‌లో గార్బా డ్యాన్స్ చేయడానికి ఢిల్లీలోని దాదాపు ప్రతి మూల నుండి ప్రజలు ఇక్క‌డికి చేరుకుంటారు. రుచికరమైన వంటకాలను ఆస్వాదించగల ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ఎన్‌క్లేవ్ మెట్రో స్టేషన్ దగ్గర చిత్త‌రంజ‌న్ పార్క్ ఉంది.

ఈ ప్రదేశాలనూ చేరుకోండి

ఈ ప్రదేశాలనూ చేరుకోండి

డిల్లీ హాత్, ద్వారక మరియు చిత్తరంజన్ పార్క్ కాకుండా, ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ మీరు మ‌రిన్ని సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఆస్వాదించవచ్చు. దీని కోసం మీరు సరితా విహార్‌లోని పాకెట్ సి పార్క్, గౌర్ సిటీ మాల్ గ్రేటర్ నోయిడా మరియు పసిఫిక్ మాల్, పితంపుర మొదలైన ప్రదేశాలకు సంద‌ర్శించ‌వ‌చ్చు. అనేక ర‌కాల వంట‌కాల‌ను మ‌న‌సారా రుచి చూడ‌వ‌చ్చును.

More News

    Read more about: garba dance in delhi
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+