Search
  • Follow NativePlanet
Share
» »భార‌త‌దేశంలోని వింత ఆచారాలు ఉన్న ఈ ప్రాంతాల‌కు ఎప్పుడైనా వెళ్లారా?

భార‌త‌దేశంలోని వింత ఆచారాలు ఉన్న ఈ ప్రాంతాల‌కు ఎప్పుడైనా వెళ్లారా?

భార‌త‌దేశంలోని వింత ఆచారాలు ఉన్న ఈ ప్రాంతాల‌కు ఎప్పుడైనా వెళ్లారా?

భార‌త‌దేశం సంస్కృతి సాంప్ర‌దాయాల‌కు పుట్టినిల్లు. ఇక్క‌డ అతిపెద్ద పురాత‌న దేవాల‌యాలతో పాటు కొన్ని మిస్ట‌రీయ‌స్ స్థ‌లాలు, అసాధార‌ణ విష‌యాలున్న ప్ర‌దేశాలున్నాయి. అలాగే మ‌న‌దేశంలో న‌మ్మ‌శ‌క్యం కానీ ఎన్నో మూఢ‌న‌మ్మ‌కాలు ఉన్నాయి. ఈ మూఢ‌న‌మ్మ‌కాలు పూర్వ‌కాలం నుండి కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. వాటికి శాస్రీయ ఆధారాలు లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌లు వాటిని విశ్వ‌సిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో మ‌రికొన్ని బ‌హ్య‌ప్ర‌పంచానికి తెలియ‌ని, అంత‌గా గుర్తింపుకు నోచుకుని వింతైన ప్ర‌దేశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మనం అలాంటి గ్రామాల గురించే చెప్పుకోబోతున్నాం.

peruruvillageineastgodavari

తూర్పు గోదావ‌రిలోని పేరూరు గ్రామంలోని వింత సంప్ర‌దాయం...

దేశ‌మంతా విజ‌య‌ద‌శ‌మి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటుంటే ఆ గ్రామంలో మాత్రం సీతారాములోరి క‌ళ్యాణం జరుగుతోంది. ఈ వింత ఎక్క‌డో కాదండి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురం రూర‌ల్ మండ‌లం పేరూరు గ్రామంలోని భీమ‌భ‌క్తుని పాలెంలో ఈ వింత సంప్రదాయం ఉంది. అస‌లు ఈ వింత ఆచారం వెన‌క క‌థేంటేంటే, ఇక్క‌డి పూర్వీకులు ప‌నులు లేక వ‌ల‌స వెళ్లేవారు. శ్రీ‌రామ‌న‌వ‌వి వేడుక ఏప్రిల్‌లో నిర్వ‌హిస్తారు.

ఆ స‌మ‌యంలో ఇక్క‌డ పూర్వికులు అంతా వేరే ప్రాంతాల‌కు ప‌నుల కోసం వ‌ల‌స వెళ్ల‌డంతో త‌మ ఆరాధ్య దైవ‌మైన సీతారామ‌ల‌క్ష్మ‌ణులను పూజించుకునే ప‌ర్వ‌దిన‌మైన శ్రీ‌రామ‌న‌వ‌మిని పండుగ‌ను మిస్స‌య్యేవార‌ట‌. దీంతో వారంతా ప‌నులు ముగించుకుని సొంత ఊళ్ల‌కు వ‌చ్చిన త‌ర్వాత ద‌స‌రా పండుగా నాడే ఇష్ట‌దైవ‌మైన రాములోరి క‌ళ్యాణాన్ని ఘ‌నంగా జ‌రిపించుకునేవార‌ట‌. ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఆ గ్రామ‌స్తులు ఈ వింత ఆచారాన్ని కొన‌సాగిస్తున్నారు.

pinivillage1

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని పిని గ్రామ ఆచారం...

మ‌న‌దేశంలోని ఓ గ్రామంలో మ‌హిళ‌లు దుస్తులు ధ‌రించ‌రు. పురుషుల‌కు కూడా కొన్ని క‌ఠిన‌మైన నియ‌మ నిభంధ‌న‌లు ఉన్నాయి. ఆ ఊరిపేరు పిని. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కుల జిల్లాలో ఉంటుంది. ఈ గ్రామంలోని మ‌హిళా సంవ‌త్స‌రంలో ఐదురోజుల‌పాటు దుస్తులు ధ‌రించ‌రు. ఏటా శ్రావ‌ణ మాసంలో ఐదురోజుల‌పాటు న‌గ్నంగా ఉంటారు. అయితే ఒంటిపై చున్నీ లాంటివి క‌ప్పుకుంటారు. ఈ ఐదురోజులు వారు ఇంటినుంచి బ‌య‌టికి రారు. భార్య‌భ‌ర్త‌లు ఒక‌రు మాట్లాడుకోరు. దూరంగాఉంటారు.

క‌నీసం ఒక‌రినొక‌రు చూసి న‌వ్వ‌డం కూడా చేయ‌రు.అయితే ఇప్ప‌టి యువ‌కులు మాత్రం ఈ సంప్ర‌దాయాన్ని పాటించ‌డం లేదు. పూర్తి న‌గ్నంగా కాకుండా ప‌లుచ‌టి వ‌స్రాల‌ను ధ‌రిస్తారు. ఇక్క‌డ పురుషుల‌కు కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. వారు ఐదురోజుల పాటు మ‌ద్యం తాగ‌కూడ‌దు. మాంసం ముట్టుకోకూడ‌దు. వీటిని పాటించ‌క‌పోతే దేవుళ్లకు కోపం వ‌స్తుంద‌నే వారి న‌మ్మ‌కం.

ritualoftalaripondinanantapur1

అనంత‌పురంలోని త‌లారి చెరువు ఆచారం..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లాలోని త‌లారి చెరువు గ్రామ‌స్తులు. మాఘ‌మాసం పౌర్ణ‌మికి ముందు రోజున ఊరిలోని వారంతా పెంపుడు జంతువుల‌తో స‌హా క‌లిసి గ్రామాన్ని విడిచి వెళ్లిపోతారు. అగ్గిపాడు అనే వింత ఆచారంలో భాగంగా ఊరిలోని అన్ని ఇళ్ల‌లో అగ్గి, వెలుతురు లేకుండా దీపాలు ఆపేసి.. స‌మీపంలోని ద‌ర్గాకు చేరుకుంటారు. అలా పౌర్ణ‌మి రోజంతా ఊరికి దూరంగా గ‌డుపుతారు. ఈ ఆచారం వెన‌కు పెద్ద క‌థే ఉంది.

పూర్వం త‌లారి చెరువు గ్రామాన్ని ఓ బ్ర‌హ్మ‌ణుడు దోచుకోవ‌డంతో గ్రామాస్తులంతా క‌లిసి ఆయ‌న‌ను హ‌త్య చేశారు. నాటి నుంచి ఊరిలో పుట్ట‌ని పిల్ల‌లు పుట్టిన‌ట్లు చ‌నిపోవ‌డానికి బ్ర‌హ్మ‌ణుడు హ‌త్య చేయ‌డ‌మే కార‌ణ‌మ‌ని ఓ జ్యోతిష్యుడు తెలిపారు. ప‌రిష్కార‌మార్గంగా మాఘ‌చ‌తుర్ధ‌శి నుంచి పౌర్ణ‌మి వ‌ర‌కూ అగ్గిపాడు ఆచారం పాటించాల‌ని సూచించిన‌ట్లు గ్రామస్తులు వివ‌రించారు.

shingapur1

శని శింగనాపూర్ గ్రామం, మహారాష్ట్ర

ప్రజలు తరచుగా రాత్రి పడుకునే ముందు వారి ఇంటి తలుపులు మూసివేస్తారు. దాంతో వారు మరియు వారి గృహోపకరణాలు సురక్షితంగా ఉంటాయి. కానీ మ‌నం ఇప్పుడు చెప్ప‌కుంటున్న గ్రామంలో మాత్రం ఈ ప‌ద్ధ‌తి పాటించ‌రు. ఇక్కడి ప్రజలు శని దేవుడిని నమ్ముతారు, అందుకే వారు తమ ఇళ్లకు తలుపులు వేయరు. ఇక్కడ ఎవరైనా ఎవరికైనా హాని చేస్తే, శని దేవుడు వాళ్ల‌పై కోపంగా ఉంటాడని ఇక్క‌డివారు నమ్ముతారు. అందుకే ఈ ప‌ద్ధ‌తిని ఎన్నో యేళ్ల నుంచి పాటిస్తున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఈ ప్రాంతాల‌కు వెళితే త‌ప్ప‌కుండా ఈ వింత ఆచారాలను చూడొచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+