Search
  • Follow NativePlanet
Share
» »ఆంధ్ర ప్రదేశ్ లోని పక్షి అభయారణ్యాలు !

ఆంధ్ర ప్రదేశ్ లోని పక్షి అభయారణ్యాలు !

By Mohammad

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకు ఎన్నో ఆలయాలు, పర్యాటక ప్రదేశాలు , బీచ్ ల గురించి తెలుసుకున్నాం. కాని నేటి వ్యాసం పూర్తిగా భిన్నమైనది. ప్రకృతి ప్రేమికులు, పక్షి ప్రేమికులు, ఫోటో గ్రాఫర్ లకు చక్కటి మనోహర దృశ్యాలను అందిస్తుంది. మీ వద్ద కెమరా ఉందా ? అయితే ఈ ప్రదేశాలను ఒకసారి సందర్శించండి.

ఆంధ్ర ప్రదేశ్ లో పక్షి అభయారణ్యాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వాటిలో ప్రసిద్ధి చెందినవి రోళ్లపాడు పక్షి అభయారణ్యం, నేలపట్టు పక్షి అభయారణ్యం, పులికాట్ పక్షి అభయారణ్యం మరియు కొల్లేరు బర్డ్ స్యాంక్చురీ. యాత్రికులు ఈ స్యాంక్చురీ వద్ద సీజన్ , అన్ -సీజన్ లలో కనిపించే అరుదైన పక్షులను వీక్షించవచ్చు. ఫోటోగ్రాఫర్ లు పక్షులు విహరిస్తున్నప్పుడు, నిశ్చలంగా చెట్టు కొమ్మ మీద నిలబడ్డప్పుడు, కుంట ల వద్ద చేరి నీళ్ళు తాగుతున్నప్పుడు .. వివిధ యాంగిల్ లలో ఫోటోలు తీయవచ్చు.

ఇది కూడా చదవండి : ఆంధ్ర, తెలంగాణ లోని 30 వన్య మృగ అభయారణ్యాలు !

రోళ్లపాడు పక్షి అభయారణ్యం

రోళ్లపాడు పక్షి అభయారణ్యం కర్నూలు నగరానికి 60 కి. మీ. దూరంలో ఉన్న నందికోట్కూర్ సమీపాన గల మిడుతూరు మండలంలో 614 చ.కి. మీ. విస్తీర్ణంలో కలదు. ఇక్కడ అనేక రకాల పక్షి జాతులు కనిపిస్తాయి. మైనా, ఇండియన్ బస్టర్డ్, ఇండియన్ రోలర్ వంటి అరుదైన పక్షులను చూడవచ్చు. ఈ స్యాంక్చురీ ప్రధాన ఆకర్షణ బట్టిమేక పక్షి. ప్రపంచంలో అంతరించిపోతున్న పక్షులలో ఇది ఒకటి. వీటి సంఖ్య 10 - 15 ఉండొచ్చని అటవీ అధికారుల అంచనా.

రోళ్లపాడు పక్షి అభయారణ్యం

రోళ్లపాడు పక్షి అభయారణ్యం

చిత్ర కృప : J.M.Garg

పులికాట్ పక్షి అభయారణ్యం

పులికాట్ సంక్చురి చెన్నై కి 60 కి. మీ. దూరంలో, శ్రీకాళహస్తి కి 27 కి. మీ ల దూరంలో ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్యలో 500 చ. కి. మీ. వైశాల్యంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఫ్లెమింగో. ప్రతి సంవత్సరం పదిహేను వేల ఫ్లెమింగోలు పులికాట్ సరస్సును సందర్శిస్తాయని అంచనా. పెలికాన్లు, సీగల్, ఎగ్రేట్, హెరాన్ తదితర జాతి పక్షులు, కొంగలు, బాతులు, గద్దలు ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటాయి.

పులికాట్ పక్షి అభయారణ్యం

పులికాట్ పక్షి అభయారణ్యం

చిత్ర కృప : Shyam k

కొల్లేరు పక్షి అభయారణ్యం

కొల్లేరు పక్షి అభయారణ్యం విజయవాడ మహానగరానికి కి 60 కి. మీ. దూరంలో మరియు ఏలూరు పట్టణానికి సమీపంలో కలదు. కృష్ణా మరియు గోదావరి నదులు ఏర్పరిచిన అందమైన డెల్టా మైదానంలో కొల్లేరు సరస్సు ఉన్నది. ఈ సరస్సు అరుదైన పక్షులకి ఆవాసంగా ఉన్నది. తెల్ల బాతులు, కొంగలు మరియు వివిధ పక్షులు ఇక్కడి మంచి నీటి సరస్సులో విహరించడం వంటివి కెమరాల్లో బంధించడం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

కొల్లేరు పక్షి అభయారణ్యం

కొల్లేరు పక్షి అభయారణ్యం

చిత్ర కృప : J.M.Garg

మీకు ఒకవేళ వీలు కుదిరితే కృష్ణా జిల్లా అవనిగడ్డ గ్రామానికి సమీపాన 195 చ.కి.మి లలో విస్తరించిన కృష్ణా స్యాంక్చురీ ని దర్శించండి. ఇక్కడ కూడా సీజనల్ పక్షులను గమనించవచ్చు.

నేలపట్టు బర్డ్ స్యాంక్చురీ

నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. ఇక్కడికి చెన్నై(50 కి.మీ) మరియు నెల్లూరు ల నుండి చేరవచ్చు. ఈ స్యాంక్చురీ ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా కలదు. లిటిల్ కర్మోరంట్, పెయింటెడ్ స్తోర్క్, వైట్ ఇబిస్, స్పాటే డ్ బిల్లెద్ పెలికన్ వంటి చాలా జాతుల పక్షులు వచ్చి నివాసాలు ఏర్పరచుకుంటాయి.

నేలపట్టు బర్డ్ స్యాంక్చురీ

నేలపట్టు బర్డ్ స్యాంక్చురీ

చిత్ర కృప : Lalithamba

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+