Search
  • Follow NativePlanet
Share
» »మండ్య - అద్భుత ఆలయాలు !

మండ్య - అద్భుత ఆలయాలు !

By Mohammad

కొన్ని సార్లు ఆలయాల సందర్శన ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అక్కడికి వెళ్లి ఆలయాలను దర్శిస్తే ఎక్కడిలేని ప్రశాంతత దొరుకుతుంది. అక్కడ కొద్ది సేపు కూర్చుంటే చాలు మనసు పులకరిస్తుంది. రాత్రి ఆ సన్నిధిలో నిద్రపోతే చాలు మీ భయాలు దూరమయిపోతాయి. తీర్థ యాత్ర లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న గుళ్ళు, గోపురాలు ఏవి ? వాటి చరిత్ర ఏమిటి ? అని తెలుసుకుంటే మీ పర్యటన మరింత గొప్పగా సాగుతుంది.

ఇది కూడా చదవండి : కూర్గ్ లో చేయవలసిన 15 అంశాలు !

కొన్ని ఆలయాలను చూస్తే ఎప్పుడెప్పుడుపోదామా ..! అని అనిపిస్తుంది. దైవ భక్తి మీద ఆసక్తి లేనివారు సైతం ఈ ఆలయాలను చూడటానికి ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆలాంటి ఆలయాలను ఇప్పుడు మనం చూద్దాం !

కర్ణాటక లోని మండ్య జిల్లాలో చూడటానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే, అక్కడ కొన్ని ఆలయాలు మాత్రమే ప్రసిద్ధి చెందినాయి. వీటి చరిత్ర ఘనంగా, అద్భుతంగా ఉంటుంది.

చలువరాయ స్వామి ఆలయం, మేల్కొటే

చలువరాయ స్వామి ఆలయం, మేల్కొటే

చిత్ర కృప : Prathyush Thomas

చలువరాయ స్వామి ఆలయం, మేల్కొటే

మేల్కొటే, మండ్య నుండి 38 కి.మీ ల దూరంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడున్న చలువరాయస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. మైసూర్ పాలకులు ఇక్కడి దైవానికి ఎన్నో ఆభరణాలను సమర్పించారు. రామానుజాచార్యులు ఇక్కడ కొన్ని సంవత్సరాలు జీవించినట్లు చెబుతారు. టిప్పుసుల్తాన్ ఏనుగులను కానుకగా ఇచ్చాడని అంటారు.

రంగనాథస్వామి ఆలయం ,శ్రీరంగపట్నం

రంగనాథస్వామి ఆలయం ,శ్రీరంగపట్నం

చిత్ర కృప : Adam63

రంగనాథస్వామి ఆలయం , శ్రీరంగపట్నం

మండ్య నుండి 27 కి. మీ ల దూరంలో శ్రీరంగపట్నం కలదు. ఇక్కడ దేశంలోనే ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి ఆలయం కలదు. రంగనాథ స్వామిని విష్ణువు అవతారంగా భావించి కొలుస్తారు. ఆలయ నిర్మాణం విజయనగర శైలిని పోలి ఉంటుంది.

బాసరాలు మల్లికర్హున ఆలయం

బాసరాలు మల్లికర్హున ఆలయం

చిత్ర కృప : Dineshkannambadi

బాసరాలు మల్లికర్హున ఆలయం

బాసరాలు ఒక గ్రామం. ఇక్కడ 12 వ శతాబ్దానికి చెందిన మల్లికార్జున ఆలయం ప్రసిద్ధి. దీనిని హొయసల సైనికాధికారి నిర్మించాడు. ఆలయం వెలుపల రామాయణ, మహాభారత కావ్యాలను చిత్రాల రూపంలో అందంగా చెక్కినారు. ఆలయంలో ఉన్న అద్భుత చిత్రాలలో అంధకాసురుని తలపై నర్తిస్తున్న 16 భుజాల నటరాజ మూర్తి మరియు కైలాసాన్ని పైకి ఎత్తుతున్న రావణాసురుడు శిల్పాలు ఉన్నాయి.

సౌమ్య కేశవ ఆలయం, నాగమంగళ

సౌమ్య కేశవ ఆలయం, నాగమంగళ

చిత్ర కృప : Dineshkannambadi

సౌమ్య కేశవ ఆలయం, నాగమంగళ

నాగమంగళ పట్టణం హొయశిల కాలం నుండి ప్రాముఖ్యత కలిగి ఉంది. నాగమంగళ మాండ్య నుండి 42 కి.మీ దూరంలో ఉంది. నాగమంగళ లోహపు పనితనానికి నైపుణ్యం ఉన్న కళాకారులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న సౌమ్యకేశవ ఆలయం 12వ శతాబ్ధంలో నిర్మించబడిందని భావిస్తున్నారు. ఆలయ ప్రధానదైవం ఆదికేశవ విగ్రహం 1.83 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నాగమంగళ సమీపంలో ఉన్న కంబదల్లి జైనులకు పవిత్ర ప్రదేశం మరియు 16 కి.మీ దూరంలో ఆది చుంచనగరి ఒక యాత్రాస్థలం.

కరిఘట్ట ఆలయం

కరిఘట్ట ఆలయం

చిత్ర కృప : Kannadawiki123

కరిఘట్ట ఆలయం

కరిఘట్ట అనే ప్రదేశం బెంగళూరు - మైసూరు జాతీయ రహదారి మార్గంలో కలదు. ఇక్కడి కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది. ఆలయానికి చేరుకోవటానికి 100 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. పర్వతారోహకులు ఈ ప్రదేశం అనుకూలం. జులై మరియు నవంబర్ మాసాలలో జరిగే ఉత్సవాల సమయంలో భక్తులు అధికంగా వస్తుంటారు.

మండ్య ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం ద్వారా : మండ్య సమీపాన మైసూర్ ఎయిర్ పోర్ట్ 38 కి. మీ ల దూరంలో కలదు. 92 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు ఎయిర్ పోర్ట్ కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో మండ్య చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా: మండ్య లో రైల్వే స్టేషన్ కలదు. దేశంలోని అన్ని నగరాల నుండి ఇక్కడికి రైళ్లు నడుస్తుంటాయి.

రోడ్డు మార్గం ద్వారా : మండ్య లో బస్ స్టాండ్ కలదు. బెంగళూరు, మంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల నుండి మండ్య కు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరుగుతాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+