ఈ ఇండియన్ థాలీలను లాగించేయండి..!
భారతదేశం ఒకటి కాదు, లెక్కలేనన్ని రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఈ కారణంగానే ఇక్కడి ఆహారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించారు. ఇక్కడ రాజస్థానీ ఆహారాన్ని చూసినా లేదా మహారాష్ట్ర థాలీని చూసినా, ఒక్కొక్కటి ఒక్కో రుచి కలిగి ఉంటాయి. భారతీయ ఆహారం గురించి మాట్లాడేటప్పుడు తప్పకుండా ఇక్కడి రెస్టారెంట్ల గురించి మాట్లడాలి. అనేక నగరాల్లో నిర్దిష్ట రకం ప్లేట్ (థాలీ) లను అందించే రెస్టారెంట్లు ఇండియాలో ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద, ప్రసిద్ధ ప్లేట్ల (థాలీ) లో ఒకటి కాదు పది రకాల కూరగాయలు, నాలుగు నుంచి ఐదు రకాల రొట్టెలను వడ్డిస్తారు. ప్లేట్ (థాలీ)ను పూర్తిగా తిన్నవారికి రివార్డును కూడా ప్రకటిస్తారు. అయితే, మరెందుకాలస్యం భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన ప్లేట్ల (థాలీల) గురించి తెలుసుకుందాం పదండి.

ఖలీ బాలి థాలీ - న్యూఢిల్లీ
దేశంలోని రుచికరమైన, మసాలా, వెరైటీ ఫుడ్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఢిల్లీ నగరం. థాలీ గురించి మాట్లాడినట్లయితే, ఇక్కడ 'ఖలీ బలి థాలీ' కూడా అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ ప్లేట్ చిన్న ప్లేట్ కాదండి. ఇది 56-అంగుళాలు ఉంటుంది. 'అర్డోర్ 2.1' అందిస్తోంది. ఈ థాలీ ధర రూ. 1,999. ఇక నాన్ వెజ్ అయితే రూ. 2,299. ఈ ప్లేట్‌ను ఒక్కరూ మాత్రమే తినాల్సి ఉంటుంది. ఇది పది మంది పంచుకుని తినే ప్లేట్ కాదు. ఎక్కువ మంది ఈ ప్లేట్‌ను పంచుకోవాలనుకుంటే మాత్రం దీనికి విడిగా 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

బాహుబలి థాలీ, పూణే
వైరేటీ రుచులకు ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం పూణే. ఇక్కడ ప్లేట్ గురించి చెప్పాలంటే, స్వచ్ఛమైన శాఖాహార రెస్టారెంట్ 'ఆవోజీ ఖావోజీ'లో బాహుబలి ప్లేట్ లభిస్తుంది. ఈ థాలీలో 11 ప్రధాన వంటకాలు ఉంటాయి. ఇందులో మూడు రకాల అన్నం, రోటీ, ఊరగాయ, ఆరు రకాల పాపడ్, సలాడ్‌లను అందిస్తారు. దాంతో పాటు పొడవాటి గ్లాసులో లస్సీను కూడా అందిస్తారు. ఈ థాలీ రుచి చూడాలంటే మాత్రం రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

మహారాజా భోగ్ థాలీ - ముంబై
ముంబైలోని మిఠాయి దుకాణంలో స్వీట్స్‌తో కూడిన ప్రత్యేక థాలీ కూడా అందుబాటులో ఉంటుంది. దీనిని 'మహారాజావ్‌భోగ్' లేదా 56 భోగ్ థాలీ అని పిలుస్తారు. ఇది 56 రకాల వంటకాలను అందిస్తుంది. ఈ ప్లేట్‌ను టేబుల్‌పైకి తీసుకురావడానికి ఇద్దరు వ్యక్తుల అవసరం ఉంటుంది. అంత పెద్దగా ఈ ప్లేట్ ఉంటుంది.

కేసరియా థాలీ, బెంగళూరు
బెంగుళూరులో ప్రసిద్ధి చెందిన కేసరియా థాలీలలో 32 రకాల ఐటమ్స్‌ను వడ్డిస్తారు. ఇందులో వెల్‌కమ్ డ్రింక్ నుండి డెజర్ట్ వరకు అన్నీ ఉంటాయి. ఈ ప్లేట్‌ను ఒంటరిగా తినడం అసాధ్యం. కాబట్టి ఇద్దరు లేదా నలుగురు స్నేహితులను ఖచ్చితంగా మీతో పాటు తీసుకెళ్లండి.
చౌకీ ధని
సంప్రదాయ ఆహారాన్ని ఇష్టపడేవారికి రాజస్థాన్‌లోని చౌకీ ధానిలో ఉన్న చౌపాల్ అనే ఫైవ్ స్టార్ రెస్టారెంట్‌ని ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవాలి. ఈ రెస్టారెంట్‌లో రాజస్థానీ థాలీ అని అడగ్గానే ఓ పెద్ద థాలీని వడ్డిస్తారు. ఇందులో వివిధ రకాల రోటీ, దాల్ బాటి చుర్మా, గట్టె కి సబ్జీ, రైతా, పాపడ్, ఊరగాయ, సలాడ్‌తో పాటు ఖీర్ వడ్డిస్తారు. ఈ సూపర్ థాలీలోని మరో విశేషం ఏమిటంటే, కడుపు నిండే వరకు వంటకాలు వడ్డిస్తూనే ఉంటారు. కానీ, ఈ ప్లేట్‌ను ఇతరులతో పంచుకోవడానికి వీలులేదు. ఒక్కరే ఈ ప్లేట్‌ను తినాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications














