Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని అద్భుత‌మైన శివుని గుహ‌ల‌ను చూశారా?

దేశంలోని అద్భుత‌మైన శివుని గుహ‌ల‌ను చూశారా?

శంలోని అద్భుత‌మైన శివుని గుహ‌ల‌ను చూశారా?

పవిత్రమైన శ్రావ‌ణ‌ మాసం కొనసాగుతోంది. ఈ మాసం శివునికి అంకితం చేయబడింది. ఈ స‌మ‌యంలో భోలేనాథ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి, భక్తులు నిత్యం పూజ‌లు చేయ‌డంతోపాటు ఉపవాసాలు పాటిస్తారు. మహాదేవుడిని హృదయపూర్వకంగా పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భ‌క్తుల ప్ర‌గాడ విశ్వాసం. ఈ ప్రత్యేక మాసంలో భోలేనాథ్ సందర్శనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి శివాలయం పెద్ద సంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈ మాసంలో శివ దర్శనం, పూజలు చేయడం ద్వారా భక్తులు తమను తాము అదృష్టవంతులుగా భావిస్తారు. దేశంలోని ప్రసిద్ధ శివాలయాలను చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ శివుని గుహలను సందర్శించండి. ముందుగా ఈ గుహలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

అమర్‌నాథ్ గుహ హిందువుల ప్రసిద్ధ ధార్మిక ప్రదేశం. అయితే ఇది కాకుండా దేశంలో అనేక శివుని గుహలు ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

కోటేశ్వర్ గుహ, ఉత్తరాఖండ్

కోటేశ్వర్ గుహ శివుని గుహ. ఈ గుహ అలకనంద నది ఒడ్డున ఉంది. దీనిని కోటేశ్వర్ మహాదేవ్ దేవాలయం అంటారు. ఇది ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లా నుండి కొంత దూరంలో ఉంది. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం సహజసిద్ధంగా నిర్మితమైందని భక్తులు నమ్ముతారు. ఈ గుహ చుట్టూ అందమైన ప్రకృతి దృశ్యాలను చూడొచ్చు. పురాణాల ప్ర‌కారం శివుడు కేదర్‌నాథ్‌ వెళ్లే సమయంలో ఇక్కడ ధ్యానం చేసాడని, అప్పడు ఆ విగ్రహం సహజంగా ఏర్పడిందని చెబుతుంటారు. ఇక్కడ మహాశివరాత్రి అత్యంత ఘనంగా నిర్వ‌హిస్తారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఇక్కడ ఉత్సవాలు సైతం జ‌రుపుతుంటారు.

1

బాదామి గుహలు, కర్ణాటక

ఈ అందమైన గుహలు కర్ణాటకలోని ఉత్తర మధ్య భాగంలో ఉంది. ఈ గుహ లోపల నాలుగు ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో ఒకటి శివునికి అంకితం చేయబడింది. బాదామి రాతి గుహలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. బాగాల్‌కోట్ జిల్లాలోని బాదామి అనే పట్టణం సమీపంలో ఈ అరుదైన ఎర్రరాతి గుహలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని మొదట్లో వాతాపి అని పిలిచేవారు. ఇక్కడి రాతి గుహలు, అందులోని శిల్ప కళలు, దేవాలయాలు పర్యాటకులనే కాకుండా చరిత్రకారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ గొప్ప చారిత్రక ప్రాంతాన్ని వారసత్వ సంపద నగరంగా గుర్తించారు.

2

పల్లవ గుహలు, కేరళ

పల్లవ గుహలు కేరళలోని తిరుచిరాపల్లి రాతి కోటలో ఉన్నాయి. ఇందులో శివుడు, విష్ణువు ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం భక్తులలో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గుహ‌లు క్రీస్తుశ‌కం ఆర‌వ శ‌తాబ్దంలో నిర్మించిన నాలుగు రాక్‌కాట్ గుహ దేవాల‌యాల స‌ముదాయం. ఈ ప్ర‌దేశం కాంచీపురం నుండి కొంత దూరంలో ఉంది.

మండపేశ్వర్ గుహలు, ముంబై

మండపేశ్వర్ గుహలు శివునికి అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయాన్ని సుమారు 1600 సంవత్సరాల క్రితం గుహలను కత్తిరించి నిర్మించారని చెబుతుంటారు. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. 8వ శతాబ్దంలో ఈ మండపేశ్వర్ గుహలను నిర్మించారు. మౌంట్ పోయిన్సూర్, బోరివాలి వద్ద ఉన్న ఇవి ముంబైకి సమీపంలో ఉన్న ఇతర బౌద్ధ గుహల వలె కాకుండా శివునికి అంకితం చేయబడిన ఏకైక గుహలు.

3

ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర

ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇవి ముంబై నుండి 7 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్నాయి. ఈ గుహ లోపల శివుని అనేక రూపాలను చూడొచ్చు. ఇక్కడ ఇతర దేవతల అద్భుతమైన విగ్రహాలను కూడా చూడొచ్చు. గుహ గోడలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. వాటిని రాతితో అద్భుతంగా చెక్కారు.

More News

Read more about: elephanta caves maharashtra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+