Search
  • Follow NativePlanet
Share
» »మంత్రముగ్ధులను చేసే వంకనేర్ ప్యాలెస్ !

మంత్రముగ్ధులను చేసే వంకనేర్ ప్యాలెస్ !

ఈ పాలస్ నిర్మాణంలో అనేక శిల్ప శైలులు అవలంబించారు. గోతిక్ ఆర్చీలు, స్తంభాలు, నవీన మార్బుల్ బల్కనీలు, మొఘల్ డోమ్ కల క్లాక్ టవర్, ఫ్రాంకో ఇటాలియన్ కిటికీ అద్దాలు ఉదాహరణగా చెప్పవచ్చు.

By Mohammad

వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశం ఒక వంపు లో వుండటం వలన వచ్చింది. మంచు నది నీరు ఇక్కడ ఒక వంపు లో ప్రవహిస్తుంది. వంకనేర్ ఒక రాచరిక రాష్ట్రం దీనిని ఝాలా రాజపుత్రులు పాలించారు. కనుక దీనిని ఝాలావర్ అని కూడా అంటారు. వంకనేర్ ప్రదేశం మహారాణా అమరసింహ జి కాలంలో బాగా అభివృద్ధి చెందినది. అమర సిన్హాజి కళలు, శిల్పాలు అంటే అంటే ఎంతో ప్రేమించేవాడు. ప్రస్తుతం రాచ కుటుంబం నివసించే రంజిత్ విలాస్ పాలస్ అమర్ సిన్హాజి చే నిర్మించబడింది.

ఈ పాలస్ నిర్మాణంలో అనేక శిల్ప శైలులు అవలంబించారు. గోతిక్ ఆర్చీలు, స్తంభాలు, నవీన మార్బుల్ బల్కనీలు, మొఘల్ డోమ్ కల క్లాక్ టవర్, ఫ్రాంకో ఇటాలియన్ కిటికీ అద్దాలు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచ నలుమూలల నుండి శిల్ప శైలి తెచ్చారు.

వంకనేర్ ప్యాలెస్

వంకనేర్ ప్యాలెస్

చిత్రకృప : Dmp mech

ఈ ప్రదేశంలో సేకరించ బడిన వివిధ ఆటో మొబైల్స్ కూడా కలవు. మహారాజు కు రాయల్ ఒయాసిస్ వేసవి విడిదిగా వుండేది. రాయల్ ఒయాసిస్ మచ్చు లేక్ సమీపంలో కలదు. దీనిలో ఆర్ట్ డెకో స్టైల్ లో ఒక ఇందూర్ పూల్ కలదు. రాయల్ ఒయాసిస్ మరియు రాయల్ రెసిడెన్స్ రెండూ కూడా ఇపుడు హెరిటేజ్ హోటళ్ళు గా మారి గుజరాత్ ప్రభుత్వం చే నిర్వహించ బడుతున్నాయి. వంకనేర్ యొక్క ఈ శిల్ప శైలులు ఆ నాటి రాజ దర్పానికి ప్రతీకలు.

వంకనేర్ ప్యాలెస్ లో బాలీవూడ్ సినిమా షూటింగ్ లు చిత్రీకరిస్తుంటారు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఇక్కడ సినిమాలు చిత్రీకరించారు. వాటిలో ఒకటి గ్రాండ్ మస్తీ 2 సినిమా.

రంజిత్ విలాస్ పాలస్

వంకనేర్ రాజుల కళాభి రుచి, శిల్పాల పట్ల వారికి గల మక్కువ ఎటువంటివో రంజిత్ విలాస్ పాలస్ నిర్మాణం చెపుతుంది. 1907లో మహారాజ అమర్ సిన్హా జి ఒక కొండపై నిర్మించిన ఈ రాజ భవనం ఎన్నో శిల్ప శైలులు కలిగి అందమైన వంకనేర్ టవున్ ని చూపుతుంది.

వంకనేర్ పెయింటింగ్

వంకనేర్ పెయింటింగ్

చిత్రకృప : Fæ

దీని నిర్మాణంలో గోతిక్ ఆర్చీలు, మొఘల్ డోమ్ కల ఒక పెద్ద క్లాక్ టవర్, ఫ్రాంకో ఇటాలియన్ విండో కిటికీలు, బల్కనీలు, ఇంకా అనేక ఇతర ఆకర్షణలు కలవు. ఈ రాజ భవనం లో రాజ కుటుంబం ఉన్నప్పటికీ, పాలస్ లో కొంత భాగాన్ని ఒక మ్యూజియంగా మార్చి అనేక కలాక్రుతులను ప్రదర్శిస్తూ పబ్లిక్ కు ఓపెన్ గా ఉంచారు.

రాయల్ ఒయాసిస్

మాచు లేక్ ఒడ్డున కల రాయల్ ఒయాసిస్ ఒకప్పుడు పాలస్ గెస్ట్ హౌస్ గా వుండేది. ఇపుడు అది ఒక హెరిటేజ్ హోటల్ గా మారి ఎన్నో వృక్షాలు, అందమైన పక్షుల ధ్వనులు కలిగి వుంటుంది. ఈ పురాతన రాజ భవనంలో 20 వ శతాబ్దానికి చెందిన ఒక మెట్ల బావి దీనికి మరింత అందాన్ని చేకూర్చింది.

ఇది కూడా చదవండి : జామ్ నగర్ - 'సిటీ ఆఫ్ జామ్స్' !!

రాయల్ రెసిడెన్సి

పాలస్ పక్కనే గల రాయల్ రెసిడెన్స్ ఒకప్పుడు అద్భుతాల గెస్ట్ హౌస్ గా వినియోగించారు. ఇపుడు ఈ భవనం ఒక హెరిటేజ్ హోటల్ గా మారింది.

రాయల్ ఒయాసిస్ హెరిటేజ్ లోపలి భాగం (స్విమ్మింగ్ పూల్)

రాయల్ ఒయాసిస్ హెరిటేజ్ లోపలి భాగం (స్విమ్మింగ్ పూల్)

వసతి

వంకనేర్ లో వసతి సదుపాయాలు చక్కగా అందుబాటులో ఉన్నాయి. 55 వరకు హోటళ్ళు, రెస్టారెంట్లు పర్యాటకుల సౌకర్యార్థం ఉన్నాయి. వంకనేర్ లో పర్యాటకులు సందర్శించేటప్పుడు గుజరాతీ వంటకాలను తప్పక రుచి చూడండి. షాపింగ్ లో గుజరాతీ దుస్తులను, అలంకార సామాగ్రి మొదలైన వస్తువులను కొనుగోలుచేయండి.

ఇది కూడా చదవండి : హనుమాన్ ను ఆవహించి ఊగిన ప్రదేశం !!

వంకనేర్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు ప్రయాణం

వంకనేర్ రాజ్ కోట్ కు సమీపం లో కలదు. రాజ్ కోట్ కు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు కలవు. ప్రైవేటు బస్సులు కూడా నడుస్తాయి. రాజ్ కోట్ మునిసిపల్ కార్పొరేషన్ ఈ బస్సు లను నగరంలో సి ఎన్ జి ఇంధనంపై నడుపుతుంది.

రైలు ప్రయాణం

వంకనేర్ రైల్వే స్టేషన్ అహ్మదాబాద్ - రాజ్ కోట్ రూటులో కలదు. రాజ్ కోట్ జంక్షన్ నుండి ఇండియా లోని అన్ని ప్రదేశాలకు రైళ్ళు కలవు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై మరియు ఇతర నగరాల నుండి రాజ్ కోట్ కు ఈ ట్రైన్ లు కలుపబడ్డాయి.

విమాన ప్రయాణం

రాజ్ కోట్ స్థానిక ఎయిర్ పోర్ట్ సమీప ఎయిర్ పోర్ట్. ఇక్కడ నుండి గుజరాత్ మరియు ఇండియా లోని ప్రధాన నగరాలకు విమానాలు కలవు.

వంకనేర్ నుండి వివిధ ప్రాంతాలకు దూరం : గాంధీనగర్ - 231 కి.మీ., జాంనగర్ -112 కి.మీ., రాజ్ కోట్ - 62 కి.మీ., వడోదర - 283 కి.మీ., అహ్మదాబాద్ - 209 కి.మీ., ముంబై - 699 కి.మీ.

More News

    Read more about:
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+