Search
  • Follow NativePlanet
Share
» »Hyderabad Tour: లాంగ్ డ్రైవ్ చేస్తూ.. ఈ లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి

Hyderabad Tour: లాంగ్ డ్రైవ్ చేస్తూ.. ఈ లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి

మ‌రికొన్ని రోజుల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్ట‌బోతున్నాం. ఈ స‌మ‌యంలో ఈ వారం క్రిస్మ‌స్ సెల‌వులతో పాటు న్యూయర్ సెల‌వులు కూడా వచ్చేశాయి. రోజువారీ జీవితంలో, తీరిక స‌మ‌యం లేకుండా బిజిగా గ‌డిపిన వారి కోసం ఈ లాంగ్ వీకెండ్ ఎంత‌గానో ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో హైద‌ర‌బాద్‌లో ఉండేవారు త‌ప్ప‌కుండా ఈ లాంగ్ వీకెండ్‌లో ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ణాళిక‌లు వేసుకోవాల్సిందే.

అలాంటివారి కోసం ఈ భాగ్య‌న‌గ‌రంలో కుటుంబస‌మేతంగా విహ‌రించేందుకు మ‌న‌సును హ‌త్తుకునే సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ లాంగ్ వీకెండ్‌లో కుటుంబంతో పాటు స్నేహితుల‌తో క‌లిసి సంతోషంగా, ఉత్సాహ‌భ‌రితంగా లాంగ్ డ్రైవ్ చేస్తూ.. గ‌డ‌పాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా హైద‌రాబాద్‌లోని ఈ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌కు వెళ్లాల్సిందే. మ‌రెందుకు ఆల‌స్యం.. ఆ ప్ర‌దేశాలేంటో చూసేద్దాం రండి.

nagarjunasagar dam

నాగార్జున సాగర్ అందాలు

ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదిస్తూ.. ఈ లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేయాల‌నుకునేవారి టూర్ జాబితాలో మొద‌టి స్థానంలో హైద‌ర‌బాద్ స‌మీపంలోని నాగార్జున సాగ‌ర్ త‌ప్ప‌కుండా చేర్చుకోవాలి. ఎందుకంటే, ప‌ని ఒత్తిడితో స‌త‌మ‌త‌మ‌య్యే వారి ఈ ప్ర‌దేశం అందించే ప్ర‌శాంత‌త‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. అంతేకాదు, ఈ ట్రిప్‌ను కుటుంబంతో ప్లాన్ చేసుకోవచ్చు. ప్ర‌పంచంలోని ఎత్త‌యిన ఆన‌క‌ట్ట‌ల‌లో ఒక‌టైన నాగార్జున సాగ‌ర్ విశిష్ట‌త‌ను ద‌గ్గ‌ర‌గా చూసేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. ఈ ఆన‌క‌ట్ట ప్ర‌పంచ‌లోనే అతిపెద్ద కృత్రిమ స‌ర‌స్సు ప్రాంతంగా ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది.

124 మీట‌ర్ల ఎత్తులో ఈ ఆన‌క‌ట్ట 26 గేట్లుతో మిమ్మ‌ల్ని ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. అలాగే, ఇక్క‌డి త‌వ్వ‌కాల్లో శ‌తాబ్దాల నాటి బౌద్ధ నిర్మాణాలు కూడా బ‌య‌ట‌ప‌డ్డాయి. ప‌డ‌వ ప్ర‌యాణం చేయాల‌నుకునేవారు నీటిపై తేలియాడుతూ సాగ‌ర్ అందాల‌ను ద‌గ్గ‌ర‌గా వీక్షించొచ్చు. ఎందుకంటే, ప‌డ‌వ ప్ర‌యాణం ద్వారానే ఈ ఆన‌క‌ట్ట‌ను చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్క‌డికి చేరుకునేందుకు హైద‌ర‌బాద్ నుంచి నాలుగైదు గంట‌లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. భాగ్య‌న‌గ‌రం నుంచి సుమారు 165 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

ప్ర‌కృతి చాటున‌.. పాఖల్ సరస్సు

ఇక ఈ లాంగ్ వీకెండ్ జాబితాలో రెండో స్థానం పాఖ‌ల్ స‌ర‌స్సు. ఈ లాంగ్ వీకెండ్‌లో సంద‌ర్శించేందుకు ఇది ఎంతో అనువైన ప్ర‌దేశం. ఇది హైదరాబాద్ నుంచి దూరం సుమారు 198 కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ ఒక మానవ నిర్మిత స‌ర‌స్సు. ఈ స‌ర‌స్సు ఒడ్డున కూర్చుని ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ గ‌డిపితే.. అస‌లు స‌మ‌య‌మే తెలియ‌దంటే న‌మ్మండి. అలాగే, ఇక్క‌డి రాత్రిపూట అట‌వీ ప్రాణుల మ‌ధ్య క్యాంపింగ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

ఈ స‌ర‌స్సుకు స‌మీపంలో ప్ర‌కృతిసిద్ధ‌మైన వ‌న్య‌ప్రాణుల అభ‌యార‌ణ్యం కూడా ఉంది. ఉద‌యం స‌మ‌యంలో ఈ పార్కులోకి వెళ్లి అక్క‌డ ఉన్న జంతువులను, ప‌క్షులను సంద‌ర్శించొచ్చు. ఇది ఒక అడ్వంచ‌ర్ ట్రిప్ అనుభూతిని అందిస్తుంది. స్నేహితుల‌తో క‌లిసి స‌రాదాగా ఉండాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతానికి వెళ్లాల్సిందే. హైద‌రాబాద్ నుంచి ఈ స్పాట్‌ను చేరుకునేందుకు సుమారు నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

bidar , toursim

హ‌స్త‌క‌ళ‌ల‌.. బీద‌ర్‌

ఈ లాంగ్ వీకెండ్‌లో మీ జాబితాలో బీద‌ర్‌ను చేర్చ‌క‌పోతే ఈ జాబితా అసంపూర్తిగా ఉండిపోతుంది. ఇక్క‌డ ఠీవిగా ద‌ర్శ‌న‌మిచ్చే పురాత‌న‌ కోట దేశంలోని అతి పెద్ద కోట‌గా ప్ర‌సిద్ధిచెందింది. ఇక్క‌డి కోట నిర్మాణాలు ప‌ర్షియ‌న్ శైలిని పోలి ఉంటాయి. భాగ్య‌న‌గ‌రానికి స‌మీపంలో ఉండే ఈ ప్రాంతం లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేసేందుకు ది బెస్ట్ ఎంపిక అని చెప్పుకోవ‌చ్చు. ఈ ప్ర‌దేశం హైద‌రాబాద్ నుంచి 147 కిలోమీట‌ర్ల దూరంలో మాత్ర‌మే ఉంటుంది. ఇక్క‌డి బిద్రి హ‌స్త‌క‌ళ‌ల‌కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ప్ర‌దేశం వెండి, ఇత‌ర లోహ మిశ్ర‌మాల‌తో త‌యారు చేసే వ‌స్తువుల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ఇక్క‌డే బ‌హ‌మ‌నీ పాల‌కుల నాటి స‌మాధులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప‌ర్యాట‌కుల‌ను విస్మ‌యానికి గురిచేసే చిత్ర‌క‌ళ‌లు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. హైద‌ర‌బాద్ నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు 3 గంట‌ల స‌మ‌యం ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+