Search
  • Follow NativePlanet
Share
» »శ్రీలంక రామాయణ్​ యాత్ర పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

శ్రీలంక రామాయణ్​ యాత్ర పేరుతో ఐఆర్‌సిటిసి స‌రికొత్త టూర్ ప్యాకేజీ..

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ప‌ర్యాట‌కుల కోసం ఎప్ప‌టిక‌ప్ప‌డూ స‌రికొత్త టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. దేశంలోని ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్రాల‌తో పాటు, పురాత‌న‌మైన ప్ర‌దేశాల‌ను మ‌రెన్నో ప‌ర్యాట‌కుల‌కు అందిస్తోంది. ఇక‌, తాజాగా ఐఆర్‌సిటిసి ప‌ర్యాట‌కుల కోసం అతి పురాతన చరిత్ర కలిగిన ద్వీప దేశ‌మైన శ్రీ‌లంక టూర్ ప్యాకేజీనీ తీసుకొచ్చింది. ఆ టూర్ ప్యాకేజీ వివ‌రాలేంటో చూసేద్దామా..?

శ్రీ‌ల‌కం ఒక పురాత‌న చ‌రిత్ర క‌లిగిన ప్ర‌దేశంతోపాటు సుంద‌ర‌మైన ప్ర‌కృతి ప్ర‌దేశాలున్న ప్రాంతం కూడా.. ఈ ప్రాంతాన్ని ఎన్ని సార్లు చూసినా మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. అందుకే ఐఆర్‌సిటిసి శ్రీ‌లంక టూర్ ప్యాకేజీనీ తీసుకొచ్చింది. శ్రీలంక రామాయణ్​ యాత్ర విత్​ శంకరీ దేవి శక్తి పీఠం పేరుతో ఐఆర్‌సిటిసి ఈ ప్యాకేజీనీ ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కొలంబో, దంబుల్లా, కాండీ, నువారా ఎలియాలోని రామాయాణికి సంబంధించిన ప్రదేశాలు సంద‌ర్శించొచ్చు. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ప‌ర్య‌ట‌న హైదరాబాద్​ నుంచి మొద‌లువ‌తుంది. ఫ్లైట్​ జర్నీ చేయాల్సి ఉంటుంది.

ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మొదటి రోజు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్క‌డినుండి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీలంక చేరుకుంటారు. శ్రీలంక నుంచి దంబుల్లాకు వెళ్తారు. మార్గమధ్యలో చిలావ్‌లోని మునీశ్వరం ఆలయ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆతర్వాత మనవేరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి దంబుల్లాకు వెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ నైటంతా అక్క‌డే ఉంటారు. ఇక‌, మ‌రుస‌టిరోజు హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి, దంబుల్లా కేవ్​ ఆల‌య ద‌ర్శ‌న‌కు బ‌యలుదేరుతారు. లంచ్​ అయ్యాక ట్రింకోమలీకి వెళ‌తారు. అక్క‌డ‌ తిరుకోణేశ్వర్, లక్ష్మీనారాయణ పెరుమాల్​ ఆలయాల‌ను సంద‌ర్శిస్తారు. వెంట‌నే తిరిగి దంబుల్లాకు చేరుకుంటారు. ఆ నైటంతా స్టేయింగ్ అక్క‌డే ఉంటుంది. మూడో రోజు కాండీ ప‌ర్య‌ట‌న ఉంటుంది.

IRCTC new tour package named Sri Lanka Ramayan Yatra

జెమ్స్ ఫ్యాక్టరీ / బాటిక్ ఫ్యాక్టరీ, టూత్ టెంపుల్ వంటి ప్రాంతాల‌ను వీక్షిస్తారు. ఆ త‌ర్వాత ఈవెనింగ్ పలు ప్రదేశాలను సంద‌ర్శిస్తారు. ఆ నైటంతా కాండీలోనే బ‌స చేస్తారు. నాలుగో రోజు నువారెలియా సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ మార్గం మధ్యలో రాంబోడాలోని భక్త హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంత‌రం సీత అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక వంటి ప్రాంతాల‌ను విజిట్ చేసి తిరిగి కాండీకి చేరుకుంటారు. ఐదో రోజు హోటల్ నుంచి వెళ్లిపోయాక‌, పిన్నవాలా ఎలిఫెంట్ అనాథాశ్రమాన్ని ప‌ర్య‌టిస్తారు. అనంత‌రం కొలంబో ప్ర‌యాణం ఉంటుంది. అక్క‌డ పంచముగ ఆంజనేయర్ ఆలయం, కెలనియా బుద్ధ దేవాలయాల‌ను వీక్షిస్తారు. ఆరో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్ అవుతారు​. మధ్యాహ్నం వరకు కొలంబోలోని ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తారు. అనంత‌రం విమానాశ్ర‌యంలో డ్రాప్​ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో నుంచి బయలుదేరుతారు. అదేరోజు సాయంత్రానికి హైదరాబాద్​ చేరుకోవడంతో ఈ ప‌ర్య‌ట‌న ముగుస్తోంది.

ఈ ప‌ర్య‌ట‌న రేట్లు ఇవే..

సింగిల్​ షేరింగ్​కు రూ.83,170 చెల్లించాలి. అదే డబుల్​ షేరింగ్​ అయితే రూ.68,420 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్​ షేరింగ్​కు రూ.67,480 గా నిర్ణ‌యించారు. పిల్లలకు విత్​ బెడ్​ అయితే రూ.43,400 చెల్లించాలి. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.41,160 ఉంటుంది. ఇక‌, ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్​ ఛార్జీలతో పాటు హోటల్​ అకామిడేషన్​, ఐదు బ్రేక్​ఫాస్ట్​, ఐదు లంచ్​, ఐదు డిన్నర్​లు క‌వ‌ర్ అవుతాయి. వీటితోపాటు టూర్​ గైడ్​ కూడా ప‌ర్యాట‌కుల‌కు నిత్యం అందుబాటులో ఉంటారు. ట్రావెల్​ ఇన్సూరెన్స్​ కూడా ఇందులోనే వ‌ర్తిస్తుంది. ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 28వ తేదీన ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్​కు సంబంధించి పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించగ‌ల‌రు.

More News

    Read more about: irctc hyderabad sri lanka
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+