Search
  • Follow NativePlanet
Share
» »ఐఆర్‌సీటీసీ కొత్త టూర్ ప్యాకేజ్‌.. విశాఖ టు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేయండి!

ఐఆర్‌సీటీసీ కొత్త టూర్ ప్యాకేజ్‌.. విశాఖ టు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేయండి!

ఐఆర్‌సీటీసీ కొత్త టూర్ ప్యాకేజ్‌.. విశాఖ టు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేయండి!

మంచుకురిసే వేళ‌లో కాశ్మీర్ అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం కాస్త క‌ష్ట‌మే. ప్ర‌కృతి మ‌ల‌చిన ఆ అందాల నేల‌పై ఒక్క‌సారైనా కాలుమోపాల‌నే కోరిక అంద‌రిలోనూ ఉంటుంది. అదీ ఈ సీజ‌న్‌లో అయితే ఆ కోరిక రెట్టింపు అవుతుంది. అలా కశ్మీర్ అందాలు చూడాలని ఆశ‌ప‌డేవారికోసం ఐఆర్‌సీటీసి స‌రికొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అది కూడా మ‌న విశాఖ‌ప‌ట్నం నుంచి కాశ్మీర్‌కు నేరుగా వెళ్లేలా ప్లాన్ చేసింది. కాశ్మీర్‌తోపాటు అక్క‌డి చుట్టుప‌క్క‌ల అందాల‌ను ఈ టూర్ మ‌న‌సారా చూసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. మ‌రెందుకు ఆల‌స్యం ఆ టూర్ ప్యాక్ విశేషాల‌ను తెలుసుకుందాం రండి.

ప‌ర్యాట‌క ప్రేమికుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం తాజాగా కొత్త టూర్ ప్యాకేజ్ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీతో ఏపీలోని విశాఖపట్నం నుంచి కశ్మీర్‌కు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. అక్క‌డి సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలైన‌ శ్రీనగర్, గుల్మర్గ్, పహల్గం, సోనామర్గ్ వంటి అనేక ప్రాంతానుల చూసే ఆవ‌కాశం ఉంటుంది. అయితే, ధ‌ర మాత్రం కాస్త ఎక్కువ‌గా ఉంద‌నుకోండి. అయినా.. విహార‌యాత్ర‌క ఆ మాత్రం ఖ‌ర్చు చేయ‌క‌పోతే ఎలా చెప్పండి.

ఇక ధ‌ర‌ల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. విశాఖ నుంచి కశ్మీర్ టూర్ ధర రూ. 39,120 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ధ‌ర‌ ట్రిపుల్ ఆక్యుపెన్సీకి వర్తిస్తుంది. సింగిల్ ఆక్యూపెన్సీ అయితే మాత్రం రూ. 49,305 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ ఆక్యూపెన్సీ అయితే రూ. 39,910గా నిర్ణ‌యించారు. కుటుంబంతో వెళ్లేవారు చైల్డ్ విత్ బెడ్ (5 - 11 ఏళ్లు) అయితే రూ. 36,060 చెల్లించాలి. చైల్డ్ విత్ ఔట్ బెడ్ అయితే రూ. 33,775 క‌డితే స‌రిపోతుంది.

మూడు విడ‌త‌ల్లో టూర్‌కు అవ‌కాశం..

మూడు విడ‌త‌ల్లో టూర్‌కు అవ‌కాశం..

ఈ విహార‌యాత్ర‌ ఫిబ్రవరి 24న ప్రారంభం అవుతుంది. అలాగే రెండో విడ‌త‌గా మార్చి 10న కూడా అందుబాటులో ఉంచారు. మూడో విడ‌త‌గా మార్చి 24న కూడా టూర్ స్టార్ట్ అవుతుంది. అంటే మూడు సార్లు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంద‌న్న‌మాట‌. కశ్మీర్ అందాల‌ను మ‌న‌సారా ఆస్వాదించాల‌నుకునేవారు వెళ్లాలని భావించే వారు ఈ తేదీల్లో నచ్చిన టైమ్‌లో టూర్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. మొత్తం ఈ టూర్ ఐదు రాత్రులు లేదా ఆరు రోజులు ఉంటుంది.

టూర్ రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..

టూర్ రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..

ఈ టూర్ విశాఖపట్నం విమానాశ్ర‌యం నుంచి మొద‌ల‌వుతుంది. విహార‌యాత్ర‌లో భాగంగా తొలుత‌ విశాఖపట్నం నుంచి శ్రీనగర్ చేరుకుంటారు. అక్కడ ఉన్న సంద‌ర్శ‌నీయ‌ ప్రదేశాలను ఓ రౌండ్‌లో చూసేస్తారు. తర్వాత శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి అందాల‌ను మీ మ‌న‌సులో ప‌దిల‌ప‌ర‌చుకుని తిరిగి శ్రీనగర్ చేరుకుంటారు. తర్వాత శ్రీనగర్ నుంచి పహల్గం తీసుకువెళ‌తారు. ప‌హ‌ల్గం ప్ర‌కృతి దృశ్యాలు చూసిన తర్వాత మళ్లీ శ్రీనగర్ వస్తారు. తర్వాత సోనమర్గ్‌కు బ‌య‌లుదేరుతారు. ఇక్క‌డే అస‌లైన టూర్ ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. అక్క‌డి సంద‌ర్శ‌నీయ ప్రదేశాలు ఎన్నో అనుభూతుల‌ను చేర‌వ చేస్తాయి. అక్క‌డి నుంచి మ‌ళ్లీ శ్రీనరగ్ వ‌చ్చాక, సాయంత్రానికి శ్రీన‌గ‌ర్ నుంచి నుంచి విశాఖపట్నం తిరుగుప్ర‌యాణం అవ్వ‌డంతో కాశ్మీర్ టూర్ పూర్తవుతుంది.

ఇక చెల్లింపుల వివ‌రాల్లోకి వెళితే..

ఇక చెల్లింపుల వివ‌రాల్లోకి వెళితే..

ప్ర‌యాణం మొద‌ల‌య్యాక‌ విమాన టికెట్‌లు మొద‌లుకుని హోటల్‌లో విడిది, బ్రేక్ ఫాస్ట్, డిన్నర్, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, టూర్ ఎస్కార్ట్ స్వర్వీసులు వంటివి అన్నీ ఈ టూర్ ప్యాకీజీలోలో భాగంగానే ఉంటాయి. అయితే సైట్ సీయింగ్‌లో ఎంట్రెన్స్ టికెట్లు, లంచ్, ఇతర ఫుడ్, ఫ్లైట్‌లో మీల్స్ వంటి తదితర వాటికి అదనంగా మనమే డబ్బులు చెల్లించుకోవాలి. కశ్మీర్ టూర్‌కు వెళ్లాలని మ‌న‌సులో అనుకుంటే మాత్రం అస్స‌లు ఆల‌స్యం చేయ‌కండి. వెంట‌నే, ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి టూర్ కోసం బుక్ చేసుకోండి.

More News

Read more about: visakhapatnam kashmir
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+