జిల్లా : చిక్కబళ్లాపూర్
పట్టణం : కైవార
ఆలయం : భీమలింగేశ్వర ఆలయం
కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపూర్ జిల్లాలోని కైవార అనే చిన్న పట్టణంలో భీమలింగేశ్వర ఆలయం ఆలయం కలదు. ఈ దేవాలయాన్నీ దర్శించటానికి కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుండే కాక ... ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ సరిహద్దు ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు.

కైవార ఆలయం
చిత్ర కృప : sanchantr Follow
భీమలింగేశ్వర ఆలయం
కైవార లోని భీమలింగేశ్వర ఆలయాన్ని భీముడు నిర్మించాడు. భీముడు, పాండురాజులలో ఒకడు. మహాభారత కాలంలో కైవార పట్టణాన్ని ఏకచక్రాపురం అని పిలిచేవారు. పాండవులు తాము అజ్ఞాతవాసం చేసే సమయంలో ఈ ప్రాంతంలో ఒక సంవత్సరం పాటు తలదాచుకున్నారు. ఇతిహాసాల మేరకు ఈ ప్రదేశంలోనే పాండవులలో ఒకడైన భీముడు ప్రజలను హింసిస్తున్న బకాసురుడు అనే రాక్షసుడిని చంపి ప్రజలకు ఎంతో మేలు చేసాడు.
బకాసుర గుహ
కైవార పట్టణానికి కొద్ది దూరంలో బకాసుర గుహ కలదు. ఇందులో బకాసుర అనే రాక్షసుడు నివసించేవాడు. ప్రతి రోజూ అతనికి బండెడు ఆహారాన్ని చేరవేసేవారు స్థానికులు. ఒకేవేళ ఆహారం చేరవేయలేకపోతే ఊరి మీద పడి రాక్షసుడు ప్రజలను హింసించేవాడు. ఆ సమయంలోనే అక్కడికి అజ్ఞాతవాసం చేస్తూ వచ్చిన పాండవులకు ఈ విషయం తెలిసింది. వెంటనే భీముడు తన ఆయుధాన్ని చేతబట్టుకొని అతనితో తలపడుతాడు. భీముడు బకాసురుడిని వధించి ఆ ప్రాంత ప్రజలకు మేలు చేకూరుస్తాడు.

బకాసుర గుహ
కైవార ప్రాంత సమీపంలో కల ఒక గుహలో ఇప్పటికి ఆ రాక్షసుడి అవశేషాలు కప్పబడి ఉన్నట్లు చెపుతారు. శివరాత్రి సమయంలో బకాసురుడి రక్తం ఇంకా చిందుతూనే ఉంటుందని స్ధానికులు చెపుతారు.
ఇది కూడా చదవండి : నంజన్ గూడ్ - ఒక దేవాలయాల పట్టణం !
కైవార తాతయ్య గా ప్రసిద్ధి చెందిన కన్నడ కవి నారాయణప్ప ఈ ప్రాంతానికి చెందినవాడే. ఈయన కన్నడ, తెలుగు భాషలలో ఎన్నో సాహిత్య రచనలు, కావ్యాలు రచించాడు. విష్ణు భగవానుడికి ఎన్నో కీర్తనలను రచించి అంకితం చేసాడు. విష్ణుభగవానునికి ఇక్కడ అమరనారాయణ స్వామి ఆలయం కలదు. కాలజ్ఞానం చెప్పే మహర్షిగా కూడా నారాయనప్ప ప్రసిద్ధి.

లక్ష్మణ తీర్థ
లక్ష్మణ తీర్థ
లక్ష్మణ తీర్థ చాముండేశ్వరి ఆలయానికి ముందు భాగంలో కొండపై కలదు. ఈ తీర్థం త్రేతాయుగం నాటిది. రాముడు, సీత మరియు లక్ష్మణుడు వనవాస సమయంలో ఈ ప్రదేశంలో నడుచుకుంటూ వెళుతుంటే సీతాదేవికి దాహం వేస్తుంది. అప్పుడు లక్ష్మణుడు బాణాన్ని వేసి సీతాదేవి దాహార్తి తీరుస్తాడని పురాణ కధనం.
ఇది కూడా చదవండి : బెంగళూరు లో మీకు తెలియని వారాంతపు విహారాలు !
కన్యక పరమేశ్వరి ఆలయం
కైవార లో నిర్మించిన కన్యక పరమేశ్వరి ఆలయం కొత్తది. ఇందులో వాసవి కన్యక పరమేశ్వరి విగ్రహం కలదు. రంగనాథ స్వామి, శివుడు మరియు పార్వతి దేవి ల విగ్రహాలను సైతం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఈ గుడికి సమీపంలో వేణుగోపాల స్వామి ఆలయం కలదు.

యోగి నారాయణ ఆశ్రమం
చిత్ర కృప : Nagesh Kamat
కైవార లో సందర్శించవలసిన ఇతర ఆకర్షణలు
సంగీత వాయిద్యాలతో కూడిన ఒక చక్కటి తోట, చిన్న జంతు ప్రదర్శానాలయం, పంచ పాండవుల పేర్లతో అయిదు కాటేజీలు ఈ ప్రాంతంలో కలవు. ఈ ప్రదేశంలో యోగి నారాయణ ఆశ్రయం, యోగనరసింహ స్వామి ఆలయం, వైకుంఠ మరియు తాతయ్య గుహలు మరియు 7 కిలోమీటర్ల దూరంలో కైలాసగిరి గుహాలయాలు కైవార లో చూడవలసిన ప్రధాన పర్యాటక ప్రదేశాలు.

కైవార చేరుకోవటం ఎలా ?
చిత్ర కృప : Saileshkiran
కైవార ఎలా చేరుకోవాలి ?
- విమాన మార్గం : కైవార పట్టణానికి సమీపంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు.
- రైలు మార్గం : బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలో కలదు.
- బస్సు / రోడ్డు మార్గం : కైవార పట్టణం బెంగళూరు నుండి 70 km ల దూరంలో కలదు. బెంగళూరు లో బస్సు ఎక్కి కైవార క్రాస్ రోడ్ లో దిగి, అక్కడి నుండి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కైవార పట్టణం చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












