Search
  • Follow NativePlanet
Share
» »కీలాంగ్ - బౌద్ధ ఆరామాల భూమి !

కీలాంగ్ - బౌద్ధ ఆరామాల భూమి !

కీలాంగ్ ను బౌద్ధ ఆరామాల భూమి అని కూడా పిలుస్తారు. హిమాచల్ ప్రదేశ్ లో కల ఈ పర్యాటక ప్రదేశం.. అనేక అందమైన పర్యాటక ఆకర్షణలు కలిగి వుంది. ఈ ప్రదేశ అందాలను వర్ణిస్తూ ప్రసిద్ధ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ " ఇది తప్పక దేవతల నివాస ప్రదేశం అని, మానవులకు ఇక్కడ చోటు లేదని " వర్ణించాడు. ఉత్సాహాలను పుట్టించే పర్వత శ్రేణులు, వాటితో పాటు అక్కడే కల అందమైన లోయలు ఈ ప్రదేశాన్ని ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దాయి.

కీలాంగ్ - బౌద్ధ ఆరామాల భూమి !

లోయల గుండా ప్రవహిస్తున్న స్పితి నది

Photo Courtesy: Ajith U

ఇక్కడ పర్యాటకులు అనేక బౌద్ధ ఆరామాలు చూడవచ్చు. వీటికి చారిత్రక ప్రాధాన్యతే కాదు శిల్ప కళా ప్రధాన్యతలు కూడా కలవు. కార్దంగ్ మొనాస్టరీ మరియు శాసూర్ మొనాస్టరీ లు ఇక్కడ ప్రధానమైనవి. ఇవి సముద్ర మట్టానికి సుమారు 3500 మీ. ల ఎత్తున కలవు. కార్దంగ్ మొనాస్టరీ సుమారు 900 సంవత్సరాల నాటిదిగా చెపుతారు. ఇంకనూ ఇక్కడ గురు ఘంతాల్ మొనాస్టరీ, తాయూల్ మొనాస్టరీ, గేమూర్ మొనాస్టరీ లు కూదాకలవు. కీలాంగ్ లో సందర్శనకు అనేక ప్రదేశాలు కలవు. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర కలదు. సాహస క్రీడల ఆసక్తి కల పర్యాటకులకు ఇక్కడ అనేక సాహస క్రీడలు అయిన ట్రెక్కింగ్, ఫిషింగ్, కేమ్పింగ్, పారా గ్లైడింగ్, స్కయింగ్ , జీప్ సఫారి వంటివి కలవు.

గేమూర్ మొనాస్టరీ

కీలాంగ్ లోని గేమూర్ మొనాస్టరీ తప్పక చూడవలసిన ఆరామం. ఇది 700 సంవత్సరాల పురాతనమైనది,భాగా వ్యాలీలో కలదు. ఇది గేమూర్ విలేజ్ కు కొద్ది దూరంలో కలదు. పర్యాటకులు తమ సైట్ సీయింగ్ లో భాగంగా గేమూర్ విలేజ్ తప్పక చూడాలి. ప్రతి సంవత్సరం, జూలై నెలలో ఇక్కడ 'డెవిల్ డాన్స్' లేదా దెయ్యాల నృత్యం అనే పండుగ ఆరామంలో నిర్వహిస్తారు. ఈ పుణ్య క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ మాత మరీచి మరియు వజ్ర వారాహి విగ్రహాలు. ఇది ఒక హిందువుల దేవాలయం గా కూడా పేరు పడింది.

కీలాంగ్ - బౌద్ధ ఆరామాల భూమి !

గేమూర్ మొనాస్టరీ ఆలయం

Photo Courtesy: John Hill

గురు ఘంతాల్ మొనాస్టరీ

గురు ఘంతాల్ మొనాస్టరీని గందోలా మొనాస్టరీ అని కూడా పెర్కొంటారు. సైట్ సీియింగ్ ఆధ్యాత్మిక కేంద్రం. ఇది కీలాంగ్ కు సుమారు 8 కి.మీ. ల దూరంలో కలదు. ఈ మొనాస్టరీ ప్రధాన ఆకర్షణ దాని విగ్రహాలు కొయ్యతో చేయబడి వుండటం. ఈ మొనాస్టరీ లో ఒక వినూత్న శైలి కల పిరమిడ్ ఆకారంలోని పై భాగాలు చూడవచ్చు. అందమైన చెక్కడాలు కలిగి వుంటాయి. ఈ మొనాస్టరీ శిధిలావస్థలో వున్న కారణంగా, ఇక్కడి విగ్రహాలను సమీపంలోని తుప్చిల్లింగ్ విలేజ్ కు తరలించారు. చంద్ర మరియు భాగ నది ఒడ్డున కల ఈ ఆరామం లో మీరు ఒక శిధిలమైన అందమైన ఆవ లోకితేస్వర అనబడే బోధిసత్వుడి మార్బుల్ విగ్రహం చూడవచ్చు. ఈ మొనాస్టరీలోని ఒక ప్రైవేట్ హాలులో హిందూ దేవత కాళికా మాత విగ్రహం కూడా చూడవచ్చు.

కార్దంగ్ మొనాస్టరీ

కార్దంగ్ మొనాస్టరీ అతి పురాతన ఆరామం. ఇది కీలాంగ్ కు 5 కి. మీ. ల దూరంలో కలదు. ఇది సుమారు 900 సంవత్సరాల నాటిది. 12 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆరామంలో ఒక పురాతన లైబ్రరీ కలదు. ఈ బౌద్ధ లైబ్రరీ దేశంలోనే అతి పురాతనమైనది. ఈ లైబ్రరీ లో షేర్పా భాషలో వ్రాశిన కొన్ని తాళపత్ర గ్రంధాలు కలవు. ఇంకనూ కొన్ని సంగీత సాధనాలు, పురాతన అయుధాలు కూడా చూడవచ్చు. దీనిని 1912 లో లామా నోర్బు రిన్ పోచె పునర్మించారు. లామా నోర్బు యొక్క పుర్రె మరియు అస్థికలు ఇక్కడ భద్ర పరచారు.

కీలాంగ్ - బౌద్ధ ఆరామాల భూమి !

కార్దంగ్ మొనాస్టరీ ఆలయం

శాసూర్ మొనాస్టరీ

శాసూర్ మొనాస్టరీ హిమాచల్ ప్రదేశ్ లోని కీ లాంగ్ నుండి 3 కి. మీ. ల దూరంలో కలదు. స్థానిక భాషలో శాసూర్ అంటే నీలి రంగు పైన్ వృక్షం అని అర్ధం. దీని చుట్టూ పైన్ అడవులు కలవు. మొనాస్టరీ లో అనేక అందమైన పెయింటింగ్ లు కలవు. వాటిలో కొన్ని 15 అడుగుల ఎత్తు వరకూ కలవు. వాల్ పెయింటింగ్ లలో 84 బుద్ధ భంగిమలు చూడవచ్చు. జూన్ లేదా జూలై నెలలో 'చాం' అనే ఒక వార్షిక ఉత్సవం ఈ మొనాస్టరీ లో నిర్వహిస్తారు.

తాయూల్ మొనాస్టరీ

తాయూల్ మొనాస్టరీ కీలాంగ్ కు 6 కి. మీ. ల దూరంలో కలదు. ఇది ఒక ప్రసిద్ధ యాత్రా స్థలం. టిబెట్ భాషలో తాయూల్ అంటే 'ఎంపిక చేయబడిన ప్రదేశం' అని చెపుతారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తైన అందమైన గురు పద్మసంభవ విగ్రహం దానితోపాటు సింహ ముఖం, ఒక వజ్ర వాహనం కలవు. ఈ ఆరామంలో కల వంద మిలియన్ ల మణి చక్రం ఒక ప్రధాన ఆకర్షణ. దీనిని కొన్ని ప్రత్యేక సందర్భాలలో తిప్పుతారు. తాయూల్ ఆరామ లామాల మేరకు ఈ చక్రం చివరి సారిగా 1986 లో తిప్పబడింది.

కీలాంగ్ ఎలా చేరాలి ?

ఎయిర్ పోర్ట్

కీలాంగ్ కు భున్తాల్ విమానాశ్రయం సమీపంలో కలదు. సుమారు 168 కి. మీ. ల దూరంలో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ, ముంబై, శ్రీ నగర్ లకు విమాన సేవలు కలవు.

ట్రైన్ ప్రయాణం

కీలాంగ్ కు జోగిందర్ నగర్ రైలు స్టేషన్ సమీపంలో కలదు. దీని దూరం సుమారు 280 కి.మీ. లు. ఇక్కడ నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు కలవు.

రోడ్డు ప్రయాణం

మనాలి నుండి కీలాంగ్ కు అనేక ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సు లు కలవు. వీటి మధ్య దూరం 115 కి.మీ. లు మాత్రమే.

కీలాంగ్ - బౌద్ధ ఆరామాల భూమి !

కీలాంగ్ బస్ స్టాండ్

Photo Courtesy: Robin Browne

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+