Search
  • Follow NativePlanet
Share
» »కొక్కెరే బెల్లూర్ బర్డ్ సాంక్చూరి, బెంగళూరు !!

కొక్కెరే బెల్లూర్ బర్డ్ సాంక్చూరి, బెంగళూరు !!

ఈ పక్షి ఆభయారణ్యం సందర్శనకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహ పడుతూంటారు. వివిధ రకాల పక్షులని చూసి ఆనందిస్తారు. ఈ అభయారణ్యంలో నడుస్తూ పక్షుల కిలకిలారావాలను విని ఆనందిస్తారు.

By Mohammad

కొక్కెరే బెల్లూర్ బెంగళూరు మరియు మైసూర్ జాతీయ రహదారిపై కలదు. ఇక్కడ పక్షులు చేసే కిలకిలారావాలు, ఆహ్లాదపరించే వాతావరణం, మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సౌందర్యాలు సందడి చేస్తాయి. బెంగళూరు - మైసూరు వెళ్ళే ప్రతి పర్యాటకుడు ఈ పక్షి అభయారణ్యంను సందర్శిస్తారు. మనిషికి - ప్రకృతికి మధ్య వారధిలా ఉంటుంది ఈ ప్రదేశం. ఇది బెంగళూరు కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కొక్కెరే బెల్లూర్ బోర్డు కనిపిస్తే అటువైపు తిరిగి 12 కిలోమీటర్లు నేషనల్ హైవే నుండి లోపలి వెళితే ఈ గ్రామము కనిపిస్తుంది.

కొక్కెరే బెల్లూర్ అడవి ప్రాంతం కాదు. ఇది మాండ్యా జిల్లాలో మద్దూర్ తాలూకాలో ఉన్నది. కన్నడలో కొక్కెరే అంటే కొంగ లేదా పెలికాన్ అని, బెల్లూర్ అంటే తెలుపు గ్రామము. శింశ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామములో నీళ్ళు తాగటానికి వచ్చే పక్షులు చూస్తూ అందించవచ్చు.

కొక్కెరే బెల్లూర్ బర్డ్ సాంక్చూరి

చిత్రకృప : Koshy Koshy

ఈ పక్షి ఆభయారణ్యం సందర్శనకు ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహ పడుతూంటారు. వివిధ రకాల పక్షులని చూసి ఆనందిస్తారు. ఈ అభయారణ్యంలో నడుస్తూ పక్షుల కిలకిలారావాలను విని ఆనందిస్తారు. ఈ అభయారణ్యాలు వాటికి సురక్ష్టిత నివాస స్థానాలు. కనుక మనం వీటిని నియమిత గంటల కాలంలోనే చూడాలి. అక్కడ మీరు చెల్లించే ప్రవేశ రుసుము ఎంతో తక్కువ కాని వాటి సాంగత్యం లో మీరు ఏంటో ఆనందం పొందుతారు.

ఈ రకంగా పక్షులు మనుషులతో ఎంతో సన్నిహితంగా మెలిగే అందమైన ప్రదేశాలలో కొక్కేబెల్లూర్ ప్రదేశం ఒకటి. ఈ చిన్న గ్రామం మండ్య జిల్లాలో బెంగుళూరు మైసూరు రహదారిలో కలదు. ప్రశాంత వాతావరణం మరియు పక్షి సందర్సన కోరుకునే వారికీ ఇది ఎంతో చక్కని ప్రదేశం.

కొక్కెరే బెల్లూర్ బర్డ్ సాంక్చూరి

చిత్రకృప : Slimguy

అన్ని పక్షి అభయారణ్యంలవలె కాక ఈ ప్రదేశం ఒక చిన్న గ్రామంగా వుంటుంది. ఇక్కడ పెలికాన్లు వాటి నివాసం ఏర్పరచుకున్నవి. ఈ గ్రామంలోని నివాసితులు వాటిని ఎంతో జాగ్రత్తగ చూచుకుంటారు. అవి వారి చర్యలకు ప్రతిస్పందనను అందిస్తాయి. ఈ పెలికాన్లని కన్నడ భాషలో కొక్కేరాలు అంటారు. కనుక, వాటి పేరుపై ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది.

సరైన సమయంలో కనుక మీరు అక్కడ ఉంటె వాటిని గుంపులుగా చూచి మీరు ఆనందిస్తారు. కొక్కేరే బెల్లురు సందర్శనకు నవంబర్ నుండి జూన్ వరకు బాగుంటుంది. ఈ సమయంలో సుమారు 1000 పెలికాన్ల నుండి 2500 వరకు చూడవచ్చు.

కొక్కెరే బెల్లూర్ బర్డ్ సాంక్చూరి

చిత్రకృప : Ashwin06k

ఈ ప్రదేశం పర్యాటక ప్రదేశం కాక పోయినప్పటికీ పర్యాటకులు ఫిబ్రవరి , మార్చి నెలలలో అధికంగా వస్తారు. పక్షులకు, మనుషులకు ఇక్కడ మంచి సాంగత్యం ఉండటంతో ఇక్కడి నివాసితులు వాటికి చక్కని ఆహరాలనందిస్తూ వారి గ్రామానికి అవి గర్వకారణంగా భావిస్తారు.

ఒక పక్షి సందర్సకుని మాటలు పరిశీలిస్తే " ఈ గ్రామాన్ని నేను సుమారు 1994 నుండి పరిశీలిస్తున్నాను. ఇక్కడ వీటికి చక్కని సంరక్షణ లభిస్తోంది. ఈ గ్రామం గతంలో కంటే దేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచింది. అయితే మా భయమల్లా సందర్శకులనుండే. వాటికి కొన్నిమార్లు ఎంతో హాని తలపెడతారు. దానితో అవి అక్కడనుండి వేరే ప్రదేశాలకు ఎగిరి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. వాటి గుడ్లు వేరే పక్షులు ఎగరేసుకు పోయే ప్రదం కూడా ఉంది."

ఇది కూడా చదవండి : బెంగళూరు లో ఈ ఐదు ప్రదేశాలను చూశారా ?

ఇక్కడ పెలికాన్లు మాత్రమే కాక అనేక ఇతర పక్షులు కూడా సీజన్ వచ్చేసరికి ఇక్కడకు వచ్చేస్తాయి.

కొక్కెరే బెల్లూర్ బర్డ్ సాంక్చూరి

చిత్రకృప : Sachin Nigam

కొక్కెరే బెల్లూర్ ఎలా చేరుకోవాలి ?

బస్సు మార్గం

కొక్కేరే బెల్లూర్ రోడ్ మార్గంలో తేలికగా చేరవచ్చు. బెంగుళూరు నుండి సుమారు 83 కి.మీ. దూరంలో కలదు. బెంగుళూరు - మైసూరు రహదారిలో ఒక వైపుకు తిరిగి నేరుగా కొక్కేరే బెల్లురు కు చేరవచ్చు.

రైలు మార్గం

కొక్కేరే బెల్లురు కు సమీప రైలు స్టేషన్ మద్దూరులో కలదు. మండ్య రైలు స్టేషన్ కూడా సమీపమే. ఇవి మైసూరు బెంగుళూరు రైలు మార్గంలో కలవు.

విమాన మార్గం

కొక్కెరే బెల్లురు చేరేటందుకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయము అనుకూలం. సమీప విమానాశ్రయం అంటే మైసూరు స్థానిక విమానాశ్రయం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+