Search
  • Follow NativePlanet
Share
» »కుల ధారా : పాడు పడ్డ దెయ్యాల గ్రామం!

కుల ధారా : పాడు పడ్డ దెయ్యాల గ్రామం!

రాజస్తాన్ లోని జైసల్మేర్ కు పడమటి దిశగా 15 కి. మీ. ల దూరంలో కుల ధారా అనే గ్రామం కలదు. నేడు అది పూర్తిగా పాడుబడి శిదిలాలుగా మారింది. రాజస్తాన్ లోని ఇతర గ్రామాల వలెనె, ఈ గ్రామం కూడా ఒకప్పుడు చక్కని ప్రణాళిక బద్ధంగా అందమైన నివాస భవనాలతో ఏర్పడింది. గ్రామంలోని నివాసులందరూ పాలివాల్ బ్రాహ్మణులు. కులదారా చుట్టూ సుమారు 83 గ్రామాలు కూడా కలవు. ఒక రాత్రి, అకస్మాత్తుగా గ్రామం లోని ప్రజలందరూ మాయం అయ్యారు. కారణం ఎవరికీ తెలియదు. ఈ బ్రాహ్మణ తెగ ప్రజలు గ్రామంలో సుమారు ఏడు వందల సంవత్సరాలనుండి అక్కడ నివసిస్తున్నట్లు చరిత్ర చెపుతోంది.

వారంతా అకస్మాత్తుగా అలా గ్రామం వదిలి ఎందుకు వెళ్లి పోయారు ? అనేదానికి నేటికీ సమాధానం లేదు. స్థానికులు చెప్పే ఒక కధనం మేరకు ఆ ప్రాంత పాలకుడు, కులదారా ముఖ్యుడి కుమార్తెను బలవంతంగా వివాహం చేసుకో నిస్చయిన్చాడని, ఆ రాజు తీసుకున్న నిర్ణయం గ్రామంలో నివసించే బ్రాహ్మణ సమాజ కుల గౌరవానికి, సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండటంతో, రాజును ఎదిరించే ధైర్యం లేక, వారంతా రాత్రికి రాత్రే తమ కుటుంబాలతో గ్రామాన్ని వీడి, ఇకపై ఆ గ్రామం పాడుబడుగాక, ఇక్కడ దెయ్యములు నివసించు గాక అని శపించి 83 గ్రామాల ముఖ్యులూ తమ నివాసాలు ఖాళీ చేసే వెళ్లి పోయారని చెపుతారు. ఎక్కడకు వెళ్ళారు ? ఒక్క రాత్రిలో ఊరు ఎలా ఖాళీ చేసారు అనే దానిపై ఏ సమాచారం నేటికీ లేదు. కాని ఒకే రాత్రిలో ఊరంతా ఖాళీ అయిపాయింది.

 https://www.nativeplanet.com/travel-guide/kuldhara-ghostly-forsaken-village-000392.html

Photo Courtesy: Nevil Zaveri

స్థానికుల మరో కధనం మేరకు, నిరంకుశుడైన రాజు అతి ఆశగా, గ్రామాలపై అధిక పన్నులు విధించాడని, ఆ పన్నుల భారం, కట్టకపోతే, రాజు వారిపై చేసే నిరంకుశ చర్యలు భరించలేని ప్రజలు ఈ గ్రామాల ముఖ్యులు తో సహా తెలివిగా ఊరు ఖాళీ చేసి వెళ్ళారని కూడా చెపుతారు.

ఇంతే కాక, అప్పటి రాజకీయ అస్థిరత కారణంగా కూడా ఊరు ఖాళీ అయ్యిందని కూడా కొంత మంది చెపుతారు వీరి కధనం మేరకు ఒక మొగల్ రాజు జైసల్మేర్ నగరాన్ని వశం చేసుకోవాలనే నెపంతో నగర తాగు నీటి చెరువులలో , బావులలో విషం కలపటం, చెరువులలో జంతువుల కళేబరాలు వేయటం వంటివి చేసినందున, ఈ దుష్కార్యాలు భరించ లేక కుల ధారా నుండి బ్రాహ్మణులు వలస పోయారని కూడా చెపుతారు. ఏది ఏమైనప్పటికీ, గ్రామస్తులు గ్రామం ఖాళీ చేయటం మినహా మరో మార్గం లేక పోయింది. అయితే, వారు ఎక్కడకు వలస వెళ్ళారనేది అంతు పట్టని విషయంగా మారింది. ఈ సంఘటన తర్వాత పాలివాల్ బ్రాహ్మణులు రెండు గ్రూపులు గా చీలి పోయారని కూడా చెపుతారు.

కుల ధారా : పాడు పడ్డ దెయ్యాల గ్రామం!

Photo Courtesy: timeflicks

ఇపుడు ఈ దెయ్యాల పట్టణం ఒక మంచి డిమాండ్ కల టూరిస్ట్ ప్రదేశం. నమ్మితే ఇప్పటికీ ఇక్కడ కొన్ని దెయ్యపు చేష్టలు కనపడతాయి. మీరు జైసల్మేర్ వెళ్ళినపుడు, ఈ గ్రామ శిధిలాలు దర్శించండి. ఈ గ్రామం, దాని నేపధ్యంలో కల ఎడారి ప్రదేశం అనేక సినిమా డైరెక్టర్ లను కూడా ఆకర్షించింది. ఇటీవలి కాలంలో హిందీ సినీ నటుడు సైఫ్ ఆలి ఖాన్ తన 'ఏజెంట్ వినోద్' చిత్రాన్ని ఇక్కడ షూట్ చేసాడు. మరి ఇంత ప్రాముఖ్యత కల ఈ ఘోస్ట్ టవున్ లేదా దెయ్యాల నగరం పర్యటనకు మీరు కనీసం కొద్ది గంటలు కేటాయిన్చాల్సిందే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+