Search
  • Follow NativePlanet
Share
» »కుమటా కోస్తా తీరం - మరువలేని అనుభూతి !

కుమటా కోస్తా తీరం - మరువలేని అనుభూతి !

By Mohammad

అద్భుత సీనరీలు, ఆసక్తిని కలిగించే చారిత్రక కట్టడాలు, సాంప్రదాయ సంస్కృతులు గల కుమటా ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. ఈ ప్రాంత సందర్శన ప్రతి ఒక్కరికీ మరువలేని అనుభూతి కాగలదు. కుమటా సమీప పట్టణాలుగా గోకర్ణ (32 కి. మీ ), మురుడేశ్వర్ ( 46 కి. మీ), భట్కల్ (56 కి. మీ) లు కలవు. బెంగళూరు నుండి 468 కి. మీ ల దూరంలో, ఉడిపి నుండి 146 కి. మీ ల దూరంలో మరియు మంగళూరు నుండి 199 కి. మీ ల దూరంలో కుమటా ప్రదేశం ఉన్నది. ఇది కర్నాటక తీర ప్రాంతం.

కుమటా అనే చిన్న పట్టణం లో చెయ్యాలన్నా, చూడాలన్నా చాలానే ఉన్నాయి. ఇక్కడి రాతి నిర్మాణాలు, బీచ్ లు, అఘనాశిని నది అరేబియా సముద్రంలో కలిసే దృశ్యాలు తీరం వెంబడి ఉన్నాయి. సాహస యాత్రలు చేయాలనుకొనేవారికి కుమటా సూచించదగిన ప్రదేశమే ..! పర్వతారోహకులు ఇక్కడున్న కొండ పై ఎక్కవచ్చు, దిగవచ్చు.

కుమటా బీచ్

కుమటా బీచ్

చిత్ర కృప : Phaneesh N

ఆధ్యాత్మిక భావనలు కోరుకొనే వారికి సైతం కుమటా లోని దేవాలయాలు దర్శనీయ స్థలాలుగా ఉన్నాయి. శ్రీ కుంభేశ్వర, శంకర నారాయణ మరియు శాంతిక పరమేశ్వరి దేవాలయాలు ప్ర్రాచీన శిల్ప కళా ఆకృతులకు నిలయంగా చెప్పవచ్చు.

ఇది కూడా చదవండి : యానా - శివభగవానుడు తల దాచుకున్న ప్రదేశం !

మహాలస దేవాలయం

మహాలస దేవాలయాన్నే శ్రీ మహాలస మహారాణి దేవాలయం అని కూడా పిలుస్థారు. క్రీ.శ. 1565 వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం వెనక ప్రాచీన చరిత్ర దాగి ఉన్నది. గోవా లోని వెర్నా నుండి కాంస్య విగ్రహాన్ని మోసుకవచ్చిన గౌరవ్ పేరు మీద అర్చకులు నిర్మించారు. ఈ మహాలస విగ్రహాన్ని అక్కడి నుండి ఒక మట్టి కుండలో పెట్టుకొని తీసుకొని వచ్చారని కథనం.

గణపతి దేవాలయం, కుమటా

గణపతి దేవాలయం, కుమటా

చిత్ర కృప : Raghavendra Hegde

ఆలయ నిర్మాణం, సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. రామాయణం, మాహాభారత కధలు సైతం ఆలయ గోడలపై అందంగా చెక్కినారు. ఈ ఆలయం వద్ద అనేక పండుగలు జరుపుకుంటారు. ప్రతి ఏటా మర్చి - ఏప్రియల్ నెలలో జరిగే ఆలయ వార్షిక వేడుకలకు చుట్టుపక్క గ్రామాల నుండి భక్తులు తరలివస్తారు. మీకు సమయం ఉంటె వెంకట రమణ దేవాలయాన్ని, ఉప్పిన్ గణపతి దేవాలయాన్ని కూడా తప్పక సందర్శించండి.

మిర్జన్ ఫోర్ట్

సుమారు 4. 1 హెక్టార్ల విస్తీర్ణం లో నిర్మించిన మిర్జన్ ఫోర్ట్ ఎత్తైన బురుజులు, చక్కని శిల్ప కళా చాతుర్యం తో పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఈ కోట ఒకప్పుడు అనేక యుద్దాలను చూసిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ కోట నిర్మాణానికి లాటరైట్ రాళ్ళను ఉపయోగించారు.

మిర్జన్ ఫోర్ట్, కుమటా

మిర్జన్ ఫోర్ట్, కుమటా

చిత్ర కృప : Sydzo

ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యం లో ఉన్న మిర్జన్ కోట ప్రవేశ ద్వారాలు, దర్బార్ హాళ్ళు, రహస్య మార్గాలు, మార్కెట్ ప్రదేశాలు మొదలైనవి చూడదగ్గవి. కోట లోపల హిందూ దేవతలు ప్రతిమలు, రాజుల కాలం నాటి నాణేలు, మట్టి కుండలు, యుద్ధ సామాగ్రి వంటివి ఎన్నో చూడవచ్చు.

కుమటా బీచ్

కుమటా లో అదే పేరుతో గల బీచ్, దారేశ్వర్ బీచ్, బడా బీచ్ లు అనే 3 బీచ్ లు కలవు. కుమటా బీచ్ తీరం వెంబడి రాతి నిర్మాణాలు, అఘనాషిని నది సముద్రంలో కలిసే దృశ్యాలను తిలకించవచ్చు.

దారేశ్వర్ బీచ్ సూర్యాస్తమ దృశ్యాలు

దారేశ్వర్ బీచ్ సూర్యాస్తమ దృశ్యాలు

చిత్ర కృప : Manfred Sommer

దారేశ్వర్ బీచ్ కుమటా కు 5 కి. మీ ల దూరంలో ఉన్నది. ఇక్కడ అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమాలు పర్యాటకులు చూడవలసిందే. పొడవైన ఈ బీచ్ లో కాలినడకన నడుస్తూ ఒకవైపు అరేబియా సముద్రాన్ని, ఎదురుగా లైట్ హౌస్ ను మరోపక్క కొబ్బరిచెట్లు , వరి పంట పొలాలు చూడవచ్చు. బడా బీచ్ పరిశుభ్రంగా ఉండి, కిర్కి నుండి గోకర్ణ వెళ్ళే మార్గంలో ఉన్నది. ఈ బీచ్ లో రాతి ప్రదేశాలు, కొండలను గమనించవచ్చు.

కుమటా ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

కుమటా కు సమీపాన గోవాలోని డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం (168 కి. మీ ల దూరంలో) కలదు. దేశ విదేశాల నుండి ఈ ఎయిర్ పోర్ట్ కు విమానాలు వస్తుంటాయి. టాక్సీ లేదా క్యాబ్ లలో ప్రయాణించి కుమటా చేరుకోవచ్చు.

రైలు మార్గం

కుమటా లో రైల్వే స్టేషన్ కలదు. ఇది పట్టణం నుండి 2 కి. మీ ల దూరంలో ఉన్నది. ముంబై, గోవా, మంగళూరు, ఉడిపి తదితర ప్రాంతాల నుండి స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి.

కుమటా రైల్వే స్టేషన్

కుమటా రైల్వే స్టేషన్

చిత్ర కృప : Pankaj and Alpana Prabhu

బస్సు / రోడ్డు మార్గం

సిర్సి, కార్వార్, ఉడిపి మరియు షిమోగా నుండి కుమటా కు లగ్జరీ, డీలక్స్, సెమి డీలక్స్ బస్సులు తరచూ నడుస్తుంటాయి. బెంగళూరు నుండి ప్రతి రోజు రాత్రి కుమటా కు ఏసీ బస్సు సర్వీసు ఉన్నది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+