Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరులో మోస్ట్ పవర్ ఫుల్ దేవుడు !!

బెంగళూరులో మోస్ట్ పవర్ ఫుల్ దేవుడు !!

గాలి ఆంజనేయస్వామి దేవాలయం క్రీ.శ. 1425 లో కట్టించారు. ఎవరు కట్టించారో తెలీదు కానీ దాదాపు 600 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది.

By Mohammad

బెంగళూరు లో నివసించే చాలా మంది నివాసితులు వీకెండ్ లో ఎక్కడికైనా వెళ్ళి తిరిగిరావాలనుకుంటుంటారు !! అందులో తప్పేమీ లేదు. అందుకోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తుంటారు. అంతదూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా కాలక్షేపానికి, ఆధ్యాత్మికానికి తగిన ప్రదేశం బెంగళూరులో ఓచోట ఉంది. అదే కే ఆర్ మార్కెట్. బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నవారికి కూడా ఈ మార్కెట్ గురించి తెలిసే ఉంటుంది.

బెంగళూరు మధ్యలో కిక్కిరిసి ఉండే కే ఆర్ మార్కెట్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ హనుమాన్ దేవాలయం కలదు. మైసూర్ రోడ్ కు - బ్యాతరాయణపుర కు మధ్యలో ఈ గుడి కలదు. ఈ టెంపుల్ ఇక్కడ 'గాలి ఆంజనేయస్వామి దేవాలయం' గా ప్రసిద్ధికెక్కింది.

గుడి గోపురం

గుడి గోపురం

ప్రసిద్ధ హిందూ సన్యాసి వ్యాస రాజ లార్డ్ హనుమాన్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించాడు. అయిన చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ప్రతిష్టించబడిన 732 హనుమాన్ విగ్రహాలలో ఒకటి గాలి ఆంజనేయ విగ్రహం ఉన్నది. ఆ విగ్రహాన్ని దర్శించుకోవటానికి బెంగళూరు నలుమూలల నుండి, చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు వస్తుంటారు .. భగవంతుని ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఆంజనేయుడు వాయు పుత్రుడు కనుక ఆయనను గాలి ఆంజనేయస్వామి గా భక్తులు పూజిస్తారు.

గాలి ఆంజనేయస్వామి దేవాలయం

గాలి ఆంజనేయస్వామి దేవాలయం క్రీ.శ. 1425 లో కట్టించారు. ఎవరు కట్టించారో తెలీదు కానీ దాదాపు 600 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. పురాణాల కధనం మేరకు వ్యాస రాజ మహర్షి వ్రిషభావతి మరియు పశ్చిమావతి నదుల సంగమ ప్రదేశంలో విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చెబుతారు.

గుడి ప్రవేశం

గుడి ప్రవేశం

గాలి ఆంజనేయస్వామి గుడి గోపురం ఎత్తుగా ఉంటుంది మరియు దేవుడు పశ్చిమం వైపు ముఖం చేసి ఉంటాడు. భగవంతుని ఎదుట ఎల్లప్పుడూ పవిత్ర కుంకుమ ఉంటుంది. అలాగే వచ్చిపోయే భక్తులకు పవిత్ర దారాలను ప్రసాదంగా అందిస్తుంటారు ఇక్కడి పూజారులు. భగవంతుడు మీసాలను కలిగి ఉండి సాధారణ మానవుల రూపంలో కనిపిస్తాడు. కుడి చేత్తో భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తుంటాడు స్వామి.

గర్భగుడిలో గాలి ఆంజనేయస్వామి

గర్భగుడిలో గాలి ఆంజనేయస్వామి

చిత్రకృప : Kiran Gowda

ఎప్పుడు సందర్శించాలి ?

శనివారం పూట భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలో గుడిలోకి వెళ్ళటం కాస్త కష్టమే. తోపులాట ఉండవచ్చు. కనుక భక్తులు శనివారం మినహా మిగితా అన్ని రోజులలో ఆలయాన్ని దర్శించుకోవచ్చు. వారంలో ప్రతిరోజూ గుడి తలుపులు తెరిచే ఉంచుతారు. భక్తులకు ప్రసాదంగా ఇచ్చే పవిత్ర దారం సమస్యల బారి నుండి, సర్వరోగాల బారి నుండి విముక్తి కలిగిస్తుందని నమ్మకం.

గుడి టైమింగ్స్ :

గుడిని ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు మరియు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల సందర్శనార్థం తెరిచే ఉంచుతారు.

సంబరాలు

గాలి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఉత్సవాలను జరుపుతారు. ఈ ఆచారం 120 సంవత్సరాల నుంచి ఉన్నదని ... అప్పటి నుండి ఉత్సవాలు సీజన్ లో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారని దేవాలయ నిర్వాహకులు చెబుతున్నారు.

గాలి ఆంజనేయస్వామి దేవాలయం

చిత్రకృప : Steve Browne & John Verkleir

మరికొన్ని దేవాలయాలు

గాలి ఆంజనేయస్వామి గుడి ప్రాంగణం పెద్దది. ప్రాంగణంలో వేణుగోపాలస్వామి, రామ, గణపతి మరియు నవగ్రహ ఆలయాలు ఉన్నాయి.

రాజకీయ నాయకులు ఎలెక్షన్ టైం లో గుడిని దర్శిస్తుంటారు. ఇప్పటివరకు ఈ గుడిని దర్శించిన రాజకీయ ప్రముఖులు ఉన్నత పదవులను అలంకరించిన వారే. అనారోగ్యాల బారిన పడిన చిన్నారులకు కూడా ఈ దేవుడు శక్తివంతుడే.

గాలి ఆంజనేయస్వామి దేవాలయం

చిత్రకృప : Nvvchar

ఇంకెందుకు వేచి చూడడం?? ఈ వారాంతంలో బెంగళూరు నడిబొడ్డున ఉన్న గాలి ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించండి ... తరించండి. ఆయన ఆశీర్వాదాలతో శక్తిని పొంది విజయాలను సొంతం చేసుకోండి. ఉదయం గుడికి వెళితే, మధ్యాహ్నం కే ఆర్ మార్కెట్ లో షాపింగ్ చేయండి. సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వచ్చేయొచ్చు. సో .. బెంగళూరులో వన్ డే ట్రిప్ తక్కువ బడ్జెట్ లో ముగిసిందని ఆనందించవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+