Search
  • Follow NativePlanet
Share
» »బ్రిటీష్ వారు తమ దేశానికి తరలించాలనుకొన్న దేవాలయం అయితే...

బ్రిటీష్ వారు తమ దేశానికి తరలించాలనుకొన్న దేవాలయం అయితే...

వేలూరులోని జలకంటేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం.

భారత దేశం ఆలయాల నిలయం. కొన్ని ఆలయాలు పురాణ, చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంటే మరికొన్ని ఆలయాలు అందులోని శిల్ప సంపద వల్ల ప్రపంచ వ్యాప్తంగా పేరుగడించాయి. అటువంటి కోవకు చెందినదే తమిళనాడులోని ఒక దేవాలయం.

ఈ దేవాలయంలోని శిల్ప సంపదకు ముచ్చటపడిన అప్పటి బ్రిటీష్ పాలకులు మొత్తం దేవాలయాన్ని చిన్నిచిన్న భాగాలుగా చేసి లండన్ తరలించాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేక ఓడను కూడా సిద్ధం చేసుకొన్నారు. అయితే ఆ దేవుడి దయవల్ల బ్రిటీష్ వారి పై ప్రకతి కన్నెర్ర చేసింది.

దీంతో ఆలయం మన దేశంలోనే నిలిచిపోయింది. దీంతో ఆ శిల్ప సంపదను చూడటానికి వివిద దేశాల నుంచి పర్యాటకులు మన దేశానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ వారిని అంతగా ఆకర్షించిన ఆ ఆలయంలో విశిష్టతల సమహార కథనం మీ కోసం

శిల్ప సంపద లేదని ఆలయం లేదు

శిల్ప సంపద లేదని ఆలయం లేదు

P.C: You Tube

దక్షిణ భారత దేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదంటే అతిశయోక్తి లేదు. చాలా గుడిని ఎవరు కట్టించారన్నప్రశ్న పూర్తి కాకుండానే శ్రీ క`ష్ణ దేవాలయల కాలంలో ఆ ఆలయాన్ని కట్టించారన్న సమాధానం వస్తుంది.

కళ్యాణ మంటపాలు

కళ్యాణ మంటపాలు

P.C: You Tube

విజయ నగర రాజులు నిర్మించిన దేవాలయాల్లో శిల్ప కళ చాలా ఉన్నతంగా ఉంటుంది. ముఖ్యంగా దేవాలయాల్లోని కళ్యాణ మంటపాల శిల్ప సౌదర్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే. అటు వంటి అద్భుత కళామంటపాలు ఉన్న దేవాలయాల్లో హంపిలోని విఠలాలయంలో ఉంది.

 కోటలోని జలకంఠేశ్వరాలయం

కోటలోని జలకంఠేశ్వరాలయం

P.C: You Tube

అదే విధంగా మధురై లోని వేయి స్తంభాల గుడి, తిరునల్వేలిలోని దేవాలయం వెంటనే గుర్తుకు వస్తాయి. అదే కోవకు చెందినది తమిళనాడులోని కోయంబత్తూరు దగ్గర ఉన్న రాయ వేలూరు కోటలోని జలకంఠేశ్వరాలయం భారత దేశంలో అత్యంత పురాతనమైన ఆలయాల్లో ఒకటి.

సదాశివరాయల కాలంలో

సదాశివరాయల కాలంలో

P.C: You Tube

ఈ దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన సదాశివరాయల కాలంలో నిర్మించాడు. ఈ కళ్యాణ మండపం ఆలయ ప్రధాన గోపురానికి పక్కనే ఉన్న ఉంది. మొత్తం మూడు భాగాలుగా ఉన్న ఆ కళ్యాణ మంటపంలో మొత్తం 46 స్తంబాలు ఉన్నాయి.

అష్ట దిక్పాలకుల చిత్రాలు

అష్ట దిక్పాలకుల చిత్రాలు

P.C: You Tube

ఈ స్తంభాల పై అష్ట దిక్పాలకుల చిత్రాలు, వినాయకుడు, విష్ణు, బ్రహ్మ భూ దేవి, శ్రీ దేవి, సరస్వతి, పార్వతి మొదలైన శిల్పాలను అత్యంతా మనోహరంగా చెక్కబడ్డాయి. ఇవే కాక నాట్యకళాకారులు, సంగీత కళాకారుల చిత్రాలు కూడా చూడవచ్చు.

శిల్పకళా వైచిత్రికి

శిల్పకళా వైచిత్రికి

P.C: You Tube

అదే విధంగా ప్రతి స్తంభం మీద మన పురాణాల్లోని ఏదో ఒక ఘట్టాన్ని అత్యంత రమణీయమైన శిల్పాల రూపంలో చెక్కిన తీరు అమోఘం. ఈ ఆలయంలోని ఒక శిల్పం శిల్పకాళా వైచిత్రికి నిదర్శనం.

అలాంటి శిల్పమే

అలాంటి శిల్పమే

P.C: You Tube

ఒకే విగ్రహంలో ఒక ఎద్దు, ఒక ఏనుగు ఉంటుంది. ఈ రెండింటి తల ఒక్కటే. ఎద్దు శరీరాన్ని మూసి చూస్తే ఏనుగు కనిపిస్తుంది. అదే విధంగా ఏనుగు శరీరాన్ని మూసి చూస్తే ఎద్దు ఆకారం కనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలనే మనం హంపిలోని అచ్యుత రామాలయం, హజరా రామాలయంలో కూడా చూడవచ్చు.

ముస్లీం పాలకుల చేతుల్లోకి

ముస్లీం పాలకుల చేతుల్లోకి

P.C: You Tube

విజయనగర పతనం తర్వాత ఈ కోట, అందులోని ఆలయాలు ముస్లీం పాలకుల చేతుల్లోకి పోయింది. అలా జలకంఠేశ్వర ఆలయం కూడా వెల్లూరు కోట ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఆర్కాడు నవాబు చేతుల్లోకి పోయింది.

మసీదును నిర్మించారు.

మసీదును నిర్మించారు.

P.C: You Tube

ఆ సమయంలో దేవాలయంలోని అనేక శిల్పాలను ధ్వంసం చేసి దేవాలయం ఆవరణలో ఉన్న ఒక తాటాకంలోకి వేశారు. ఇప్పటికీ ఈ తటాకంలో ఆ శిల్పాలు దొరుకుతుంటాయి. అంతేకాకుండా కోట లోపల ఆలయానికి సమీపంలో మసీదులను కూడా నిర్మించారు.

బ్రిటీష్ పాలకులు

బ్రిటీష్ పాలకులు

P.C: You Tube

ఇక ముస్లీం పాలకుల తర్వాత ఈ దేవాలయం బ్రిటీషఉ వారి చేతుల్లోకి పోయింది. ఈ శిల్పసంపదను చూసి ముచ్చటపడిన అప్పటి బ్రిటీష్ వారు ఈ దేవాలయం మొత్తాన్ని తమ దేశానికి తరలించాలని భావించరు.

లండన్ లో తిరిగి

లండన్ లో తిరిగి

P.C: You Tube

ఇందు కోసం ప్రతి స్తంభాన్ని జాగ్రత్తగా విడిదీసి తిరిగి లండన్ లో పున: ప్రతిష్టింపజేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగా విడదీసిన రాతి స్తంభాలను ప్రత్యేకంగా ప్యాక్ చేయడానికి చెక్క పెట్టలు సిద్ధం చేసుకొన్నారు.

ప్రత్యేక ఓడను

ప్రత్యేక ఓడను

P.C: You Tube

అటు పై ఈ రాతి మంటపాన్ని లండన్ తరలించడానికి వీలుగా లండన్ నుంచి ఒక ఓడను భారత దేశానికి రప్పించసాగారు. అయితే మార్గ మధ్యంలో ఆ ఓడ సముద్రంలో మునిగి పోయింది. ఇది మొదలు ఈ ఆలయంలోని మంటపాన్ని తరలించాలన్ని భావించిన ప్రతి సారి బ్రిటీష్ పాలకులకు ఏదో ఒక అవాంతరం ఎదురయ్యింది.

విరమించారు.

విరమించారు.

P.C: You Tube

దీంతో ఈ ఆలయాన్ని తరలించే ప్రతిపాదనను వారు విరమించారు. అటు పై బ్రిటీషువారు ఈ కోటను, ఆలయాన్ని మందుగుండు భద్రపరచడానికి వినియోగించారు. కొంత కాలం తర్వాత ఆలయం, ఆలయలోని కళ్యాణ మంటపంలోని శిల్ప సంపద గొప్పతనాన్ని అక్కడికి వచ్చిన బ్రిటీష్ అధికారులు తిరిగి గుర్తించారు.

అప్పటి నుంచి పూజలు లేవు

అప్పటి నుంచి పూజలు లేవు

P.C: You Tube

అటు పై వారు 1921లోనే రాయ వెల్లూరు కోటను, అందులోని జలకంఠేశ్వరాలయాన్ని జాతీయ సంపదగా గుర్తించి దాని పరిరక్షణను పురావస్తుశాఖ కు అప్పగించారు. దీంతో 1921 నుంచి మనకు స్వాతంత్ర్యం వచ్చే వరకూ ఈ దేవాలయంలో ఎటువంటి పూజలు జరగలేదు.

నేక ఉద్యమాల తర్వాత

నేక ఉద్యమాల తర్వాత

P.C: You Tube

ఇక స్వాతంత్ర్యం తర్వాత స్థానిక ప్రజలు ఉద్యమాలు చేసి ఈ ఆలయంలోని జలకంఠేశ్వరుడికి తిరిగి పూజాది కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఇక్కడ ఉన్న జల కంఠేశ్వరుడు మనకు లింగం రూపంలో కనిపిస్తాడు. ఈయనను పూజిస్తే ఇంట్లో ఎటువంటి బాధలు ఉండవని చెబుతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+