Search
  • Follow NativePlanet
Share
» »బైందూర్ లో చూసేవి ... చేసేవి ఏవి ?

బైందూర్ లో చూసేవి ... చేసేవి ఏవి ?

బైందూర్ వద్ద మరో ప్రసిద్ధి గాంచిన యాత్రా స్ధలం కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయం. మరావంతే మరియు మురుడేశ్వర పుణ్యక్షేత్రాలు కూడా సమీపంలో ఉంటాయి.

By Mohammad

బైందూర్ పేరు చెపితే అన్నీ బీచ్ లు మరియు అందమైన సూర్యాస్తమయాలు అంటారు. ఈ విహార ప్రదేశం కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపురలో ఉంది. ఈ కుగ్రామం శ్రీ సోమేశ్వర దేవాలయానికి ప్రసిద్ధి. ఈ దేవాలయం శివభగవానుడిది. సరిగ్గా సముద్రపు ఒడ్డున ఉంది. అద్భుతమైన శిల్పాలు, గుడిలో లింగం చూడదగిన అంశాలు.

బైందూర్ లో చూసేవి ....చేసేవి ఏమిటి?

అందమైన బీచ్ కల బైందూర్ గ్రామం అనేక ఇతిహాసాలతో సంబంధం కలిగి ఉంది. ఈ ప్రదేశానికి, ఈ గ్రామంలోని ఒట్టినెనె కొండ వద్ద ఘోర తపస్సు చేసిన రుషి బిందు పేరుతో బైందూర్ గా ఏర్పడింది. ఒట్టినెనె కొండ ఎక్కి సముద్రం, బీచ్ మరియు సూర్యాస్తమయం వంటివి చూసి ఆనందించవచ్చు.

బైందూర్ వద్ద మరో ప్రసిద్ధి గాంచిన యాత్రా స్ధలం కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయం. మరావంతే మరియు మురుడేశ్వర పుణ్యక్షేత్రాలు కూడా సమీపంలో ఉంటాయి. మరావంతేలో ఒక బీచ్, మురుడేశ్వర దేవాలయానికి మూడువైపుల సముద్రం ఉంటాయి.

ఇది కూడా చదవండి : ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, హొరనాడు !!

బైందూర్ వాతావరణం, సాధారణంగాను ఆహ్లాదంగాను ఉంటుంది. ఆగస్ట్ నుండి మార్చి వరకు పర్యటనకు అనుకూలం. బైందూర్ కు రైలు సౌకర్యం కలదు. బెంగుళూరు నుండి 480 కిలో మీటర్ల దూరం ఉంటుంది. బెంగుళూరు, మంగుళూరుల నుండి ఈ గ్రామానికి ప్రయివేటు బస్సులు కూడా నడుస్తాయి.

శ్రీ రామచంద్ర మందిర్

శ్రీ రామచంద్ర మందిర్

శ్రీ రామచంద్ర మందిర్ బైందూర్ లోని ఈ శ్రీ రామచంద్ర మందిరానికి సంవత్సరం పొడవునా యాత్రికులు వస్తారు. ఈ దేవాలయంలో శ్రీ క్రిష్ణుడి అవతారమైన శ్రీరాముడి విగ్రహం ఉంటుంది.

చిత్రకృప : Ilya Mauter

శనీశ్వర దేవాలయం

శనీశ్వర దేవాలయం

బైందూర్ లో ఉన్న శనీశ్వర దేవాలయం ఎంతోమంది పర్యాటకులను సంవత్సరం పొడవునా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో ఈ దేవాలయం ఎన్నో శతాబ్దాల కిందటిదని అతి పురాతనమైనదని చెపుతారు.

చిత్రకృప : Vaikoovery

సోమేశ్వర దేవాలయం

సోమేశ్వర దేవాలయం

బైందూర్ బీచ్ కు సమీపంలో బైందూర్ నది మరియు అరేబియా సముద్రం పక్కన ఈ దేవాలయం కలదు. దీనిలో శివభగవానుడి లింగం ఉంటుంది. అనేక కుడ్య శిల్పాలు కూడా చూడవచ్చు. హిందువుల దేవత పార్వతీ దేవి ఇక్కడ కొల్లూరు శ్రీ మూకాంబిక దేవాలయంలో ప్రసిద్ధి చెందిన దేవత.

చిత్రకృప : kambala

మహాకాళి దేవాలయం

మహాకాళి దేవాలయం

బైందూర్ లోని మహాకాళి దేవాలయం సుమారు 300 సంవత్సరాల పురాతన దేవాలయం. ప్రస్తుతం దీనిని చిత్రపూర్ సరస్వత్ కుటుంబం నడుపుతోంది.

చిత్రకృప : Vaikoovery

బెలక తీర్ధ జలపాతాలు

బెలక తీర్ధ జలపాతాలు

బెలక తీర్ధ జలపాతాలు బైందూర్ కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒట్టినెనె కొండల సమీపంలో అద్భుత సూర్యాస్తమయాలు కూడా చూడవచ్చు.

చిత్రకృప : Mylittlefinger

బైందూర్ బీచ్

బైందూర్ బీచ్

బైందూర్ లో ప్రధాన ఆకర్షణ అంటే బైందూర్ బీచ్ మాత్రమే. మరావంతే బీచ్ నుండి ఇది 45 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బైందూర్ బీచ్ నుండి అద్భుత సూర్యాస్తమయాలు చూసి ఆనందించవచ్చు. బీచ్ లో కూర్చుంటే చాలు ఎంతో ప్రశాంతత పొందుతారు. పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. చక్కటి విశ్రాంతి పొంది ఆనందిస్తారు.

చిత్రకృప : Subhashish Panigrahi

క్షితిజ నేసర ధామ

క్షితిజ నేసర ధామ

ఉడుపి నుండి 92 కి.మీ. దూరంలో సహజ అందాల ప్రదేశంలో క్షితిజ నేసర ధామ ఉంటుంది. ఈ ప్రదేశంలో ఎన్నో తాటి మరియు కొబ్బరి చెట్లు అందాలను విరజిమ్ముతూంటాయి. ఈ ధామం ఒక చిన్న కొండపైన ఉండి అరేబియా సముద్రాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ వసతికై గదులు, తినటానికి హోటళ్ళు కలవు.

చిత్రకృప : Subhashish Panigrahi

బైందూర్ ఎలా చేరుకోవాలి ?

బైందూర్ ఎలా చేరుకోవాలి ?

దీనికి సమీపాన మంగళూరు విమానాశ్రయం కలదు. ఇది బైందూర్ నుండి 124 కిలోమీటర్ల దూరంలో కలదు. బైందూర్ లో రైల్వే స్టేషన్ కలదు. దీనికి సమీపాన ఉన్న మరో రైల్వే స్టేషన్ మూకాంబికా రోడ్ రైల్వే స్టేషన్. బైందూర్ కు ఉడుపి, మంగళూరు ప్రాంతాల నుండి ప్రభుత్వ/ ప్రవేట్ బస్సులు తిరుగుతుంటాయి.

చిత్రకృప : Stanyserra

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+