నాగపట్నం పర్యాటక అందాలు..
నాగపట్నం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు సందర్శకులను ఈ సీజన్‌లో ఆహ్వానించే పర్యాటక కేంద్రం. నాగపట్నంలో అడుగడుగునా తారసపడే టూరిస్ట్ స్పాట్స్‌కు కేరాఫ్ అడ్రస్ అనే చెప్పాలి. పురాతన నిర్మాణాలు మొదలుకుని వన్యప్రాణులు దోబుచూలాడే అభయారణ్యం ఈ నాగపట్నం ఒడిలోనే సేదతీరుతున్నాయని కుటుంబసమేతంగా విహారానికి ప్రణాళికలు వేసుకున్నవారు తమ జాబితాలో నాగపట్నం పేరును తప్పకు చేర్చాల్సిందే. మరెందుకాలస్యం అక్కడి పర్యాటక ప్రదేశాల విశేషాలను తెలుసుకుందాం పదండి.

డచ్ కోట
చరిత్ర గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా నాగపట్నంలోని డచ్ కోటను సందర్శించాల్సిందే. ఇది నాగపట్నంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ కోటను 17వ శతాబ్దంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. బ్రిటీష్‌వారు వాడిన ఎన్నో వస్తువులు ఇక్కడ ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి.

నాగపట్నం బీచ్
నాగపట్నంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాల జాబితాలో ఉన్న మరొక ప్రదేశం నాగపట్టణం బీచ్. ప్రశాంతత, విశ్రాంతిని కోరుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో అనువైనది. సూర్యాస్తమయా దృశ్యాలను ఇక్కడ నుంచి చూసి ఆస్వాదించొచ్చు. ఈ బీచ్ ఎన్నో రుచికరమైన సీఫుడ్ వంటకాలకు ప్రసిద్ధిగాంచింది.
సిక్కల్ సింగరవేలన్ ఆలయం
ఆధ్యాత్మిక ప్రశాంతత ఆస్వాదించాలనుకునేవారికి నాగపట్నంలోని సిక్కల్ సింగరవేలన్ ఆలయం ఒక ముఖ్యమైన ఎంపిక అనే చెప్పుకోవాలి. ఈ ఆలయం మురుగన్ కు అంకితం చేయబడినది. ఈ పురాతన ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ స్కంద షష్ఠి వార్షిక పండుగ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ చెడుపై మంచి సాధించిన విజయాన్నిజరుపుకునేందుకు భక్తులు ఈ పండుగను ప్రతిఏటా నిర్వహించుకుంటారు.

కోడిక్కరై వన్యప్రాణుల అభయారణ్యం
ఇది భారతదేశంలోని తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో ఒక రక్షిత ప్రాంతం. ప్రకృతి ప్రేమికులైతే నాగపట్నంలోని కోడిక్కరై వన్యప్రాణుల అభయారణ్యం సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. 21.47 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫ్లెమింగోలు, పెలికాన్‌లు, పెయింటెడ్ కొంగలతో సహా వలస పక్షులను చూసే అవకాశాన్ని పొందవచ్చు. ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో మడ అడవులు, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, సహజమైన బీచ్‌లు కూడా ఉన్నాయి. కోడిక్కరై వన్యప్రాణుల అభయారణ్యాన్ని, పాయింట్ కాలిమెర్ వన్యప్రాణులు, పక్షుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఈ అభయారణ్యం విభిన్న పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. అరుదైన జాతులతో సహా అనేక రకాల వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉంది.
ఎలా చేరుకోవాలి?
నాగపట్టణం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. భారతదేశంలోని అన్ని ప్రధాన గమ్యస్థానాలు, నగరాలకు తమిళనాడు అనుసంధానించబడి ఉంది. నాగపట్నం నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచ్చి విమానాశ్రయం సమీప విమానాశ్రయం. మదురై, చెన్నై, భారతదేశంలోని ఇతర ముఖ్యమైన నగరాలకు విమాన సర్వీసు అందుబాటులో ఉంది. రైలు మార్గం ద్వారా అయితే నాగపట్నం నుండి తంజావూరు, తిరుచ్చి, చెన్నై, నాగోర్‌లకు రైలు సౌకర్యాలున్నాయి. భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు చెన్నై రైల్వే మార్గం అనుసంధానించబడి ఉంది. రోడ్డు మార్గం ద్వారా అయితే నాగపట్నం నుండి తంజావూరు, తిరుచ్చి, నాగోర్, చెన్నైలకు బస్సు సర్వీసు నిత్యం అందుబాటులో ఉంటాయి.



Click it and Unblock the Notifications












