Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» నాగపట్నం

నాగపట్నం - మతపర సహనాలు కల భూమి !

14

నాగపట్నం లేదా నాగ పట్టినం తమిళ్ నాడు జిల్లా లోని నాగపట్టినం జిల్లాలో కలదు. ఈ టవున్ బంగాళా ఖాతం పక్కన తూర్పు తీరంలో కలదు. ఈ జిల్లాను తంజావూర్ జిల్లా నుండి కొంత భాగాన్ని వేరుపరచి నాగపట్టినం జిల్లాగా ఏర్పరచారు. నాగ పట్టినం జిల్లా హెడ్ క్వార్టర్స్ గా వుంటుంది. ఈ టవున్ చెన్నై నుండి 270 కి.మీ.లు దూరం వుంటుంది.

ఈ ప్రదేశం పేరు రెండు పదాల నుండి వచ్చింది. 'నగర్ ' అనగా శ్రీ లంక కు చెందిన ప్రజలు అని 'పట్టినం' అనగా టవున్ అని చెపుతారు. ఈ టవున్ కు చరిత్రలో ఇంకా ఇతర పేర్లు కూడా కలవు. చోళుల పాలనలో ఈ టవున్ ను చోలకుల వల్లిపట్టినం అనేవారు. ఈ ప్రదేశాన్ని నికం అని టాలెమీ పేర్కొన్నాడు. పోర్చుగీసు వారు 'ది సిటీ ఆఫ్ కోరమండల్' అని పేర్కొన్నారు.

నాగ పట్టినం లోను మరియు చుట్టుపట్ల పర్యాటక ఆకర్షణలు

నాగ పట్టినం దాని చరిత్రకు సంస్కృతికి పేరు గాంచినది. అది దానికి గల అత్యుత్తమ ఓడరేవులకు దేశ వ్యాప్తంగా పేరొందినది. ఈ టవున్ ఇక్కడ గల టెంపుల్స్ కు వచ్చే అనేకమంది యాత్రికులను కూడా ఆకర్షిస్తుంది.

సౌందర్య రాజ పెరుమాళ్ టెంపుల్, నేల్లుకడై మరి యమ్మన్ టెంపుల్, కాయరోహనస్వామి టెంపుల్, అరుముగాస్వామి టెంపుల్ వంటివి ఇక్కడ కల ప్రసిద్ధ టెంపుల్స్ లో కొన్ని.

ఈ ప్రదేశానికి పక్కనే కల వేదారణ్యం లో వేదారనేశ్వర్ టెంపుల్ కలదు. ఇక్కడ టెంపుల్స్ మాత్రమే కాక 16 వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన దర్గా కూడా కలదు.

నాగ పట్టినం 'బాసిలిక ఆఫ్ అవర్ లేడీ అఫ్ గుడ్ హెల్త్ 'చర్చి కల వేలన్ కన్ని కి చాలా దగ్గరగా వుంటుంది. ఈ టవున్ లో నాలుగు మతాలు కలవు అవి హిందూ, ఇస్లాం, క్రైస్తవ మరియు బౌద్ధ. అన్ని మతాల వారూ పరమత సహనం చూపుతారు.

నాగ పట్టినం సమీపం లో టవున్ వద్ద ఒక ఉప్పు కయ్య కలదు. కోడిక్కరాజ్ వైల్డ్ లైఫ్ సంక్చురి ప్రసిద్ధి చెందినది. ఈ ప్రదేశాలు పర్యాటకులకు ఆసక్తి కరంగా వుంటాయి.

ప్రదేశ చరిత్ర క్లుప్తంగా ....

నాగ పట్టినం చరిత్ర చెప్పాలంటే చోళ రాజుల పాలనా కాలానికి వెళ్ళాలి. ఆ సమయంలో, ఈ ప్రదేశం ఒక ప్రఖ్యాత ఓడరేవు మరియు వాణిజ్య కేంద్రంగా వుండేది. క్రి.శ.౩వ శతాబ్దంలో చక్రవర్తి అశోకుడు ఇక్కడ ఒక బుద్ధ విహార్ నిర్మించగా ఈ ప్రదేశం 5 మరియు 6 శతాబ్దాలలో ఒక ప్రసిద్ధ బౌద్ధ మత కేంద్రం అయింది.

ఈ ప్రదేశానికి బ్రిటిష్ చరిత్ర పోర్చుగీస్ వారు 16 వ శతాబ్దం లో దీనిని ఒక వాణిజ్య కేంద్రం చేయడంతో మొదలైంది. వీరు ఇక్కడ మత ప్రచారం చేయాలని కూడా ఈ పట్టణాన్ని వారి స్థావరంగా చేసుకున్నారు. 17 వ శతాబ్ద మధ్యభాగం లో పోర్చుగీస్ వారి నుండి ఈ పట్టణం పై గల అధికారం డచ్ వారికి తంజావూర్ రాజు చేసుకున్న ఒక ఒప్పందం మేరకు బదిలీ అయింది.

డచ్ వారు ఇక్కడ అనేక చర్చిలు మరియు ఒక హాస్పిటల్ నిర్మించారు. 1690 లలో ఇది డచ్ కోరమండల్ కు రాజధానిగా వుండేది. నేటికి డచ్ దాడుల గుర్తులు బాగా ఇక్కడ కనపడతాయి. దీనికి డచ్ కోట ఒక ఉదాహరణ. క్రి.శ.1781లో బ్రిటిష్ వారు నాగపట్టినం ను డచ్ వారి నుండి స్వాధీనం చేసి కొన్నారు. బ్రిటిష్ పాలనలో ఈ పట్టణం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ప్రధాన పోర్ట్ లలో ఒకటిగా వుండేది.

నాగ పట్టినం ఎలా చేరాలి ?

నాగ పట్టినం టవున్ ను తమిళ్ నాడు లేదా కేరళ ద్వారా చేరు కోవచ్చు. ఈ టవున్ కు సమీప ఎయిర్ పోర్ట్ తిరుచిరాపల్లిలో కలదు. ఇది 141 కి.మీ.ల దూరంలో వుంటుంది. తిరుచిరాపల్లి నుండి టాక్సీలు నాగ పట్టినంకు తేలికగా దొరుకుతాయి. చెన్నై ఎయిర్ పోర్ట్ నుండి దేశ విదేశాల వారు నాగ పట్టినం చేరవచ్చు. నాగ పట్టినంకు రైలు స్టేషన్ కలదు. ఇక్కడనుండి తమిళ్ నాడు లోని ప్రధాన ప్రదేశాలకు రైళ్ళు కలవు. తమిళ్ నాడు మరియు, కేరళ, కర్ణాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ ల లోని ప్రధాన నగరాల నుండి నాగ పట్టినంకు బస్సులు కలవు.

నాగ పట్టినం వాతావరణం

నాగ పట్టినం సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకు గల వాతావరణం బాగుంటుంది. అయితే, ఇక్కడ ఏప్రిల్ , మే నెలలలో తీర్థ యాత్రలకు మరియు వర్షా కాలమైన జూన్ నుండి సెప్టెంబర్ వరకూ ఈ ప్రదేశం ఆకర్షణీయంగా వుంటుంది కనుక సంవత్సరం పొడవునా ఇక్కడకు యాత్రికులు వస్తూనే వుంటారు.

నాగపట్నం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

నాగపట్నం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం నాగపట్నం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? నాగపట్నం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్ ప్రయాణం తమిళ్ నాడు మరియు పొరుగు రాష్ట్రాల నుండి నాగ పట్టినంకు రెగ్యులర్ బస్సు లు కలవు. నాగ పట్టణం నుండి కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ల లోని ప్రధాన నగరాలకు ప్రైవేటు బస్సు లు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    ట్రైన్ ప్రయాణం నాగ పట్టినం రైల్వే స్టేషన్ సిటీ లోనే కలదు. ఇది తమిళ్ నాడు లోని ప్రధాన నగరాలకు రైళ్ళు కలిగి వుంది. ఇక్కడ నుండి 52 కి.మీ.ల దూరంలో కల నాగ పట్టినం లేదా 96 కి.మీ.ల దూరంలో కల తంజావూర్ ల నుండి ఇండియాలోని అనేక ప్రాంతాలకు రైళ్ళు కలవు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం నాగ పట్టినంకు సమీప ఎయిర్ పోర్ట్ తిరుచిరాపల్లి. ఇది 141 కి.మీ.ల దూరంలో కలదు. తిరుచిరాపల్లి నుండి నాగ పట్టినంకు టాక్సీలు దొరుకుతాయి. చెన్నై నుండి తిరుచిరాపల్లికి రెగ్యులర్ విమాన సర్వీస్ లు కలవు. చెన్నై ఎయిర్ పోర్ట్ ఇక్కడకు సుమారు 256 కి.మీ.ల దూరంలో వుంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed