Search
  • Follow NativePlanet
Share
» »కర్ణాటక డే సంద‌ర్భంగా అక్క‌డి ఈ ప్రాంతాల‌ను త‌ప్ప‌క చూడాల్సిందే..!

కర్ణాటక డే సంద‌ర్భంగా అక్క‌డి ఈ ప్రాంతాల‌ను త‌ప్ప‌క చూడాల్సిందే..!

నవంబర్ 1న కర్ణాటక దినోత్స‌వం సంద‌ర్భంగా క‌ర్ణాట‌క‌లోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌ను ఓసారి చూసొద్దాం రండి. ఈ రోజుని కర్ణాటక వ్యవస్థాపక దినోత్సవం లేదా రాజ్యోత్సవ దినోత్సవం అని కూడా అంటారు. కర్ణాటకను గతంలో మైసూర్ అని కూడా వ్యాఖ్యానించేవారు. 1973లో ఈ పేరును మార్చారు. దేశంలోని ప్ర‌సిద్ధిచెందిన ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌లో క‌ర్ణాట‌క రాష్ట్రం అగ్ర‌స్థానంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక పురాత‌న క‌ట్ట‌డాలు, చారిత్ర‌క ప్ర‌దేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు మ‌రెన్నో దాగి ఉన్నాయి. ఇంకా ప్ర‌సిద్ధిచెందిన బీచ్‌లు కూడా ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల మాదిరిగానే క‌ర్ణాట‌క కూడా జ‌ల‌పాతాలు, ప‌శ్చిమ క‌నుమ‌లు, అంద‌మైన హిల్‌స్టేష‌న్ల‌కు పెట్టింది పేరు. క‌ర్ణాట‌క భారతదేశంలో చాలా అందమైన ప్రదేశంగా ప్ర‌సిద్ధి చెందింది. క‌ర్ణాట‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ఇక్క‌డి అంద‌మైన ప్ర‌దేశాల గురించి ఓసారి చూసేద్దాం రండి.

coorg coffee plantations

కూర్గ్‌..

కర్ణాటకలోని కూర్గ్ చాలా అందమైన పర్యాటక ప్ర‌దేశం. దీనిని కొడగు అని కూడా అంటారు. ఈ ప్రదేశం మైసూర్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్క‌డి చుట్టూ దట్టమైన అడవులు, అందమైన జలపాతాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అంతేకాదు, ఇక్క‌డి కాఫీ,టీ, మసాలా తోటలు నిత్యం పర్యాటకుల్ని అకర్షిస్తుంటాయి. ఈ హిల్‌స్టేషన్ శీతాకాలంలో ద‌ట్ట‌మైన‌ పొగమంచు అందాలతో మరింత సుందరంగా ఉంటుంది. అతితక్కువ బడ్జెట్‌లో ఎక్క‌డికైనా వెళ్లాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్నిఎంపిక చేసుకోవ‌చ్చు. కూర్గ్​ను 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా' అని అంటారు. అచ్చం స్కాట్లాండ్​లో ఉన్నట్టే ఇక్కడ కూడా పచ్చదనం, రకరకాల పూల మొక్కలు, చెట్లు, లోయలు ఉంటాయి. సముద్రమట్టానికి ఈ ప్రాంతం దాదాపు 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు ఎంతో అనువైన‌ది.

మైసూర్

క‌ర్ణాట‌లోని మ‌రో ఫేమ‌స్ ప్లేస్ మైసూర్‌. ఈ పేరు విన‌గానే చాలామంది ఇక్క‌డి ప్యాలెస్ గుర్తొస్తుంది. మైసూర్‌లో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్ వంటివెన్నో..ఇంకా ఇక్క‌డ అనేక‌ చారిత్రక కట్టడాలు ఇతర ప్రదేశాలు ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటాయి. దేశంలోనే అత్యంత పెద్ద ప్యాలెస్‌లలో ఒకటైన మైసూర్ ప్యాలెస్ కూడా ఇక్క‌డే ఉంది. ఈ ప్యాలెస్‌ను 1912 వడయార్ రాజవంశానికి చెందిన 24వ పాలకులతో నిర్మించిన‌ట్లు చ‌రిత్ర చెబుతోంది. ఈ ప్యాలెస్‌లోని లైట్ అండ్ మ్యూజిక్ షో ఎంతో పేరుగాంచింది.

hampi

హంపి

కేవ‌లం క‌ర్ణాట‌క‌లోనే కాకుండా దక్షిణ భారత్‌లోని ప్రముఖ టూరిస్ట్‌ ప్రదేశాల్లో ఎంతో ముఖ్య‌మైన ప్ర‌దేశం హంపి. ఇక్క‌డి దేశ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతిరూపం ఈ ప్రాంతం. ఇక్క‌డ‌ శతాబ్దాల నాటి శిల్పాలు, అద్భుతమైన కట్టడాలు, అద్భుత ప్రకృతి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. హంపిలో ఎక్క‌డచూసిన మీకు విదేశీయులు క‌నిపిస్తారు.

chikmagalur hill stations

చిక్‌మ‌గుళూరు

క‌ర్ణాట‌క‌లోని మ‌రో ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశం చిక్‌మగళూరు. దీనిని కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని అంటారు. ఈ హిల్ స్టేషన్ ముల్లయనగిరి పర్వతాల దిగువన ఉంటుంది. ఇది కాఫీ తోట‌ల‌కు ఎంతో ప్ర‌సిద్ధిచెందింది. ఇది స‌ముద్ర‌మ‌ట్టానికి 3400 అడుగుల ఎత్తులో ఉంటుంది. చిక్‌మగళూరు బెంగుళూరు నుంచి సుమారు 242 కిలోమీట‌ర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్క‌డ మాణిక్య‌ధార ఫాల్స్‌, అయ్య‌న‌కెరే స‌ర‌స్సు, ములియంగిరి, హిరేకొలాలే స‌ర‌స్సు వంటి ప్ర‌దేశాల‌ను చూసేయొచ్చు. ఇక్క‌డి ప‌చ్చ‌ని అడవులు ఇక్క‌డికొచ్చే ప‌ర్యాట‌కుల‌ను ఎంతగానో ఆక‌ట్టుకుంటాయి. కెమ్మగుండి, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, ముల్లాయనగిరి, హెబ్బే ఫాల్స్, బాబా బుడంగిరి చిక్‌మ‌గుళూరులోని సంద‌ర్శ‌నీయ స్థ‌లాలు..

More News

    Read more about: kanada rajyothsava coorg mysore
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+