Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ నిమ్మకాయలు, ఎర్రటి చీరులు ఇస్తే పడంటి బాబు మీ నట్టింట తిరుగాడుతాడు

ఇక్కడ నిమ్మకాయలు, ఎర్రటి చీరులు ఇస్తే పడంటి బాబు మీ నట్టింట తిరుగాడుతాడు

పట్టీశ్వరంలోని దుర్గాదేవి దేవాలయం గురించి.

By Kishore

కుంభకోణానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో పట్టీశ్వరం ఉంది. ఇక్కడ ఉన్న ఓ దేవాలయంలోని అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలు అందుకొంటూ ఉన్నారు. ఇక్కడ తపస్సు చేసుకొంటున్న పార్వతీ దేవికి సహాయంగా ఉండటనాకి కామధేవును తన కూతురైన పట్టిని ఇక్కడకు పంపించిందని పురాణాలు చెబుతున్నాయి. పురాణ ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించారు. ఇక్కడ ఉన్న కుడ్యచిత్రాలు చూడటానికే బాగుండటమే కాకుండా చరిత్ర పై పరిశోధనలు చేయడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. రాహు, కేతు దోష పరిహారం కోసం ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ అమ్మవారికి నిమ్మకాయలు, ఎర్రని చీరను ముడుపుగా అందిస్తే వారి కోరిక తొందరగా నెరవేరుతుందని చాలా ఏళ్లుగా నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన దేవాలయం వివరాలు మీ కోసం...

పార్వతీ దేవి తపస్సు చేయడం కోసం

పార్వతీ దేవి తపస్సు చేయడం కోసం

P.C: You Tube

పరాశక్తికి ప్రతిరూపమైన పార్వతీ దేవి తపస్సు చేయడం కోసం భూలోకంలో అన్ని చోట్ల వెదుకుతుంది. అయితే ఎక్కడా అమెకు సరైన ప్రాంతం కనిపించదు. చివరికి ప్రస్తుతం కుంభకోణంలోని పట్టీశ్వర దేవాలయం ఉన్న ప్రాంతానికి చేరుకొని అక్కడ తపస్సు చేయడం ప్రారంబిస్తుంది.

2. మెక్కల రూపంలో

2. మెక్కల రూపంలో

P.C: You Tube

విషయం తెలుసుకొన్న దేవతలు ఆమెకు సహాయం చేయడానికి వస్తారు. వారు వచ్చే సమయానికి ఈ ప్రాంతం మొత్తం వేడిగా ఉంది. దీంతో ఆ దేవతలు వాతావరణం చల్లబరచడానికి ఇక్కడ మెక్కల రూపంలో వెలిశారని చెబుతారు.

పట్టిని ఇక్కడకు పంపించింది

పట్టిని ఇక్కడకు పంపించింది

P.C: You Tube

అంతేకాకుండా తపస్సు చేసుకొంటున్న పార్వతీ దేవికి సహాయంగా ఉండటనాకి కామధేవును తన కూతురైన పట్టిని ఇక్కడకు పంపించింది. అటు పై శివుడు ఆ పార్వతీ దేవికి ప్రత్యక్షమయ్యి ఆమెను స్వయంగా కైలాసానికి తీసుకువెళ్లాడు.

ఇసుకతో ఒక శివలింగాన్ని

ఇసుకతో ఒక శివలింగాన్ని

P.C: You Tube

ఈ ఘటనను చూసిన పట్టీ తాను కూడా శివుడి కాటాక్షం పొందాలని భావించి ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి పూజించడం మొదలు పెట్టింది. పట్టీ భక్తికి మెచ్చిన శివుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెను అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆమె తయారు చేసిన సైతక లింగంలోకి తన ఆత్మను ప్రవేశపెట్టారని కూడా చెబుతారు.

కొంచెం పక్కగా

కొంచెం పక్కగా

P.C: You Tube

అప్పటి నుంచి ఇక్కడ కొలువైన ఈశ్వరుడిని పట్టీశ్వరుడు అని ఈ క్షేత్రాన్ని పట్టీశ్వర క్షేత్రం అని వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా ఉంటాడు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఇప్పటికీ ప్రచారంలో ఉంది.

 శైవ తత్వ వ్యాప్తికోసం

శైవ తత్వ వ్యాప్తికోసం

P.C: You Tube

దీని ప్రకారం తిరుజ్జాన సంబంధార్ అనే మహాభక్తుడి ఉండేవాడు. ఆయన చిన్నతనం నుంచి శివుడి పై భక్తితో పాటలు పాడుతూ శైవ తత్వ వ్యాప్తికోసం చాలా పాటు పడేవాడు. అలాంటి సంబంధార్ చిన్నతనంలో పట్టీశ్వరుడిని చూడటం కోసం మండుటెండని కూడా లెక్కచేయకుండా పరమశివుడి దర్శనం కోసం పరుగు పరుగున వస్తాడు.

ముత్యాల గొడుగును

ముత్యాల గొడుగును

P.C: You Tube

విషయం తెలుసుకొన్న పరమశివుడు తన భక్తుడైన సంబంధార్ కు తన గణాలతో ముత్యాల గొడుగును పంపించాడు. అంతే కాకుండా ఆయన కాళ్లు కందిపోకుండా నడిచే దారిలో మెత్తటి పూలను వేయించాడు. ఇక శివాలయం వద్దకు రాగానే ఆ పరమ భక్తుడిని వెంటనే చూడలన్న ఆత్రుతతో శివుడు నందిని కొంచెం పక్కకు తప్పుకోమన్నాడని చెబుతాడు.

వీటిని పదిగమ్ అని అంటారు

వీటిని పదిగమ్ అని అంటారు

P.C: You Tube

ఇలా శివుడే స్వయంగా నందిని ఇక్కడ పక్కకు జరగమన్నాడని చెబుతాడు. అందువల్లే నందీశ్వరుడు ఇక్కడ శివలింగానికి ఎదురుగా కాక కొంచె పక్కగా ఉంటాడు. ఇక సంబంధార్ కూడా పరమశివుడిని చూసిన వెంటనే భక్తి పారవశ్యంతో 10 పాటలు పాడాడు. వీటిని పదిగమ్ అని అంటారు.

తమిళ మాసం ఆణిలో

తమిళ మాసం ఆణిలో

P.C: You Tube

ఇప్పటికీ తమిళనాడులోని పలు శైవ క్షేత్రాల్లో ఈ పాటలను పాడటం మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ ఘటనను గుర్తు చేసుకొంటూ ప్రతి ఏడాది జూన్ జులై నెలల మధ్య వచ్చే తమిళ మాసం ఆణిలో ఈ పట్టీశ్వరంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది.

చిన్నపిల్లవాడు తిరుజ్జాన సంబంధార్

చిన్నపిల్లవాడు తిరుజ్జాన సంబంధార్

P.C: You Tube

ఈ ఉత్సవంలో భాగంగా ఇక్కడికి దగ్గర్లోని తిరుశక్తిముంత్రలో నుంచి పట్టీశ్వరానికి ఒక ఊరేగింపు బయలు దేరుతుంది. అందులో ఇక చిన్నపిల్లవాడు తిరుజ్జాన సంబంధార్ రూపంలో ఉంటాడు. ఈ ఉత్సవాన్ని చూడటానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు.

ఎనిమిది చేతులతో ఉన్న

ఎనిమిది చేతులతో ఉన్న

P.C: You Tube

పట్టీశ్వరంలోనే అత్యంత ప్రాచూర్యం పొందిన దుర్గాదేవి ఆలయం ఉంది. ప్రసన్న వదనంతో ఎనిమిది చేతులతో ఉన్న దుర్గాదేవిని ఇక్కడ చూడవచ్చు. ఆ చేతులతో ఆ విల్లంబులు ఖడ్గం, శంఖం, చక్రం వంటి ఆయుధాలు ఉంటాయి. ఇక అమ్మవారు సింహ వాహనం పై ఉంటుంది. ఇక్కడ సింహం తల ప్రతి చోటా ఉన్నట్లు కుడి వైపున కాకుండా అమ్మవారి ఎడమ వైపున ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని విష్ణు దుర్గగా కూడా కొలుస్తారు.

చోళులకు ఈ దుర్గాదేవి కుల దేవతగా

చోళులకు ఈ దుర్గాదేవి కుల దేవతగా

P.C: You Tube

చాలాకాలం పాటు చోళులకు ఈ దుర్గాదేవి కుల దేవతగా ఉండేది. వాళ్ల రాజభవనంలో ఉత్తరం దిక్కుగా ఈ దేవతను ప్రతిష్టించి నిత్యం పూజలు చేసేవారు. ఏదైనా యుద్ధానికి వెళ్లేటప్పుడు ఆ విషయంలోనైనా ముఖ్యమైన నిర్ణక్ష్ం తీసుకునేటప్పుడు చోళరాజులు ఈ అమ్మవారిని ప్రార్థించి ఆవిడ అనుమతిని తీసుకునేవారు. వారి రాజ్యం పతనమైన తర్వాత అమ్మవారి విగ్రహంతో పాటు భైరవుడి విగ్రహం, సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాన్ని ఈ దేవాలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.

పిల్లులు కలగని దంపతులు

పిల్లులు కలగని దంపతులు

P.C: You Tube

రాహు, కేతు దోష పరిహారం కోసం ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా పిల్లులు కలగని దంపతులు, పెళ్లికాని వారు ఇక్కడ దేవతకు నిమ్మకాయలు, ఎర్రని చీరలు ఇస్తే వారి కోరిక కలుగుతుందని భక్తుల నమ్మకం. అందువల్లే దేశంలోని సుదూర ప్రాంతల నుంచి ఇక్కడకు ఈ సమస్యలతో బాధపడేవారు వస్తుంటారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+