Search
  • Follow NativePlanet
Share
» »భట్కల్ - కొంకణ్ తీరంలో ముస్తాబైన పట్టణం !!

భట్కల్ - కొంకణ్ తీరంలో ముస్తాబైన పట్టణం !!

భట్కల్ ఒక విభిన్న పట్టణం. ఈ పట్టణంలో దేవాలయాలు, మసీదులు, జైన్ చావడులు ఎన్నో ఉన్నాయి. ఈ పట్టణంలోని జామియా మసీద్, ఖలీఫా మసీద్ మరియు నూర్ మసీద్ వంటివి ఎంతో పేరు పొందాయి.

By Mohammad

పర్యాటక ప్రదేశం : భట్కల్

జిల్లా : ఉత్తర కన్నడ

రాష్ట్రం : కర్నాటక

ప్రసిద్ధ ఆకర్షణలు : కేతపయ్య నారాయణ దేవాలయం, జామియా మసీదు, జైన చావడులు

అధికార భాష : కన్నడ

భట్కల్ పట్టణం కర్నాటక రాష్ట్రంలో అతి పురాతన పట్టణం. గత చారిత్రక వైభవం కలది. దేశంలోని పురాతన ఓడరేవులలో ఒకటి. ఈ పట్టణం ఉత్తర కన్నడ లో కార్వార్ కు 130 కి. మీ. ల దూరంలో ఆహ్లాదకర బీచ్ లతో నిండి ఉంది. భట్కల్ పట్టణం కొంకణ్ రైల్వేకు అనుసంధానించబడి, జాతీయ రహదారి 17 కు దగ్గరగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : గడగ్ - తప్పక చూడవలసిన ప్రదేశం !!

భట్కల్ ఒక విభిన్న పట్టణం. ఈ పట్టణంలో దేవాలయాలు, మసీదులు, జైన్ చావడులు ఎన్నో ఉన్నాయి. ఈ పట్టణంలోని జామియా మసీద్, ఖలీఫా మసీద్ మరియు నూర్ మసీద్ వంటివి ఎంతో పేరు పొందాయి. ఇక్కడ ఉన్న దేవాలయాలలో కేతపయ్య నారాయణ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. పర్యాటకులు ఇక్కడి బీచ్ లలో విశ్రాంతి పొందుతారు.

జామియా మసీద్

జామియా మసీద్

జామియా మసీద్ కు ప్రతి సంవత్సరం అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఈ మసీదు 851 హిజీరాలో బంగారు గోపురం కలిగి ఉండేది. దీని కారణంగా జామియా మసీదు పేరుగాంచింది. షుమారు పదివేలమంది ప్రార్ధన చేసేటందుకు అనుకూలంగా ఉంటుంది.

సుల్తాన్ మసీద్

సుల్తాన్ మసీద్

సుల్తాన్ మసీదును టిప్పు సుల్తాన్ నిర్మించారు. 1211 హిజీరాలో నిర్మించిన ఈ కట్టడం ద్రవిడ శిల్ప శైలిని కలిగి ఉంటుంది. అధిక సంఖ్యలో భక్తులు తమ నమాజ్ ఈ మసీదులో చేసుకుంటారు.

చిత్రకృప : Tumkurameen

భట్కల్ బీచ్

భట్కల్ బీచ్

పర్యాటకులు భట్కల్ బీచ్ ని భట్కల్ ఓడరేవు పట్టణ సందర్శనలో చూడవచ్చు. చుట్టూ పడమటి కనుమల కొండలు, కొబ్బరి చెట్లు, భట్కల్ బీచ్, అరేబియా సముద్రం కలిగి ఎంతో అందంగా ఉంటుంది. మురుడేశ్వర కోటతోపాటుగా ఈ బీచ్ ని కూడా విజయనగర దేవాలయం మరియు జైన్ చంద్రనాధ బసాడి లతో దర్శించవచ్చు.

చిత్రకృప : vivek raj

కేతపయ్య నారాయణ దేవాలయం

కేతపయ్య నారాయణ దేవాలయం

భట్కల్ సందర్శనలో సమయం ఉంటే, పర్యాటకులు కేతపయ్య నారాయణ దేవాలయాన్ని తప్పక చూడాలి. ఈ దేవాలయంలో విజయనగర సామ్రాజ్య శిల్ప సంపద కనపడుతుంది. నవరంగ గా చెప్పబడే ఒక నాలుగు స్తంభాల పెద్ద హాలు నిర్మించారు. దీని చుట్టూ అష్ట దిక్పాలక విగ్రహాలను ఎనిమిది దిక్కులలో నిర్మించారు.

చిత్రకృప : Vedamurthy J

భట్కల్ లైట్ హౌస్

భట్కల్ లైట్ హౌస్

భట్కల్ లైట్ హౌస్ ను 1891 లో నిర్మించారు. ఇది భట్కల్ పట్టణ ఆకర్షణలలో ఒకటి. ఇది భట్కల్ నది ప్రవేశంలో దక్షిణ దిశగా ఒక కొండపై భట్కల్ కోట సమీపంలో ఉంది.

చిత్రకృప : Rohan Dhule

కడవినకట్ట డ్యామ్

కడవినకట్ట డ్యామ్

కడవినకట్ట డ్యామ్, భట్కల్ కడవినకట్ట డ్యామ్ ను వెంకటాపూర్ నదిపై నిర్మించారు. భట్కల్ పట్టణానికి ఈ డ్యామ్ నీటిని సరఫరా చేస్తుంది. బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలను ఇక్కడ అధికారులు నిర్వహిస్తుంటారు.

చిత్రకృప : Amoghavarsha

నూర్ మసీదు

నూర్ మసీదు

నూర్ మసీదును 1966 లో నిర్మించారు. ఇది నేషనల్ హైవే లో కలదు. ఈ మసీదు రాష్ట్రంలోని అన్ని మసీదులకంటే ఉత్తమమైంది. సుమారు 1500 మంది వరకు ప్రార్ధనలు చేయగల ఈ మసీదును పర్యాటకులు తప్పక చూడాలి.

చిత్రకృప : Golf Bravo

ఖలీఫా జామియా మసీద్

ఖలీఫా జామియా మసీద్

భట్కల్ లోని ఎనిమిది పురాతన మసీదులలో ఖలీఫా జామియా మసీద్ ఒకటి. ఇది సుమారుగా 200 సంవత్సరాలక్రిందటిది. ఈ మసీదు షరాబి నది ఒడ్డున ఖలీఫా వీధిలో ఉంది.

చిత్రకృప : Aravind Nagaraj

మఖ్దూమ్ మసీద్

మఖ్దూమ్ మసీద్

భట్కల్ పర్యాటకులు పురాతన ముస్లిం నివాస ప్రదేశంలో కల మఖ్దూమ్ మసీద్ తప్పక చూడాలి. మసీదు పేరు మఖ్దూమ్ కాలనీ నుండి తీసుకొనబడింది. అంటే అది హజరత్ మఖ్దూమ్ ఫాకి ఇస్మాయిల్ సూక్రి పేరు పై పెట్టబడింది. ఆ ప్రవక్త సుమారు నలభైరోజులు ప్రార్ధనలు చేసి అల్లాను మెప్పించాడని చెపుతారు.

చిత్రకృప : Kumarcnaik

భట్కల్ ఎలా చేరాలి?

భట్కల్ ఎలా చేరాలి?

విమాన ప్రయాణం - దేశీయ విదేశీయ పర్యాటకులకు అనువైన మంగుళూరు విమానాశ్రయం భట్కల్ సమీపంలో ఉంది. భట్కల్ నుండి ఈ విమానాశ్రయం 144 కి.మీ. దూరంగా ఉంది.

బస్ ప్రయాణం - భట్కల్ పట్టణం దేశంలోని వివిధ నగరాలకు రోడ్డు ద్వారా కూడా కలుపబడింది. హైద్రాబాద్, మంగుళూరు, గుల్బర్గా, హుబ్లీ, బీదర్, ముంబై, పూనే వంటి ప్రధాన నగరాలనుండి భట్కల్ కు బస్సులున్నాయి.

రైలు ప్రయాణం - భట్కల్ రైలు స్టేషన్ దేశంలోని ప్రధాన నగరాలు అంటే న్యూఢిల్లీ, జైపూర్, మార్గోవా మొదలైన వాటితో కలుపబడి భట్కల్ నగరానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

చిత్రకృప : Rajaramraok

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+