Search
  • Follow NativePlanet
Share
» »దుర్శట్ అడవి అందాలు రాత్రిపూట చూడాలా

దుర్శట్ అడవి అందాలు రాత్రిపూట చూడాలా

మహారాష్ట్రలోని సహాద్రీ పర్వత పంక్తుల పరిధిలో ఉన్న అంబానది ఒడ్డున ఉన్న దుర్శట్ ఒక చిన్న గ్రామం.

మహారాష్ట్రలోని సహాద్రీ పర్వత పంక్తుల పరిధిలో ఉన్న అంబానది ఒడ్డున ఉన్న దుర్శట్ ఒక చిన్న గ్రామం. ముంబై, పూనే వాసులకు బెస్ట్ వీకెండ్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు.. ఇక్కడ ప్రకతి రమణీయతను చూసి మైమరిచిపోవడంతో పాటు అనేక ధార్మిక సంస్థలను కూడా చూడవచ్చు.. అందువల్లే ఇటీవల కాలంలో ముంబై, పూనే వాసులు తమ వీకెండ్ ను ఆహ్లాదంగా గడపడానికి ఇక్కడికి వస్తుంటారు.

రెండు కోటలు

రెండు కోటలు

P.C: You Tube

దుర్శట్ నుంచి రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సరస్ ఘడ్, సుధఘడ్ కోటలు అలనాటి మహారాష్ట్ర వీరుడు ఛత్రపతి శివాజీ రాచరిక వైభవానికి గుర్తుగా నిలుస్తున్నాయి. కేవలం చారిత్రాత్మకంగానే కాకుండా ట్రెక్కింగ్ వంటి సాహసక్రీడల పట్ల ఆసక్తి ఉన్నవారికి కూడా కోటలు ఆహ్వానం పలుకుతున్నాయి.

వారాంతాల్లో

వారాంతాల్లో

P.C: You Tube

అందువల్లే వారాంతాల్లో ముంబై, పూనేకు చెందిన అనకమంది ట్రెక్కింగ్ వీరులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. ప్రక`తిలో మమేకం కావలనుకొనేవారు వారాంతాల్లో ఇక్కడికి వచ్చేస్తుంటారు. అందువల్లే శని, ఆదివారాల్లో ఈ ప్రాంతం కిక్కిరిసి ఉంటుంది.

రెండు దేవాలయాలు

రెండు దేవాలయాలు

P.C: You Tube

శ్రీ బల్లలేశ్వర దేవస్థానం, మహద్ శ్రీ వరదా వినాయక దేవస్థానం దర్శట్ గ్రామంలో ఉన్నాయి. ఈ రెండు దేవాలయాలు అత్యంత ప్రాచీనమైనవి. అందువల్లే కేవలం ముంబై, పూనే నుంచే కాకుండా మహారాష్ట్ర
నుంచి అనేక మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

నైట్ సఫారీ

నైట్ సఫారీ

P.C: You Tube

దుర్శట్ లో నైట్ సఫారీ అందుబాటులో ఉంటుంది. నీలి ఆకాశంలో మినుక్కు మినుక్కు మనే నక్షత్రాల వెలుగులో చిట్టడివిలో రాత్రి సమయంలో కీచురాళ్లు చేసే శబ్దాలను వింటూ నడుచుకొంటూ వెళ్లడం
జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

వేడినీటి బుగ్గలు

వేడినీటి బుగ్గలు

P.C: You Tube

ఈ అడవిలో ఉద్దార్ పేరున వేటి నీటి బుగ్గలు ఉన్నాయి. వీటిలో సహజసిద్దమైన సల్ఫర్ వల్ల ఇందులో స్నానం చేస్తే అనేక చర్మవాధులు సమిసిపోతాయని చెబుతారు. అందువల్లే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వేడినీటి బుగ్గల్లో స్నానం చేస్తుంటారు.

జలక్రీడలు

జలక్రీడలు

P.C: You Tube

దుర్శట్ సమీపంలో ఉన్న కుండలిక నది లో రివర్ రాఫ్టింగ్, కయాకింగ్ వంటి అనేక జలక్రీడలు అందుబాటులో ఉంటాయి. నిపుణుల సహాయంతో ఇక్కడ జలక్రీడలు ఆడటానికి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.

ఫారెస్ట్ లాడ్జ్

ఫారెస్ట్ లాడ్జ్

P.C: You Tube

దుర్శట్ ఫారెస్ట్ లాడ్జ్ అంబానదీ తీరంలో ఉన్న ఒక అందమైన రెస్టోరెంట్. ఈ రెస్టోరెంట్ సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఫారెస్ట్ లాడ్జ్ లో ఉండటం వల్ల తెల్లవారుజాముతో పాటు నైట్ సఫారీకి వెళ్లడానికి
వీలవుతుంది.

ఎప్పుడు వెళ్లవచ్చు

ఎప్పుడు వెళ్లవచ్చు

P.C: You Tube

ఫిబ్రవరి, మార్చ్ నెలలతో పాటు సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో ఈ అడవిని చూడటానికి అనుకూలంగా ఉంటుంది. ఇక వర్షాలు పడే సమయంలో అయితే ఇక్కడ అనేక జలపాతాల అందాలను కూడా వీక్షించవచ్చు.. ఈ సమయంలో ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+