న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు ఈ రోడ్ ట్రిప్‌లు ప్లాన్ చేయండి
నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి పార్టీలు, పబ్‌లు, క్లబ్‌లు మరియు DJ నైట్‌లు అత్యంత సాధారణ మార్గాలు. అయితే, సువిశాలమైన రైడ్‌ను ప్రకృతి ఒడిలో ఆస్వాదిస్తూ.. రాబోయే నూతన సంవత్సరం 2023కి మరింత ఆహ్లాదకరమైన ఆహ్వానాన్ని అందించేందుకు రూట్ మ్యాప్ అందిస్తున్నాం.
సుందరమైన దృశ్యాలు, స్థానిక ఆహారంతోపాటు చల్లని వాతావరణం మీకు మరో అందమైన సంవత్సరానికి సరైన ప్రారంభాన్ని అందిస్తాయి. న్యూ ఇయర్ 2023ని జరుపుకోవడానికి విశాఖ చుట్టూ ఈ ఐదు రోడ్ ట్రిప్‌లను ఎంపిక చేసుకోండి.

మారేడుమిల్లి
ఏపీలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, మారేడుమిల్లి ఒక చిన్న గ్రామం. అనేక జలపాతాలు మరియు వ్యూపాయింట్‌లను కలిగి ఉంది. ఏటా ఈ సీజన్‌లో ఆహ్లాదకరమైన వాతావరణంతో, దట్టమైన అటవీ ప్రాంతం గుండా ప్రయాణించడం నూతన సంవత్సర వేడుకలకు మర్చిపోలేని ఆహ్వానాన్ని చేరువ చేస్తుంది. అంతేకాదు, రాజమండ్రి నుండి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం కూడా మీ పర్యటనలో భాగంగా సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 245 కిలోమీటర్ల దూరంలో ఉంది.

యానాం
కాకినాడ సమీపంలోని యానాం జిల్లాలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శీతాకాల విడిది కేంద్రంగా పేరుగాంచింది. అందమైన ఫ్రెంచ్ నిర్మాణాలు మరియు గోదావరిని కలిసే గౌతమీ నది యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలతో ఇక్కడి పర్యాటక అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టమే. ప్రసిద్ధ ద్రాక్షారామ దేవాలయం, హోప్ ఐలాండ్ లాంటి మరిన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను సందర్శించే అవకాశం కూడా ఉంది. ఈ ప్రాంతం విశాఖ నుంచి కేవలం 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పాపికొండలు
న్యూ ఇయర్ 2023ని జరుపుకోవడానికి వైజాగ్ చుట్టూ ఐదు రోడ్ ట్రిప్‌లలో పాపికొండలకు స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే, వ్యూపాయింట్ చేరుకునేందుకు విశాఖ నుంచి రోడ్డు ప్రయాణంతోపాటు గోదావరి నది నీటిలో సాహస యాత్ర చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రివర్ క్రూయిజ్ నేషనల్ పార్క్ సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. 1,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రయాణించేటప్పుడు కొండల అద్భుతమైన వీక్షణలను మనసారా ఆస్వాదించవచ్చు. ఈ సంవత్సరం న్యూ ఇయర్ ట్రిప్ కోసం ఈ సుందరమైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. వైజాగ్ నుంచి ఇక్కడకు సుమారు 205 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

గోపాల్‌పూర్
న్యూ ఇయర్ 2023ని జరుపుకోవడానికి వైజాగ్ నుంచి గోపాల్‌పూర్ రోడ్ అనువుగా ఉంటుంది. పొడవైన మరియు పరిశుభ్రమైన తీరప్రాంతాలు, మంత్రముగ్దులను చేసే సూర్యోదయ-సూర్యాస్తమయాలు మీకు అంతర్జాతీయ స్థాయిలో అనుభూతిని అందిస్తాయి. వైజాగ్ నుండి 285 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాల్‌పూర్ మీరు తప్పక చూడవలసిన ప్రకృతిసిద్ధమైన పర్యాటక గమ్యస్థానం. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోడ్ ట్రిప్ ప్లాన్ చేయండి. నూతన సంవత్సరాన్ని ప్రశాంతంగా ప్రారంభించేందుకు ఇక్కడి సుందరమైన రిసార్ట్‌లలో విడిది చేయండి.

జైపూర్
చారిత్రాత్మక రాజభవనాల నుండి చిల్లింగ్ హిల్ స్టేషన్ల వరకు జైపూర్‌లో అన్వేషించాల్సినవి చాలానే ఉన్నాయి. ఒడిశా కొరాపుట్ జిల్లాలో ఉన్న జైపూర్ వైజాగ్ నుండి రోడ్ ట్రిప్ కోసం ఎంపిక చేయబడిన ఉత్తమ గమ్యస్థానం. డుడుమా మరియు శక్తి జలపాతాల వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను ఇక్కడ చూడొచ్చు. ఇవి ఆన్-సైట్ క్యాంపింగ్‌కు కూడా గొప్ప ఎంపికలుగా పేరొందాయి. ఈ రైడ్‌తో నగర జీవితంలోని సందడి నుండి దూరంగా వెళ్లి, ప్రకృతితో ఒకటిగా మారడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించండి. వైజాగ్ నుండి జైపూర్ 215 కిలోమీటర్ల దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications













