Search
  • Follow NativePlanet
Share
» »అంబీ వాలీ - ఖరీదైన ప్రదేశం !

అంబీ వాలీ - ఖరీదైన ప్రదేశం !

By Mohammad

అంబీ వాలీ సహారా గ్రూప్ సంస్థ కు చెందిన వారాంతపు విహార ప్రదేశం. సుమారు పది వేల ఎకరాల్లో ఈ రిసార్ట్ విస్తరించి ఉన్నది. ఇది ఇండోర్ అండ్ ఔట్ డోర్ వినోద క్రీడలను అందిస్తున్నది. కేవలం డబ్బున్న వాళ్ళకే అని ముద్ర పడ్డ అంబీ వాలీ అందాలనూ మనమూ చూసోద్దామా ..!

ఎక్కడ ఉంది ?

అంబీ వాలీ మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణే జిల్లాలో కలదు. పూణే నుండి 87 కిలోమీటర్ల దూరంలో, ముంబై నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఈ వాలీ ఉన్నది.

అంబీ వాలీ

చిత్ర కృప : Mike

ఖర్చు ఎంత అవుతుంది ?

అంబీ వేలీ లో ఒక జంటకు తన పిల్లవాడితో రోజుకు సుమారు 15 నుండి 20 వేల రూపాయలు ఖర్చవుతుంది. అయినప్పటికి దానికి తగ్గ విలువను పొందగలరు. వీకెండ్ లలో ఆఫర్లు, స్పెషల్ ప్యాకేజీ లు ఉంటాయి.

ఏమేమి ఉన్నాయి ?

గోల్ఫ్, అడ్వెంచర్, అందమైన పచ్చిక మైదానాలు, ఆక్యా బస్, హార్స్ రైడింగ్ లు, జిమ్ లు, ఓపెన్ దియేటర్లు, సరస్సులు, లగ్జరీ హోటల్లు, వ్యూ పాయింట్ లు, స్కై డ్రైవ్, ఏరో మోడలింగ్, డ్రాగ్ రేస్, ఫౌంటైన్ అఫ్ ఫార్చూన్ , ఫ్యాషన్ షో లు, సినిమా వేడుకలు, విలాసవంతమైన రిసార్ట్ లు, హోటల్లు ఇలా వినోదాన్ని కలిగించే అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి.

అంబీ వాలీ

చిత్ర కృప : Abhishek Srivastava

సుందర ప్రదేశాలు, మాన నిర్మిత సరస్సులు

మనిషి నిర్మించిన ఈ వాలీ ప్రకృతితో కలిసిపోయి అద్భుత ప్రదేశంగా మారిపోయింది. అందమైన మరియు ఎత్తైన సుందర ప్రదేశాలు, సహజ మరియు మానవ నిర్మిత సరస్సులు ఒకెత్తైతే , సముద్ర మట్టానికి 2300 అడుగుల ఎత్తున 25 కిలోమీటర్ల పొడవున్న నీటి సరస్సు మరో ఎత్తు.

అంబీ వాలీ

చిత్ర కృప : Ryan Oriecuia

లీ బొంబార్డా

అంబీ వాలీ లోని లీ బొంబార్డా ప్రదేశం ఎంతో అనుకూలంగా, ప్రశాంతంగా ఉంటుంది. నీటి క్రీడలను ఇష్టపడే వారు, ఇక్కడ బోటింగ్ తప్పక ఆనందిస్తారు. ఒక జెట్ స్కై ని అద్దెకు తీసుకోండి .. లీ బొంబార్డా లో ప్రయానించండి. మీ వద్ద డబ్బులు అధికంగా ఉంటే డిన్నర్ కూడా చేసేయండి.

అంబీ వాలీ

చిత్ర కృప : Gushtasp

డిన్నర్

డిన్నర్ లో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ డిష్ లు లభిస్తాయి. అలాగే కాంటినెంటల్, ఓరియంటల్, మెడిటేరియన్, ఇతర పాశ్చాత్య దేశాల వంటలు వీలైతే రుచి చూడవచ్చు. మందు ఏర్పాటు కూడా ఉంటుంది.

డ్రాగ్ రేస్

కార్ల రేసింగ్, బైక్ రేసింగ్ లు అంబీ వాలీ లో నిర్వహిస్తుంటారు. ఇండియన్ కార్లు, ఫారెన్ బైక్ లు ట్రాక్ మీద వేగంతో దూసుకెళ్తుంటాయి. మొదట వచ్చిన వారికి బహుమతులు ప్రదానం చేస్తుంటారు.

అంబీ వాలీ

చిత్ర కృప : BigTrail Venezuela Academ

ఏ ఏ అడ్వెంచర్ క్రీడలు ఆడవచ్చు ?

జంగిల్ ట్రైల్స్ , పెయింట్ బాల్ షూటింగ్, జోర్బింగ్, రాపెల్లింగ్, జిప్ లైన్, రాక్ క్లైమ్బింగ్ , జంగిల్ సఫారి, ట్రెక్కింగ్ మరియు కాంపైనింగ్ లు ఆడవచ్చు.

అంబీ వాలీ

చిత్ర కృప : Devrishi Chatterjee

ఏ ఏ నీటి క్రీడలను ఆడవచ్చు ?

జెట్ స్కై , స్పీడ్ బోట్ , పొంటూన్ బోట్ , పైరేట్ షిప్, బనానా రైడ్ , వాటర్ ఫాల్ సఫారీ లు ఆడవచ్చు.

ఎలా చేరుకోవాలి ?

విమాన సౌకర్యం

ముంబై సమీప విమానాశ్రయం. అక్కడ దిగి క్యాబ్ లేదా టాక్సీ అంబీ వాలీ చేరుకోవచ్చు. 20 లక్షలు ఖర్చుపెడితే పోనురాను హెలికాఫ్టర్ సౌకర్యాన్ని అందిస్తారు ఈ రిసార్ట్ వారు ( ముంబై నుండి).

రైలు సౌకర్యం

లోనవాలా సమీప రైల్వే స్టేషన్. ముంబై, పూణే స్టేషన్ ల నుండి కూడా చేరుకోవచ్చు

రోడ్డు సౌకర్యం

రోడ్డు మర్గాన వచ్చే వారు ముంబై - పూణే రోడ్డు మీద ఉన్న అంబీ వాలీ సులభంగా చేరుకోవచ్చు.

అంబీ వాలీ

చిత్ర కృప : Sandeep Dutta

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+