Search
  • Follow NativePlanet
Share
» »రాయల్​ రాజస్థాన్​ టూర్​ ఎక్స్​ విశాఖపట్నం పేరుతో ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ..!

రాయల్​ రాజస్థాన్​ టూర్​ ఎక్స్​ విశాఖపట్నం పేరుతో ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీ..!

రాజ‌స్థాన్ పేరు విన‌గానే చాలామందికి ఆనాటి కోటలు, పురాత‌న ప్యాలెస్‌లు, సరస్సులు గుర్తుకొస్తాయి. అంతేకాదండోయ్‌, ఇటీవ‌లే అక్క‌డ ఎక్కువ‌గా జ‌రుగుతున్న డెస్టినేష‌న్ వెడ్డింగ్‌లు కూడా. అయితే, అలాంటి చారిత్ర‌క ప్ర‌దేశాల‌కు నెల‌వైన రాజ‌స్థాన్ అందాల‌ను చూడాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ విశేషాలేంటో చూసేద్దాం ప‌దండి.

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ అన్ని వసతులు ఉండే విధంగా ఈ ప్యాకేజీని ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో తీసుకొచ్చింది. ఐఆర్​సీటీసీ రాయల్​ రాజస్థాన్​ టూర్​ ఎక్స్​ విశాఖపట్నం పేరుతో ఈ ప్యాకేజీ ఆఫ‌ర్ తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా వైజాగ్ నుంచి ప్ర‌యాణం ఉంటుంది. విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్​ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం తొమ్మిది రాత్రుళ్లు, 10 పగళ్లు ఈ ప‌ర్య‌ట‌న సాగుతోంది. ఈ టూర్‌లో రాజ‌స్థాన్‌లోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలైన‌ అజ్మీర్​, బికనీర్​, జైపూర్​, జైసల్మేర్​, జోధ్​పూర్​, మౌంట్​ అబూ, పుష్కర్​, ఉదయ్​పూర్​ల‌ను చూసే అవ‌కాశం కూడా ఉంటుంది.

ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఇదే..

ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు ఉదయం 7:40 గంటలకు వైజాగ్​ ఎయిర్​పోర్ట్ నుంచి విమాన ప్ర‌యాణం ప్రారంభ‌మ‌వుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జైపూర్​ చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్​ చేసుకున్న‌ హోటల్​కు వెళ్తారు. హోట‌ల్‌లో చెకిన్​ అయ్యాక డిన్నర్​ చేసి అక్క‌డే స్టే చేయాల్సి ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ ముగించుకుని హవా మహల్​, జంతర్​ మంతర్​, సిటీ ప్యాలెస్​, అమేర్​ ఫోర్ట్​ వంటి ప్రాంతాల‌ను తిల‌కిస్తారు. ​ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి స్టే చేస్తారు. ఇక‌, మూడో రోజు బికనీర్ ప‌ర్య‌ట‌న ఉంటుంది. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక కేమెల్ బ్రీడింగ్ ఫామ్‌తో పాటు దేశ్నోకే ఆలయం కూడా దర్శించుకుంటారు. ఆ నైటంతా అక్క‌డే ఉంటారు.

royalrajasthan1

నాలుగోరోజు బ్రేక్​ఫాస్ట్​ అనంత‌రం జునాగఢ్​ కోటను సంద‌ర్శిస్తారు. అక్కడి నుంచి జైసల్మేర్‌కు వెళ్తారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు. ఇక‌, ఐదోరోజు బ్రేక్​ఫాస్ట్​ అనంత‌రం జోధ్​పూర్​ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తారు. అక్క‌డికి స‌మీపంలో ఉన్న జైసల్మేర్​ కోట, పట్వోన్ కి హవేలీ అండ్​ వార్​ మ్యూజియం వంటి ప్ర‌దేశాలను సంద‌ర్శిస్తారు. ఆ రాత్రికి జోధ్​పూర్​లోనే స్టేయింగ్ ఉంటుంది. ఆరో రోజు ఉమైద్​ భవన్​ మ్యూజియం, మెహరన్​గఢ్​ కోట విజిటింగ్ ఉంటుంది. అనంత‌రం ఉదయ్​పూర్​కు వెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక ఆ నైట్ అక్క‌డే స్టే చేస్తారు. ఇక‌, ఏడో రోజు అల్పాహారం ముగించుకుని మౌంట్​ అబూ, నక్కిలేక్​, దిల్వారా టెంపుల్​ కాంప్లెక్స్​ సంద‌ర్శిస్తారు. తిరిగి ఉదయ్​పూర్​ చేరుకుంటారు. ఎనిమిదో రోజు సిటీ ప్యాలెస్​, ఎక్లింగ్జీ ప‌ర్య‌ట‌న ఉంటుంది. అక్కడి నుంచి పుష్కర్​కు ప్ర‌యాణం ఉంటుంది. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి, నైటంతా అక్కడే స్టే చేస్తారు. తొమ్మిదో రోజు పుష్కర్​ టెంపుల్​ ద‌ర్శ‌నం ఉంటుంది. అక్కడి నుంచి తిరిగి జైపూర్​ వెళ్తారు. పదోరోజు ఉదయం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి ఎయిర్​పోర్ట్​కు వెళ్తారు. మధ్యాహ్నం వైజాగ్​కు విమాన ప్ర‌యాణం ఉంటుంది. అదేరోజు రాత్రి విశాఖపట్నం చేరుకోవడంతో ఈ టూర్​ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధ‌ర‌లివే..

ఈ ప్యాకేజీలో భాగంగా ధ‌ర‌లిలా ఉన్నాయి. కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.68,800 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్​ ఆక్యూపెన్సీకయితే రూ.51,490 చెల్లించాలి. ట్రిపుల్​ ఆక్యూపెన్సీ అయితే రూ.48,630 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.40,290 ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.37,300 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్​ 17వ తేదీన ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది.

More News

Read more about: irctc tour package rajasthan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+