Search
  • Follow NativePlanet
Share
» »మీరు ప్రేమించినవారు మీకు దక్కేలా చేసే దేవాలయం ఇది !

మీరు ప్రేమించినవారు మీకు దక్కేలా చేసే దేవాలయం ఇది !

ఒక మగవాడికి ఒక స్త్రీ అనేది ఒకే దైవం అనేది సృష్టి ధర్మం. ఒక వయస్సుకి వచ్చినతర్వాత తమ జీవితంగురించి కలలుకనేది సాధారణమైన విషయం.

By Venkatakarunasri

ఒక మగవాడికి ఒక స్త్రీ అనేది ఒకే దైవం అనేది సృష్టి ధర్మం. ఒక వయస్సుకి వచ్చినతర్వాత తమ జీవితంగురించి కలలుకనేది సాధారణమైన విషయం.అదే విధంగా తాము ప్రేమించినవారు దూరమైతే అందులో వున్న కష్టం అనుభవించిన వారికి తెలుస్తుంది.ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా కూడా ఇష్టపడ్డ వారతోనేతే జీవితంగడపాలని అనుకుంటారు.

ప్రేమవిషయానికొస్తే ప్రేమికులు అనేక దేవాలయాలకు వెళ్లి తాము ప్రేమిస్తున్న వారితోనే వివాహాన్ని కరుణించు అని వేడుకొనుట సహజం. ప్రేమికులు ఒక స్థాయికి చేరుకున్నప్పుడు ధార్మికత ఆవరిస్తుంది. అయితే ఇక్కడొక దేవాలయం వుంది. ఆ దేవాలయంలో స్వామి మనం ప్రేమించేవారితోనే, మనం ఇష్టపడే వారితోనే వివాహంభాగ్యాన్ని ప్రసాదిస్తాడంట.అయితే ఆ దేవాలయం ఎక్కడ వుంది?ఆ దేవాలయం మహత్యం ఏమిటి? అనే దానిని గురించి సంక్షిప్తంగా వ్యాసంలో తెలుసుకుందాం.

దేవాలయం పేరు?

దేవాలయం పేరు?

ఈ దేవాలయం యొక్క పేరు శక్తివనేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలోని మాహాశివుడు లింగాస్వరూపంలో వెలసియున్నాడు. ఈ మహిమాన్వితమైన దేవాలయానికి వేలకొలది భక్తులు సందర్శిస్తూవుంటారు. ఈ దేవాలయం జీవితాన్ని కరుణించే శక్తియుత దేవాలయం అని ప్రసిద్ధిపొందినది.

pc: Rsmn

భక్తి, శ్రద్ధ

భక్తి, శ్రద్ధ

ఇక్కడి వచ్చే భక్తులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యంగా చేయవలసినది శివుని అత్యంత భక్తి, శ్రద్ధలతో ఆరాధించటం. ఈవిధంగా ప్రార్థించిన వారికి మాత్రం తమ కోరికలు,ఇష్టాలు నెరవేరుతాయి అని అక్కడి భక్తుల నమ్మకం.

pc: Sridharp

ఉదాహరణలు

ఉదాహరణలు

ఈ దేవాలయం విశేషమేమంటే ఇక్కడి మహిమాన్వితమైన శివుడు తాము ప్రేమించిన వారినే జీవిత భాగస్వామిని అందిస్తాడు. ఈ విధంగా ప్రేమించిన వారినే భాగస్వామిగా పొందిన ఎన్నో ఉదాహరణలు ఇక్కడున్నాయి. తాము అనుకున్నది జరుగుతుందని విశ్వాసం వల్ల అనేకమంది భక్తులు ఈ స్వామిని పూజించటానికి దేవాలయాన్ని సందర్శిస్తారు.

Rsmn

కారణమేమిటి?

కారణమేమిటి?

ఇంతకీ ఈ దేవాలయం జీవితాన్ని కరుణించటానికి కారణం ఏమిటి? ఇక్కడ వున్న రహస్యం ఏమిటి? అనేటటువంటి ప్రశ్నలకు జవాబులు ఇక్కడ వున్నాయి.అదేమిటో తెలుసుకుందాం.

శివపార్వతులు

శివపార్వతులు

పార్వతి పెరిగి పెద్దదవుతుంది.ఒక రోజు శివున్ని చూస్తుంది.అతనే తన భర్త అని భావించి ప్రతి క్షణం మహాశివుని గురించి గురించి ఆలోచిస్తూవుంటుంది.పార్వతి శివునిప్రేమలోనే తన్మయత్వంతోఅతనినే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది.

తపస్సు

తపస్సు

శివుణ్ణి వరించటం మాటలలో చెప్పినంత సులభంకాదు. ఆ విధంగా పార్వతి శివుని పెళ్లి చేసుకోవాలని ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది. ఆ పార్వతి దేవి తపస్సు చేసిన స్థలమే ఇక్కడున్న దేవాలయంగా వెలసింది. ఆ తల్లి చేసిన తపస్సు యొక్క ఫలితమే ఆ స్థలం ఇంత ప్రసిద్ధిగాంచుటకు కారణమైంది. క్రమంగా ...

దృఢ సంకల్పం

దృఢ సంకల్పం

క్రమంగా తపస్సు తీవ్రత మరింత పుంజుకుంది. ఒకే కాలిపై నిలిచి కఠినమైన తపస్సును ఆచరిస్తుంది. ఇది గమనించిన శివుడు ప్రసన్నుడౌతాడు.

అగ్ని రూపంలో దర్శనం

అగ్ని రూపంలో దర్శనం

ప్రసన్నమైనాకూడా ప్రత్యక్షం కాలేదు. పార్వతీ దేవి మాత్రం కదలకుండా అలాగే వుంది. చివరికి శివుడు తేజోమయమైన అగ్నిరూపంలో దర్శనమిస్తాడు.శివుణ్ణి అలా దర్శించిన పార్వతి కొంచెం కూడా భయపడకుండా ఆ అగ్నిరూపాన్నే కౌగిలించుకుంటుంది.

వివాహం

వివాహం

పార్వతీ ప్రేమకు మెచ్చిన మహాశివుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై పార్వతిదేవిని వివాహంచేసుకుంటాడు.ఈ విధంగా ఆది శక్తియైన పార్వతి దేవి తాను ఇష్టపడిన శివుని తన పతిగా దక్కించుకుంటుంది.

అదే విధంగా ఈ దేవాలయానికి వచ్చి శ్రద్ధ, భక్తితో శివుని ఆరాధించినవారికి వారు ఇష్టపడి ప్రేమించినవారిని ప్రసాదిస్తారు.

శివలింగం ఏ విధంగా వుంది

శివలింగం ఏ విధంగా వుంది

ఇక్కడి శివలింగం కథలో చెప్పినట్లుగానే కనపడుతుంది.అంటే ఇక్కడున్న శివ లింగం పార్వతీదేవి గట్టిగా కౌగిలించుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ విధంగా ఈ దేవాలయం ఎంతో మహత్యాన్ని కలిగియున్నది అని చెప్పవచ్చును.

ఈ మహిమాన్విత దేవాలయం ఎక్కడ వుంది?

ఈ మహిమాన్విత దేవాలయం ఎక్కడ వుంది?

ఇంతకీ ఈ దేవాలయం వుండేది ఎక్కడ అని ఆలోచిస్తున్నారా? ఈ దేవాలయముండేది తమిళనాడు రాష్ట్రంలో తంజావూరుజిల్లాలో కుంభకోణం పట్టణం నుండి సుమారు 7కిమీ ల దూరంలో వున్న తిరుశక్తిమట్టం అనే గ్రామంలో. దేవాలయం పేరు శక్తివనేశ్వర దేవాలయం.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ దేవాలయానికి సమీపంలో వున్న రైల్వేస్టేషన్ ఏదంటే అది తమిళ నాడు రాష్ట్రంలోని కుంభకోణం రైల్వేస్టేషన్. ఈ దేవాలయానికి సమీప విమానాశ్రయం ఏదంటే అది తంజావూరు విమానాశ్రయం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+