Search
  • Follow NativePlanet
Share
» » సంబల్పూర్ - ఒకప్పటి వజ్రాల గని !

సంబల్పూర్ - ఒకప్పటి వజ్రాల గని !

సంబల్పూర్ చరిత్ర, ఆధునికతల మేళవింపు. ప్రస్తుతం సంబల్పూర్ గా పిలిచే భూమి అనేక మంది పాలకులు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎన్నో విభాగాలు, విలీనాలను చవిచూసింది. విభిన్న ప్రభుత్వాలు వదిలి వెళ్ళిన సాంస్కృతిక ఆనవాళ్ళ చారిత్రక అనుభవాల ఒక మిశ్రమంలా కలిసి ప్రస్తుతం ఉన్న సంబల్పూర్ స్థితికి దారితీసింది.

చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్

చిపిలిమ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్

ఓడిషా లోని పశ్చిమ అర్ధగోళ౦లో ఉన్న ఈ జిల్లా సాంస్కృతిక సంపదతో, పచ్చటి భూభాగాలతో వెచ్చని ఆతిద్యమిచ్చే ప్రజలతో స్వాగతం పలుకుతుంది. ఇక్కడ కల చిపిలిమా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ రాష్ట్ర అవసరాలకే కాక ఇతర రాష్ట్రాలకు సైతం పంపిణీ చేయబడుతుంది.

వజ్రాల వాణిజ్యం, తాజ్-ఏ- మహ్ లబించిన భూమి,

వజ్రాల వాణిజ్యం, తాజ్-ఏ- మహ్ లబించిన భూమి,

సంబల్పూర్ లో పర్యాటకరంగ౦ ఒక కొత్త దృగ్విషయమేమి కాదు. శతాబ్దాల క్రితం సంబల్పూర్ అక్కడి వజ్రాలకు ప్రసిద్ది చెందింది. వజ్రాల వాణిజ్య మార్గంలో అది ఒక ముఖ్య కేంద్రం. మహానది లోనూ, చుట్టుపక్కల పొందిన వజ్రాలను అనేకమంది సేకరణ దారులు, ఔత్సాహికులచే ఎంతగానో ఆపేక్షించారు, ఎందుకంటే ఇవి ప్రపంచంలోని వజ్రాలలో ఉత్తమమైనవిగా (స్వచ్చత పరంగా) పరిగణిస్తారు.

"తాజ్-ఏ-మహ్" (సాహిత్యపరంగా చంద్రుని కిరీటం అని అర్ధం) వజ్రం

సంబల్పూర్ లో దొరికిన రంగులేని 146 క్యారెట్ల "తాజ్-ఏ-మహ్" (సాహిత్యపరంగా చంద్రుని కిరీటం అని అర్ధం) వజ్రం ఈ ప్రాంతంలో దొరికే వజ్రాల స్వచ్ఛతకు నిదర్శనంగా నిలిచింది.

సంబల్పూర్ - చేనేత నగరం

సంబల్పూర్ - చేనేత నగరం

స్త్రీల సాంప్రదాయ వస్త్రాలు, సంబల్పూర్ చీర, ఈ ప్రాంతంలోని ప్రత్యేకత ఉన్న అందమైన సృష్టి. వస్త్రంలో టై అండ్ డై ప్రక్రియ ద్వారా క్లిష్టమైన నమూనా తయారైన తర్వాత నూలుతో కలిపి వస్త్రం తయారౌతుంది. క్లిష్టమైన ఆకృతులు, ప్రామాణికమైన సంబల్ చీరలు దాచిపెట్టుకోదగిన సంపద వంటి నిజమైన విలువును కల్గి ఉన్నాయి. ఇక్కత్ లేదా బంధకల చీరలు చరిత్ర, కళ లానే ప్రసిద్ధి చెందాయి. చీరలతో బాటుగా బంధకల వస్త్రం సల్వార్లు, డ్రస్సులు, తువ్వాలు తయారుచేయడానికి ముడి సరుకుగా లభ్యమౌతుంది. అయితే, కొనుగోలు సమయంలో నకిలీ ఉత్పత్తుల పట్ల జాగ్రత్త వహించండి.

 చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

చుట్టూ ఉన్న పర్యాటక ప్రదేశాలు

సంబల్పూర్ లో పర్యటక రంగం అనేక కారణాల వలన కొనసాగుతుంది. హీరాకుడ్ ఆనకట్ట, సమలేశ్వరి ఆలయం, హుమా వాలు ఆలయం, చిపిలిమ జలవిద్యుత్ కేంద్రం, ఘంటేశ్వరి ఆలయం, మరీ ముఖ్యంగా మహానది సంబల్పూర్ పర్యాటక రంగానికి ఊతం ఇస్తున్నాయి. దేబిఘర్ వన్యప్రాణి అభయారణ్యం ఈ ప్రాంతం లోని ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థాన౦.
పాత కొత్తల సమ్మేళనం!

వృక్ష, జంతు జాలాలు

వృక్ష, జంతు జాలాలు

వైవిధ్యభరితమైన వృక్ష, జంతు జాలలతో ఇది పొడి ఆకురాల్చు అడవులకు ప్రసిద్ధి. క్యాటిల్ ద్వీపం, ఉషాకోటి, కంధర, హతిబరి, విక్రంఖోల్ సంబల్పూర్ లోని ఇతర ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ స్థలాలు.

ఒక పర్యాటక స్వర్గం

ఒక పర్యాటక స్వర్గం

ప్రత్యేకమైన ప్రాంతాలు, ధ్వనులు, రుచులు, అనుభూతులు అందిస్తున్న సంబల్పూర్ ఒక పర్యాటక స్వర్గం అంటే ఆశ్చర్యం కలగదు. సంబల్పూర్ సందర్శనకు సెప్టెంబర్, మార్చి మధ్య కాలం ఉత్తమమైనది. సంబల్పూర్ కు చక్కటి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+