Search
  • Follow NativePlanet
Share
» »శ్రావణ మాసం స్పెషల్ : మహిమలు గల ఉరుకుంద క్షేత్రం !

శ్రావణ మాసం స్పెషల్ : మహిమలు గల ఉరుకుంద క్షేత్రం !

By Mohammad

ఉరుకుంద ఈరన్న స్వామి భక్తులపాలిట నిజంగా కొంగుబంగారమే! కోరిన వెంటనే భక్తుల కోర్కెలను తీర్చే దేవుడిగా ఈరన్న స్వామికి పేరు. ప్రస్తుతం శ్రావణ మాసం సమీపిస్తుండటంతో ఉరుకుంద స్వామిని దర్శించుకొనేవారి సంఖ్య అధికంగా ఉండబోతోంది. స్వామి వారికి ఈ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు నెల రోజులపాటు స్వామి వారికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు.

స్వామివారికి ఎంతో ఇష్టమైన సోమ, గురువారాలలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. శ్రావణమాసం 3 వ సోమవారం నాడు ఏకంగా పాతిక లక్షల పైబడి భక్తులు దర్శించుకుంటారంటే అతిశయోక్తి కాదేమో ! అదొక్కరోజే స్వామివారి హుండీ 2 కోట్లు దాటుతుంది.

ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం

ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం

చిత్ర కృప : Mn Prathap

ఎక్కడ ఉంది ? ఎలా వెళ్ళాలి ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఆదోనికి చేరువలో గల కౌతాళం మండలంలోని ఉరుకుంద గ్రామంలో కలదు.

కర్నూలు నుండి వచ్చేవారు

కర్నూల్ నుండి ఉరుకుంద 113 km ల దూరంలో కలదు. సొంతవాహనాలలో వచ్చే వారు కర్నూలు --> కోడుమూరు --> గోనెగొండ్ల -->ఎమ్మిగనూరు --> పెద్ద తుంబళం --> ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం చేరుకోవచ్చు.

ఆదోని మీదుగా వచ్చేవారు

ఆదోని నుండి ఉరుకుంద 50 km ల దూరంలో కలదు. సొంత వాహనాల మీదుగా వచ్చేవారు ఆదోని --> ఎరిగేరి --> కామవరం --> ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం చేరుకోవచ్చు. మంత్రాలయం నుండి ఉరుకుంద క్షేత్రం 35 km ల దూరంలో కలదు.

ఆదోని కి బళ్ళారి, రాయచూరు, కర్నూలు తదితర పట్టణాల నుండి చక్కటి రోడ్డు వ్యవస్థ మరియు హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు, హుబ్లీ, గుంతకల్ తదితర ప్రాంతాల నుండి చక్కటి రైలు మార్గాన్ని కలిగి ఉన్నది. కనుక రైళ్లలో ఎక్కి ఆదోని రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి ఆటోలో బస్ స్టాండ్ చేరుకోవచ్చు. ఆదోని నుండి ఉరుకుంద క్షేత్రానికి బస్సులు కలవు.

ఆలయ ప్రాంగణంలోని విగ్రహం

ఆలయ ప్రాంగణంలోని విగ్రహం

చిత్ర కృప : Govindudu Andarivadu

శ్రావణ మాసం సమయంలో నెలరోజుల పాటు బళ్ళారి, రాయచూరు, శివగుప్ప, సింధనూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ నడుస్తుంటాయి.

ఈరన్న స్వామి చరిత్ర మరియు మహిమలు

కౌతాళం మండలానికి కేవలం 6 km ల దూరంలో ఉన్న ఈరన్న స్వామి (నరసింహ స్వామి) కి నిర్దిష్ట ఆకారం అంటూ లేదు. ఈయనొక సిద్ధ పురుషుడని, యోగి అని, దేవదూత అని స్థానికులు చెబుతారు. బాలబ్రహ్మచారిగా స్వామి వారు అశ్వద్ధ వృక్షం కింద కూర్చొని తపస్సు చేసేవాడని సమాధి ముద్రలో నరసింహస్వామిని కీర్తిస్తూ గడిపేవారని అంటారు. నిరాకారుడైన స్వామి అశ్వద్ధ వృక్ష స్వరూపుడిగా పూజలు అందుకుంటున్నాడు.

నిరాకారుడైన స్వామి రూపం

నిరాకారుడైన స్వామి రూపం

చిత్ర కృప : urukunda swamy

ఉరుకుంద స్వామిని కొలవనివారు భక్తులు కొట్టిన కొబ్బరి తినాలంటే భయపడతారు. కొబ్బరి తింటే ఈరన్న స్వామి వదలడని, కొలిచి తీరాల్సిందేనని అందువల్ల ఆ స్వామి నిప్పులాంటి దేవుడని భక్తుల విశ్వాసం.

దర్శనీయ స్థలాలు

ఉరుకుంద ఈరన్న స్వామి ని దర్శించుకున్న వారు ఆలయం వెనుక ఉన్న ఆంజనేయస్వామి, నాగుల స్వామి, బసవన్న కట్ట ను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఉరుకుందకు 3 km ల దూరంలో ఉన్న బుడుములదొడ్డి ఆంజనేయస్వామి దేవాలయాన్ని అత్యంత పురాతమైన ఆలయం గా భావిస్తారు. ఉరుకుంద నుండి మంత్రాలయం వెళ్లే మార్గంలో ఈ గుండి కనిపిస్తుంది. సమయం ఉండే ఉరుకుంద కు 21 km ల దూరంలో గల రామలింగేశ్వర స్వామీ ఆలయం కూడా చూడదగ్గదే!

నిత్య అన్నదాన సన్నిధి

నిత్య అన్నదాన సన్నిధి

చిత్ర కృప : otesh Kolli

నిత్యాన్నదానము

ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం వద్ద నిత్యాన్నదానం ఆటంకం లేకుండా కొనసాగుతుంది. ఇందుకోసం ప్రత్యేక భవనాన్ని సువిశాల మైదానంలో నిర్మించారు. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు అన్నదానంలో పాల్గొంటారు.

వసతి, నీటి సదుపాయం

భక్తుల సహకారంతో నిర్మించిన 160 గదులు వసతికై అందుబాటులో ఉన్నాయి. తుంగభద్ర దిగువ కాలువ ఆలయానికి సమీపంలోనే ప్రవహిస్తుంది కనుక నీటి ఎద్దడి అతంగా కనపడదు. భక్తుల దాహార్తి తీర్చటానికి ఉచిత సురక్షిత తాగునీటి సౌకర్యం, మినరల్ వాటర్ ప్లాంట్ సౌకర్యం ఏర్పాటుచేశారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+