Search
  • Follow NativePlanet
Share
» »తీర్థయాత్ర : మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం !!

తీర్థయాత్ర : మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం !!

శ్రీకాకుళంలో అతిపురాత దేవాలయాల్లో మందసలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయం చెప్పుకోదగ్గది.

By Mohammad

శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం. సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి. వైజాగ్, విజయనగరం, ఒడిశా - ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలతో ఈ ప్రదేశం చక్కటి రోడ్డు మార్గాన్ని కలిగియున్నది.

దేవాలయ సముదాయం మరియు ధ్వజస్తంభం

దేవాలయ సముదాయం మరియు ధ్వజస్తంభం

చిత్రకృప : Padhysrinibas

వాసుదేవాలయం-చరిత్ర

ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రములను పొంది ఉన్నారట. మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్నచిన్నజీయరు స్వామివారి గురువు పెద్ద జీయరు స్వామి వారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది.

నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కల వచ్చింది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్నశ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారము చేయించి, వారు కూడా చేసినారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.

వాసుదేవుని దివ్యసన్నిధి

వాసుదేవుని దివ్య సన్నిధి

వాసుదేవుని దివ్య సన్నిధి

కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి అయ్యి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది.సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది. ప్రస్తుతం కేవలం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయ గోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయింది.

చినజీయరు ఆగమనం-పునర్వైభవం

1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామి వారు ఆలయసందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్నిపునర్నిర్మింపచేసారు. గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒడిషా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాలు

సేవా టైమింగ్స్ :

దర్శనం టైమింగ్స్ : 5:30 AM - 11:00 AM, సాయంత్రం - 4:30 PM - 7:00 PM.
ఉదయం - 5:00 AM సుప్రభాత సేవ, 11:00 AM కవత బంధనం
సాయంత్రం - 4:30 PM కవత ఉద్గతన

బ్రహ్మోత్సవాలు

ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక సందర్శించతగినది.

ఇది కూడా చదవండి : కొలనుపాక - ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఏకైక సరస్వతి దేవాలయం !

ఇంకా ఇక్కడ చూడవలసినవి : రాజావారి కోట, పక్కనేవున్న చిట్టడవి అందులోని అమ్మవారి గుడి, మహేంద్రగిరి వద్ద గల గుహాసముదాయం, వాసుదేవ ఆలయం పక్కన ఉన్న శివాలయం

చేరుకునే మార్గం

మందసకు దగ్గరలో ఉన్న స్టేషను పలాస (18 కి.మీ). మద్రాసు-కలకత్తా జాతీయ రహదారి 5 నుండి కేవలం 5 కి.మీ. దూరం. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కి.మీ. విశాఖపట్నం నుండి 200 కి.మీ. వైజాగ్, మందస కు సమీప విమానాశ్రయం (209 కి.మీ.).

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+