Search
  • Follow NativePlanet
Share
» »కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!

కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!

"ఆంధ్రప్రదేశ్ బాసర" గా వర్ధిల్లుతున్న కొలను భారతి సమాచారం

By Mohammad

క్షేత్రం : కొలను భారతి

భక్తులు పిలుచుకొనేది : 'ఆంధ్రా బాసర'

జిల్లా : కర్నూలు

కొలను భారతి నుండి : ఆత్మకూరు - 20 KM, శ్రీశైలం - 130 KM, కర్నూలు - 88 KM, నంద్యాల - 70 KM, హైదరాబాద్- 300 KM, విజయవాడ - 293 KM

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలంటే బాసర వెళ్ళి వచ్చేవారు. కానీ ఇప్పుడు బాసర తెలంగాణ రాష్ట్రంలో ఉండిపోయింది. ఎంతైనా రాష్ట్రాలు విడిపోయాయి కదా !! అంతదూరం వెళ్ళాలా అని కొంతమందికి అనిపించవచ్చు. అలాంటి వారికి 'ఆంధ్ర బాసర' గా వెలుగొందుతున్నది కొలను భారతి.

ఇది ఆంధ్ర ప్రదేశ్ లో పేరుగాంచిన సరస్వతి దేవి దేవాలయం. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రములలో మొదటి నామము ఐన శ్రీ భారతి పేరుతో వెలసిన క్షేత్రమే కొలను భారతి క్షేత్రము.

ఇది కూడా చదవండి : శ్రీశైలంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశాలు !

క్షేత్ర విశేషాలు

కొలను ప్రక్కన వెలసిన భారతి కావున కొలను భారతిగా పిలువబడుతుంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయటానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థ ము అమ్మవారు ఇక్కడకు వచ్చి స్వయంభువుగా నెలవైంది.

ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నది. ఆత్మకూరు నుండి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చును. పరిసర ప్రాంతలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఇక్కడ సమీపంలో ఒక చిన్న జలపాతం ఉంది.

దిగువ ఫోటోల చిత్రకృప, కొలనుభారతి ప్రధాన వెబ్సైటు నుండి తీసుకోబడినది.

నల్లమలలో

నల్లమలలో

రాజుల కాలంలో నిర్మించిన శివాలయాలు శిథిలావస్తలో మనకు దర్శనమిస్తాయి. దేశంలో బహు అరుదుగా ఉండే సరస్వతి దేవాలయాల్లో కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి మండలంలో నల్లమలలో వెలసి జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువై ఉన్న కొలను భారతి క్షేత్రం ప్రసిద్ధి గాంచింది.

ఆనవాయితి

ఆనవాయితి

రాయలసీమ పరిధిలో ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుని ఉండడంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా నిర్వహించడం ఆనవాయితి.

కోవెలలు

కోవెలలు

కర్నూలు జిల్లాలోని కొత్తపల్లె మండలములో శ్రీ కొలను భారతీ దేవి అమ్మవారు ఉన్నారు. నల్లమల కొండలలో "చారు ఘోషిణీ నది ఒడ్డున" వెలసిన ఈ కోవెలలు అతి ప్రాచీనమైనవి.

వరుణ తీర్ధము

వరుణ తీర్ధము

ఇచ్చట,"శ్రీ చక్ర సంచారిణీ" యంత్రములో ' కొలను భారతి' ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ క్షేత్రము "వరుణ తీర్ధము"గా ప్రసిద్ధి గాంచెను. శ్రీ శైలమునకు పశ్చిమ దిక్కులో ఉన్న ఈ' కొలను భారతీ అమ్మ వారు', చేతిలో వేదములను ధరించి ఉన్న "పుస్తక పాణి"గా కనపడుతుంది.

ఏడు శివాలయాలు

ఏడు శివాలయాలు

కొలను భారతి ప్రధాన దేవాలయం చేరువలో ఏడు శివాలయాలు ఉన్నాయి. అంతేనా ఇక్కడ జనార్థన స్వామి దేవాలయము కూడా తప్పక దర్శించాలి. ఏడు శివాలయాలూ ఎర్రటి ఇసుక రాయితో నిర్మించి ఉండటం గమనించవచ్చు.

చాళుక్యుల కాలం

చాళుక్యుల కాలం

వాటిని చూస్తే ... ఇవి చాళుక్యుల కాలం నాటి ఆలయాలు అని అనుకుంటాం కానీ దానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఆ శివాలయాలు శిధిలావస్థ లో ఉంటే .. ఇటీవలే వాటిని పునరుద్ధరించారు. ఒక్కో గుడిలో ఒక్కో శివలింగం ప్రతిష్టించారు.

పండుగలు

పండుగలు

కొలను భారతి లో ఉత్సవాలు, పండుగలు ఘనంగా జరుగుతాయి. స్థానికంగా ఉండే ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాలవారు ఆ సమయాలలో ఎడ్ల బండీలు కట్టుకొని వచ్చి చూసి వెళుతుంటారు. కార్తీక మాసం, నవరాతి ఉత్సవాలు, మహా శివరాత్రి ఇక్కడ జరిగే ప్రధాన పండుగలు.

ఉత్సవాలు

ఉత్సవాలు

మాఘ శుద్ధ పంచమి నాడు దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. కార్తీకంలో ప్రత్యేక పూజలు జరుపుతారు మరియు పౌర్ణమి నాడు విశేష పూజ నిర్వహిస్తారు. మహా శివరాత్రి నాడు జాగరణ ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నాయి.

ఆలయాన్ని దర్శించుకొనేటప్పుడు గుర్తించుకోవలసినవి

ఆలయాన్ని దర్శించుకొనేటప్పుడు గుర్తించుకోవలసినవి

  • ఆలయాన్ని దర్శించుకొనేటప్పుడు గుర్తించుకోవలసినవి
  • సిగరెట్టు కాల్చరాదు.
  • మద్యం సేవించరాదు.
  • ఆలయం వద్ద మాసం లభించదు/ తినకూడదు.
  • కార్తీకమాసంలో వన భోజనాలు జరుగుతాయి.
  • వెంట వాటర్ బాటిల్స్, ఆహార పొట్లాలు తీసుకెళితే ఇంకొంత సేపు అక్కడ గడపవచ్చు.
  • కాదూకూడదు అని నియమాలను అతిక్రమించారా !! అక్కడ ఉన్న తేనెటీగలు మీపై దాడి చేస్తాయి (కొందరికి అలా జరిగింది కూడా). కనుక భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శించేటప్పుడు పరిశుభ్రంగా వెళ్ళాలి.

    కొలను భారతి దేవాలయం ఎలా చేరుకోవాలి ?

    కొలను భారతి దేవాలయం ఎలా చేరుకోవాలి ?

    కర్నూలు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లె మండల కేంద్రం నుండి శివపురము అనే గ్రామనికి ముందుగా భక్తులు చేరుకోవాలి. ఇది తారు రోడ్డు. గ్రామానికి చేరుకున్నాక, అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం మెటల్ రోడ్డులో ప్రయాణించి కొలనుభారతి దేవాలయం చేరుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+