Search
  • Follow NativePlanet
Share
» »పరమశివుడికే గురువైన ఆ చిట్టి తండ్రి కొలువైన క్షేత్ర దర్శనంతో

పరమశివుడికే గురువైన ఆ చిట్టి తండ్రి కొలువైన క్షేత్ర దర్శనంతో

స్వామి మలై లోని స్వామినాథన్ దేవాలయానికి సంబంధించిన కథనం.

త్రిమూర్తుల్లో ఒకరైన పరమశివుడికి కుమారస్వామి గురువుగా మారాడు. ఈ సష్టికి మూలకారమైన ఓంకారనాదానికి అర్థం విడమరిచి చెప్పాడు. అంతకు ముందు బ్రహ్మను తమిళవాసులు మురుగన్ గా పిలుచుకొనే ఆ కుమారస్వామి ఇక్కడే ఖైదు చేశాడు. ఇందుకు సంబంధించిన ఘట్టాలన్నీ తమిళనాడులోని కుంభకోణానికి దగ్గరగా ఉన్న ఓ పరమపవిత్రమైన క్షేత్రంలో చోటుచేసుకొన్నాయి. అందుకే ఈ క్షేత్ర సందర్శనంతో అమితమైన తెలివితేటలు జ్జానం వస్తాయని చెబుతారు. ఈ క్షేత్ర సందర్శనకు భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలోని సరస్సుల్లో స్నానంచేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని నమ్ముతారు. సముద్రమట్టానికి దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి కిందికి చూస్తే ప్రకతి అందాలు కనువిందు చేస్తాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి ఇష్టమైన, కొలువైన ప్రదేశాలు ఆరు. అవి వరుసగా తిరుత్తణి, స్వామిమలై, పళని, పఝుముడిదిర్ చోలై, తిరుపురకుండ్రం, తిరుచెందుర్. ఈ ఆరు పుణ్యక్షేత్రాలకు ఆరు విభిన్న పురాణ సంబంధ కథనాలు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనది స్వామిమలై.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ తమిళనాట మురుగన్ గా భక్తులచేత నీరాజనాలు అందుకొనే ఆ కుమార స్వామి తన తండ్రికే గురువయ్యాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం స`ష్టి కర్త అయిన బ్రహ్మ ఒకసారి కైలాసానికి బయలుదేరాడు.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

మార్గమధ్యలో ఆయనకు కుమారస్వామి కనిపించాడు. ఈ మురుగన్ బ్రహ్మణు ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్థం చెప్పమని ఆ బ్రహ్మను అడిగాడు. అయితే ఆ స`ష్టి కర్త అయిన బ్రహ్మ సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో కుమారస్వామికి కోపం వచ్చి ఆ బ్రహ్మను బందీ చేశాడు.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఈ పరిమాణంతో స`ష్టికార్యం ఆగిపోయింది. ముల్లోకాలు అల్లకల్లోలం అయ్యాయి. దీంతో దేవతలందరూ కలిసి కుమారస్వామి వద్దకు వెళ్లి బ్రహ్మను వదిలివేయాలని చెప్పారు. అయితే అందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో దేవతలంతా కలిసి కుమారస్వామి తండ్రి అయిన పరమేశ్వరుడి దగ్గరకు వెళ్లి పరిస్థితి మొత్తం వివరించి రక్షించాల్సిందిగా వేడుకొన్నారు.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

దీంతో స్వయంగా పరమశివుడే రంగంలోకి దిగాడు. కుమారస్వామిని కలుసుకొని బ్రహ్మను బంది నుంచి విముక్తి చేయాల్సిందిగా సూచించాడు. అంతేకాకుండా బ్రహ్మ ఓంకారానికి అర్థం నీకు తెలుగా అని కుమారస్వామిని ప్రశ్నించాడు. దీంతో కుమారస్వామి తాను ఆ ఓంకారానికి అర్థం చెబుతానని అయితే మీరు దాన్ని శ్రద్ధగా వినాలని సూచిస్తాడు.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

కుమారుడే తనకు గురువగా మారి తెలియని విషయాలను చెబుతానంటే ఏ తండ్రి సంతోషించడు చెప్పండి. ఇందుకు పరమశివుడు అతీతం కాదు. కుమారస్వామి కోరికను మన్నించి శిష్యుడిగా మారి ఆ ఓంకార శబ్దానికి అర్థం తెలుసుకొంటాడు. అటు పై కుమారస్వామి బ్రహ్మను కూడా విడుదల చేస్తాడు.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఈ మొత్తం ఘట్టం జరిగిన ప్రదేశం ప్రస్తుతం తమిళనాడులోని స్వామిమలైలోనే. ఇక పరమశివుడు జగత్తుకే స్వామి, ఆ స్వామికే కుమారస్వామి గురువై, నాథుడయ్యాడు. అందువల్లే ఈ క్షేత్రంలోని కుమారస్వామికి స్వామినాథుడని, ఇక ఈ క్షేత్రానికి స్వామి మలై అని పేరు వచ్చింది.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీనిని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భగుడి బయట ఉన్న మండపంలో ఆయన విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆలయం చిన్న గుట్ట పై ఉంటుంది. దీనిని చేరుకోవడానికి 60 మెట్లు ఎక్కి వెళ్లాలి.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఈ అరవై మెట్లూ అరవై తమిళ సంవత్సరాలకు ప్రతీక. అదే విధంగా ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క దేవత అధిదేవతగా ఉంటుంది. ఆయా ఏడాదిలో ఆ అధిదేవత ఇక్కడి స్వామివారిని కొలుస్తుందని స్థానిక కథనం. ఆయా మెట్టు పై ఆ సంవత్సరం, ఆ సంవత్సర అధిదేవత పేరు రాయబడి ఉంటుంది.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఈ మెట్ల తోవలో 32 మెట్లకు చేరుకోవగానే కుడివైపున కుమారస్వామి శివుడికి ఓంకారనాదం అర్థాన్ని బోధిస్తున్నట్లు ఉన్న విగ్రమం చూడముచ్చటగా ఉంటుంది. ఇక గుట్ట పై భాగం నుంచి చూస్తే చుట్టూ ఉన్న ప్రక`తి అందాలు కనువిందును చేస్తాయి.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

ఈ గుడికి కింది భాగంలో శివుడి, పార్వతి మంటపాలు ఉన్నాయి. వీరిని ఇక్కడ మీనాక్షి సుందరేశ్వర్, మీనాక్షి పేర్లతో ఆరాధిస్తారు. ఇక ధ్వజస్తంభం వద్ద ఉన్న వినాయకుడి ఉపాలయం ఉంది. ఈ వినాయకుడిని నేత్ర వినాయగర్ అని అంటారు. నేత్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు ఈ వినాయకుడిని సందర్శిస్తే సత్వర ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం.

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

స్వామిమలై, స్వామినాథన్ దేవాలయం

P.C: You Tube

చెన్నై నుంచి స్వామిమలైకు 300 కిలోమీటర్లు. చెన్నై - విల్లుపురం- ట్రిచ్చి-కన్యాకుమారి రోడ్డు ద్వారా స్వామిమలైను చేరుకోవచ్చు. ఇక కుంభకోణం నుంచి స్వామిమలైకు కేవలం 11.8 కిలోమీటర్లు మాత్రమే. కుంభకోణం నుంచి నిత్యం ఇక్కడికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సలు ఉన్నాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+