Search
  • Follow NativePlanet
Share
» »తెహ్రి - గర్వాల్ - ఒక విభిన్న పర్యాటక ప్రదేశం !

తెహ్రి - గర్వాల్ - ఒక విభిన్న పర్యాటక ప్రదేశం !

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రి - గర్వాల్ తప్పక చూడ దాగిన పర్యాటక ప్రదేశం. ఇక్కడ కల అనేక యాత్రా స్థలాల తో పాటు తెహ్రి గర్వాల్ కూడా చూడ దగినది.

ఇక్కడకు వచ్చే సందర్శకులు ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్, హైకింగ్ వంటి వి కూడా చేస్తారు. అద్భుత ప్రకృతి అందాలు చూడవచ్చు. మరి తెహ్రి గర్వాల్ ప్రదేశ అందాలు తిలకించేందుకు సిద్ధం అవండి.

బదరి నాథ్

బదరి నాథ్

బదరీనాథ్ చార్ ధాం యాత్రలలో ఒక పుణ్య క్షేత్రం. ఇది తెహ్రి - గర్వాల్ జిల్లాలో కలదు. బదరీనాథ్ టెంపుల్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. విష్ణుమూర్తి అవతారం ఐన బదరినాధుడి ని పూజించేందుకు యాత్రికులు అధిక సంఖ్యలో వస్తారు.

Photo Courtesy: Abhishek Singh Bailoo

చంబ

చంబ

చంబ హిల్ స్టేషన్ తెహ్రి గర్వాల్ లో ఒక ప్రసిద్ధ ఆకర్షణ . సముద్ర మట్టానికి 1676 మీ. ల ఎత్తున కలదు. పైన్ మరియు దేవదారు వృక్షాలు అధికం. ఇక్కడ నుండి హిమాలయ పర్వతాలు చూడవచ్చు.
Photo Courtesy: (WT-en) Wikid

దేవప్రయాగ

దేవప్రయాగ

దేవప్రయాగ ఒక యాత్రా స్థలం. గంగ నది ఉప నదులైన అలకనంద, భాగిరథి నదులు ఇక్కడ కలుస్తాయి.

Photo Courtesy: Abhishek

ధనౌల్తి

ధనౌల్తి

తెహ్రి గర్వాల్ జిల్లాలో ఇది ఒక వీక్ ఎండ్ విహార ప్రదేశం. చంబ - మస్సూరీ మార్గంలో కలదు. ఇక్కడి నుండి డూన్ లోయ అందాలు తిలకించవచ్చు. రాక్ క్లైమ్బింగ్, రివర్ క్రాసింగ్ హైకింగ్, ట్రెక్కింగ్ లు చేయవచ్చు. కనీస సౌకర్యాలతో కూడిన వసతులు ఇక్కడ లభిస్తాయి.

Photo Courtesy: Kiran Jonnalagadda

కనతాల్

కనతాల్

తెహ్రి గర్వాల్ జిల్లాలో కనతాల్ ఒక చిన్న అందమైన గ్రామం. ఇక్కడి వారికి వారాంతపు విహారంగా వుంటుంది. పచ్చటి పరిసరాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, అడవులు ఈ ప్రదేశాన్ని ఆకర్షనీయం చేసాయి.

Photo Courtesy: Nimish2004

నరెంద్రనగర్

నరెంద్రనగర్

నరేంద్ర నగర్ రిషికేశ్ కు సమీపం లో వుండటం వలన, చాలా మంది పర్యాటకులు వస్తారు. ఇక్కడ కల వ్యూ పాయింట్ నుండి దూన్ వాలీ అందాలు, పవిత్ర గంగా నది దృశ్యాలు చూడవచ్చు.

Photo Courtesy: elly jonez

తెహ్రి డాం

తెహ్రి డాం

తెహ్రి డాం పర్యాటకులకు ఒక భారీ ఆకర్షణ. దీనిని భాగీరథి నది పై నిర్మించారు. ఈ డాం ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ గా నమ్ముతారు.

Photo Courtesy: Arvind Iyer

ఉత్తరకాశి

ఉత్తరకాశి

ఉత్తర కాశి ఒక అందమైన జిల్లా. హిందువులకు ఎంతో పవిత్ర మైనది. ఇది గంగా నది ఒడ్డున గంగోత్రి మరిఉ యమునోత్రి వంటి పుణ్యక్షేత్రాలకు సమీపంలో కలదు. ఇక్కడి నుండి టూరిస్ట్ లు దయారా బుగ్యాలు కు వెళ్ళవచ్చు. ఇది ఉత్తర కాశి - గంగోత్రి రోడ్ లో కలదు. ఇది ఒక గొప్ప స్కయింగ్ ప్రదేశం. హర కి దూన్ ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్రదేశం. ఇక్కడ నుండి ట్రెక్కింగ్ లో యమునోత్రి మరియు హనుమాన్ చట్టి లకు వెళ్ళవచ్చు. ఇక్కడ పర్యాటకులు వసతి గా అనేక మంచి గెస్ట్ హౌస్ లు, బంగాళా లు పొందగలరు.

Photo Courtesy: Barry Silver

ఉత్తరాఖండ్ హోటళ్ళకు క్లిక్ చేయండి

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+