Search
  • Follow NativePlanet
Share
» »ఏలినాటి శని మరణాన్ని సూచిస్తుందా? అయితే ఇక్కడకి వెళ్ళండి...

ఏలినాటి శని మరణాన్ని సూచిస్తుందా? అయితే ఇక్కడకి వెళ్ళండి...

ఖగోళ శాస్త్రంలో సూర్యునిచుట్టూ 8 గ్రహాలు వుంటాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మానవుని జీవితం మీద నవగ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఖగోళంలో వున్న గ్రహాలకూ,నవగ్రహాలకు కొన్ని వ్యత్యాసాలున్నాయి.

By Venkatakarunasri

ఖగోళ శాస్త్రంలో సూర్యునిచుట్టూ 8 గ్రహాలు వుంటాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో మానవుని జీవితం మీద నవగ్రహాలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఖగోళంలో వున్న గ్రహాలకూ,నవగ్రహాలకు కొన్ని వ్యత్యాసాలున్నాయి. సాటర్న్ దివ్య నవగ్రహాలలో ఒకటి. ఛాయాదేవి మరియు సూర్యదేవుని పుత్రుడు శనిమహా దేవుడు. మనుష్యుల జీవితావధిలో మూడు సార్లు ప్రవేశిస్తుందిఅనేదే జ్యోతిష్యశాస్త్రం.

పుంగుశని.మంకుశని మరియు మరణశని అనే రూపంలో శనీశ్వరుడు ప్రవేసిస్తాడు. పుంగుశని మంచిదని మరియు మంకుశని మరియు మరణశని చెడ్డదని చెప్తారు. ఇవంతా మనుష్యుల జన్మకుండలి మరియు క్రిందటి జన్మలపాపఫలాల అనుగుణంగా శని మంచిది లేదా చెడ్డదిచేస్తాడు. శని మానవజీవితంలో ప్రవేశించినతర్వాత ఏడున్నర సంలకాలం వుంటాడని నమ్ముతారు. అదేవిధంగా ఆ ఏలినాటిశని వున్న సమయంలో అయ్యే నష్టం,దుష్టపరిణామాలు తగ్గించుకోవటానికి ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళేతీరాలి. ఆ మహిమాన్వితమైన దేవాలయం ఎక్కడుంది? ఆ దేవాలయానికి ఎలా వెళ్ళాలి అనే దానినిగురించి వ్యాసం మూలంగా సంక్షిప్తంగా తెలుసుకుందాం.

శ్రీ ఆదికేశ్వర పెరుమాళ్ దేవాలయం, పెరుంబుదూర్

శ్రీ ఆదికేశ్వర పెరుమాళ్ దేవాలయం, పెరుంబుదూర్

ఈ దేవాలయం సుమారు 500నుంచి 1000 సంల ముందే నిర్మించారని చెప్పబడినది. ఇది తమిళనాడులోని తిరుప్పరంభూరు పక్కన కలదు. ఈ దేవాలయానికి అనేకమంది భక్తులు వస్తూవుంటారు.విశేషమేమిటంటే మైసూర్ మహారాజు టెంపుల్ కోసం ఒక బంగారు మంటపాన్ని నిర్మించారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఈ దేవాలయం పెరుంగలతూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాంబరం, ముడిచ్చూర్ మీదుగా కూడా వెళ్ళవచ్చును. ఈ దేవాలయానికి మణిమాంగలం ద్వారా సుమారు 45 నిలప్రయాణం ద్వారా చేరుకొనవచ్చును.

ఆపత్సహాయేశ్వరర్ దేవాలయం,ఆలంగుడి

ఆపత్సహాయేశ్వరర్ దేవాలయం,ఆలంగుడి

ఇది భారతదేశంలోని తమిళనాడులోని తిరువరూర్ జిల్లాలోని వలంగైమాన్ తాలూకాలో ఆలంగుడిగ్రామంలో ఈ దేవాలయంవుంది.ఈ దేవాలయం శివునికి అర్పితమైన ఒక హిందూదేవాలయం.ఇక్కడ శివుడు ఆపత్సహాయేశ్వరర్ అని పూజించబడుతున్నాడు.దేవాలయం సుమారు 2ఎకరాల విస్తీర్ణాన్ని కలిగివుంది.16వ శతాబ్దంలో ఇది చోళులచేత నిర్మించబడినదని నమ్ముతారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

ఆలంగుడి కుంభకోణంనుంచి సుమారు 18కిమీ ల దూరంలో వుంది. తమిళనాడు రాష్ట్ర రహదారి 66 నుండి సుమారు అరగంటలో చేరుకోవచ్చు.

శ్రీ పెరుమాళ్ దేవాలయం

శ్రీ పెరుమాళ్ దేవాలయం

ఈ మహిమాన్విత దేవాలయం కోయంబత్తూర్ జిల్లాలో వుంది. ఈ దేవాలయం శనిదేవునికి అంకితం చేయబడింది. తులసిమాలను సమర్పించి ఇక్కడి శనిభగవంతుడిని ఆరాధిస్తారు. ఈ దేవాలయంలో వందలకొలది భక్తులు ప్రతినిత్యం స్వామి దర్శనానికి వస్తారు. విశేషమేమిటంటే ఈ దేవాలయానికి వచ్చేభక్తులు తులసిమాలను స్వామికి సమర్పించి భక్తి,శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఏలినాటిశని ప్రభావంనుంచి బయటపడుతారని నమ్ముతారు.అంటే జీవితంలో ఉత్తమమైన అభివృద్ధిని శనిదేవుడు కరుణిస్తాడు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

కరమడైనుంచి సమీపంలోవున్న కండియూర్ పెరుమాళ్ దేవాలయానికి కోయంబత్తూర్ నుంచి సుమారు 1గంట సేపు ప్రయాణించవలసివుంటుంది.

పొంగుశనీశ్వరదేవాలయం

పొంగుశనీశ్వరదేవాలయం

తిరువరూర్ జిల్లాలోని తిరుకొల్లికడులోని పొంగు శనీశ్వరస్వామిదేవాలయం అత్యంత ప్రసిద్ధమైన దేవాలయం. శనివారం అపారజనసాగరం ఈ దేవాలయానికి వస్తారు. ఈ దేవాలయానికి వచ్చి భక్తితో శనిదేవున్ని ఆరాధిస్తే జీవితంలో అనుకోకుండా సంభవించే నష్టాలను తగ్గించుకొనవచ్చును.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

మన్నార్ గుడికి కేవలం 40నిలలో చేరుకొనవచ్చును.అక్కడి నుంచి కత్తలై అనే గ్రామం నుంచి కేవలం 20కిమీ ల దూరంలో వుంది.

శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం

శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం

శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం తిరువన్నామలై జిల్లాలో వుంది. ఇక్కడ ఏకాదశినాడు విశేషంగా పండుగను ఆచరిస్తారు. ఇక్కడ ముఖ్యంగా శివుడు,నరసింహస్వామి విగ్రహాలున్నాయి.

శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం

శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం

ఈ దేవాలయం మేల్మరువత్తూరుకి వెళ్ళేదారిలో, కేవలం 1గంటలో వెళ్ళవచ్చును.

నాగేశ్వరర్ దేవాలయం

నాగేశ్వరర్ దేవాలయం

ఈ నాగేశ్వరర్ దేవాలయం నామక్కల్ జిల్లాలో వుంది.తిరువాడియార్ అనే పండుగరోజున విశేషంగా పండుగను ఆచరిస్తారు.ఈ సమయంలో అనేకమంది భక్తులు వస్తారు.

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

నామక్కల్ నుంచి కేవలం 25కిమీ ల దూరంలోవుంది.ఈ దేవాలయం సమీపంలో అనేకదేవాలయాలు వున్నాయి,అవి మారియమ్మన్,రామస్వామి దేవాలయాలు వున్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+