Search
  • Follow NativePlanet
Share
» »శ్రింగేరి పర్యాటక ఆకర్షణలు !!

శ్రింగేరి పర్యాటక ఆకర్షణలు !!

శ్రింగేరి పట్టణం, కర్నాటక రాష్ట్రం లోని చికమగలూరు జిల్లాలో కలదు. శ్రింగేరి హిందువులకు ఒక ప్రసిద్ధ యాత్రా ప్రదేశం. సుమారు ఎనిమిదవ శతాబ్దంలో జీవించిన అద్వైత సిద్ధాంత కర్త శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్య స్థాపించిన నాలుగు ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠాల లో ఇది ఒకటి.

ఇతర పీఠాల ను బదరీ నాద, పూరి, మరియు ద్వారక లలో చూడవచ్చు. శ్రింగేరి పట్టణం తుంగా నది ఒడ్డున కలదు. స్థల పురాణం మేరకు ఈ అద్భుత శ్రింగేరి పట్టణం విభాండక అనే రుషి మరియు ఆ రుషి కుమారుడు అయిన ఋష్య శృంగుడు ఇక్కడ నివసించారు.

శ్రింగేరి పట్టణం బెంగుళూరు కు 332 కి. మీ. లు. ప్రసిద్ధ మంగళూరు నుండి 120 కి. మీ. ల దూరంలో కలదు. బెంగుళూరు నుండి కర్నాటక ప్రభుత్వ బస్సు లు, అనేక ఇతర ప్రైవేటు బస్సు లలో శ్రింగేరి చేరవచ్చు.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

శృంగేరి లో అనేక దేవాలయములు కలవు. వాటిలో విద్యాశంకర దేవాలయం ప్రధానమైనది. ఈ దేవాలయం పదునాల్గవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులచే నిర్మించబడినది. ఇక్కడ రాశి చక్రం లో కల పన్నెండు రాశులకు పన్నెండు స్తంభాలు కలవు. సూర్య గతి ని అనుసరించి ఈ రాశులపై సూర్యుడి ఆయా మాసాలలో సూర్యకిరణాలు ఆ స్తంభాలపై పడతాయి.

చిత్రకృప : Calvinkrishy

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

విధా శంకర దేవాలయ ఆవరణలోనే కల మరొక ప్రముఖ దేవాలయం శారదాంబ పీఠం. జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య స్తాపింక్ హిన నాలుగు మహా పీఠాలలో శ్రింగేరి శారదాంబ పీఠం మొదటిది.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ఇది తుంగా నదిపై అడ్డంగా నిర్మించిన ఒక వంతెన. విద్యా శంకర దేవాలయం నుండి శ్రింగేరి పీఠాదిపతి నివాస భవనమునకు వెళ్ళుటకు ఈ వంతెన మీదుగా వెళ్ళాలి.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

తుంగా నదీ నీటిలో సంచరించే చేపలు పైకి కనపడుతూ అందంగా విహరిస్తూ ఉంటాయ్. కాని వీటిని ఎవరూ పట్టటం , వదలటం వంటివి చేయరు.

చిత్రక్రుప: Philanthropist 1

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

భక్తులు వేసిన ఆహార పదార్ధాలను ఈ చేపలు తింటూ తిరుగాడుతూ వుంటాయి. పర్యాటకులకు ఇది ఒక ఆకర్షణీయ దృశ్యం.

చిత్ర కృప : Dineshkannambadi

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

విద్యా శంకర దేవాలయం ఆవరణలో భక్తులు సంచరించే దృశ్యం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

శృంగేరి లో ఆది శంకరులవారు ఒక పాము పడగ నీడలో కప్ప గుడ్లను పెట్టటం చూసి. సహజ వైరం కల జీవులు సైతం మిత్రత్వం నేరపటంలో కల మహత్యాన్ని ఆ స్థల మహత్యంగా గుర్తించారు. శృంగేరి ప్రదేశం తాను స్థాపించ దలుచుకున్న మాత శృంగేరి శారదాంబ పీఠం కు సరైనదని గుర్తించారు.

చిత్ర కృప : Sarvagnya

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

తుంగా నది ఒడ్డున కల శ్రీ శారదాంబ పీఠం నుండి సుమారు 2 కి. మీ. ల దూరం లో ప్రసిద్ధ హరిహర పురం కలదు.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

హరిహర పురం లో కల శారదాంబ శ్రీ మఠం ఇది. ఇక్కడకు అనేకమంది భక్తులు వస్తారు.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

శ్రింగేరి దేవాలయం కు 10 కి. మీ. ల దూరంలో ఋష్యశృంగ పురం అనే వూరు కలదు. ఇక్కడ ఋష్యశృంగుడు ప్రతి రోజూ ఆరాధించే శివలింగంలో ఆయన ఆత్మ ఐక్యం అయినట్లు చెపుతారు. ఇక్కడకు కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

శృంగేరి నుండి సుమారు 72 కి. మీ. ల దూరంలో కలశ అనే మరొక పుణ్యక్షేత్రం కలదు. భద్రా నది తీరంలో కల ఈ క్షేత్రంలో అనేక దేవాలయాలు కలవు. వాటిలో కలేస్వస్వర, గిరిజామ్బా, హనుమాన్, వెంకటరమణ, మరియు శ్రీ చంద్ర నాద స్వామీ దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి.

చిత్ర కృప: Wind4wings

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

కలశ ప్రదేశం సమీపంలోనే మరొక పుణ్య క్షేత్రం హొరనాడు దేవాలయం. ఇక్కడ మాత అన్నపూర్ణా దేవి భక్తులను ఆశీర్వదిస్తూ ప్రధాన దేవతగా విలసిల్లుతోంది.

చిత్ర కృప : Gnanapiti

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

ప్రఖ్యాత ఆధ్యాత్మిక పీఠం

శృంగేరి కి సుమారు 35 కి. మీ. ల దూరంలో రంభాపురి మఠం బాలే హేన్నూరు అనే ప్రదేశంలో కలదు. ఇక్కడ నిర్మించిన బాలే హేన్నూర్ వంతెన ఈ ప్రదేశంలో మొట్ట మొదటి మేసోనరి వంతెన.

చిత్ర కృప : murli

శృంగేరి పుణ్యక్షేత్ర మరిన్ని ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+